Air Lines: ఎయిర్‌పోర్ట్‌ అథారిటీకి రూ.2.6వేల కోట్లు బాకీపడ్డ దేశీయ ఎయిర్‌లైన్స్‌!

దేశంలోని ప్రముఖ ఎయిర్‌లైన్స్‌ సంస్థలు ఎయిర్‌పోర్టు అథారిటీకి భారీ మొత్తంలో బాకీలు చెల్లించాల్సి ఉందని సంబంధిత అధికారులు వెల్లడించారు. ఇండిగో, స్పైస్‌జెట్‌, గో ఎయిర్‌, ఎయిర్‌ ఏషియా ఇండియా, ఎయిర్‌ ఇండియా, విస్తారా సంస్థలన్నీ కలిసి గతేడాది జనవరి నాటికి రూ. 2,306.59కోట్లు బాకీ పడ్డాయని, వాటిని

Published : 29 Dec 2021 15:24 IST

దిల్లీ: దేశంలోని ప్రముఖ ఎయిర్‌లైన్స్‌ సంస్థలన్నీ భారత ఎయిర్‌పోర్టు అథారిటీకి భారీ మొత్తంలో బాకాయిలు చెల్లించాల్సి ఉందని సంబంధిత అధికారులు వెల్లడించారు. ఇండిగో, స్పైస్‌జెట్‌, గో ఎయిర్‌, ఎయిర్‌ ఏషియా ఇండియా, ఎయిర్‌ ఇండియా, విస్తారా సంస్థలన్నీ కలిసి గతేడాది జనవరి నాటికి రూ. 2,306.59కోట్లు బాకీ పడ్డాయని, వాటిని చెల్లించకపోవడంతో ఆ మొత్తం ఈ ఏడాది అక్టోబర్‌ నాటికి 14.29శాతం పెరిగి.. రూ.2,636.34కోట్లకు చేరుకుందని పేర్కొన్నారు. 

విమానాశ్రయాల్లో విమానాలకు నేవిగేషన్‌, ల్యాండింగ్‌, పార్కింగ్‌ కోసం విమాన సంస్థలు పౌరవిమానయానశాఖ పరిధిలో ఉండే ఎయిర్‌పోర్ట్‌ అథారిటీకి డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. వసూలు చేసిన డబ్బును దేశంలోని ఎయిర్‌పోర్టుల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఖర్చు చేస్తుంటారు.

అయితే, ఎయిర్‌ ఏషియా ఇండియా తమ బకాయిలను పూర్తిగా చెల్లించినట్లు తాజాగా వెల్లడించింది. అక్టోబర్‌ 2021 నాటికి ఈ సంస్థ ఎయిర్‌పోర్ట్‌ అథారిటీకి రూ.3.58కోట్లు బాకీ పడగా.. ఆ మొత్తాన్ని చెల్లించామని, ఆ తర్వాత క్రమం తప్పకుండా చెల్లింపులు చేస్తున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు.

Read latest Business News and Telugu News

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని