Indian Railway: UTSతో సులువుగా జనరల్ టికెట్.. కొత్తగా వచ్చిన మార్పులు తెలుసా?
Indian Railway UTS app: తరచూ రైలులో ప్రయాణించే వారు టికెట్ కోసం ఎక్కువ సమయం నిరీక్షించే అవసరం లేకుండా రైల్వే శాఖ యూటీఎస్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా ప్రజలకు టికెట్ కొనుగోలును సులభతరం చేసింది.
ఇంటర్నెట్‌డెస్క్: తక్కువ ఖర్చు, సమయం ఆదా వంటి కారణాలతో రైలు ప్రయాణమంటే ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తారు. రోజూ ప్రయాణం చేసే వారూ బోలెడు మంది. పని నిమిత్తం కార్యాలయాలకు, పాఠశాలలకు, కళాశాలలకు వెళ్లేవారు సాధారణంగా జనరల్ బోగీల్లో ప్రయాణిస్తుంటారు. అయితే, టికెట్ తీసుకునేందుకు కౌంటర్ దగ్గర ఎక్కువ సమయం నిరీక్షించాల్సి వస్తుంది. ఒక్కోసారి భారీ క్యూలైన్ కారణంగా టికెట్ దొరకని సందర్భాలూ ఉంటాయి. ఇటువంటి ఇబ్బందులకు చెక్ పెట్టేందుకే రైల్వే శాఖ అన్‌రిజర్వ్‌డ్ టికెట్ బుకింగ్ స్టమ్‌ను (UTS) యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. రోజూ ప్రయాణించే వారిని దృష్టిలో పెట్టుకుని వారి సమయాన్ని వృథా కానివ్వకుండా, పెద్ద క్యూలైన్లను తగ్గించటానికి రైల్వే శాఖ ఇందులో తాజాగా మార్పులను చేసింది. ఈ యాప్ మీ ఫోన్ జీపీఎస్ ఆధారంగా యాప్ పనిచేస్తుందన్న విషయం తెలిసిందే. ఉదాహరణకు మీరు మలక్ పేట స్టేషన్‌లో టికెట్ బుక్ చేయాలంటే దానికి నిర్ణీత దూరంలో ఉంటేనే అక్కడి నుంచి బయల్దేరే రైలు టికెట్ బుక్ చేసుకోవచ్చు.
ఇప్పటి వరకు సబర్బన్ ప్రాంతాల్లో రైల్వే స్టేషన్ నుంచి 2 కిలోమీటర్ల దూరం వరకు మాత్రమే అన్‌రిజర్వ్‌డ్ టికెట్‌ను కొనుగోలు చేసే వీలుండేది. ఇప్పుడు ఆ దూరాన్ని 5 కిలోమీటర్లకు పెంచింది. దీన్ని మరింత పెంచుకునేందుకు ఆయా రైల్వే జోన్లకు అవకాశం కల్పించింది. అదే విధంగా ఇతర ప్రాంతాల్లో 5 కిలోమీటర్లు ఉన్న దూరాన్ని 20 కిలోమీటర్లకు పెంచింది. రైల్వేశాఖ సూచనల నేపథ్యంలో సబర్బన్ ప్రాంతాల్లో గరిష్ఠంగా 10 కిలోమీటర్ల దూరం నుంచి కూడా టికెట్ బుక్ చేసుకునే వెసులుబాటును దక్షిణ మధ్య రైల్వే కల్పించింది.
టికెట్ బుకింగ్ ఇలా..
స్మార్ట్‌ఫోన్, ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్నవారు గూగుల్ ప్లేస్టోర్ ద్వారా యూటీఎస్ యాప్‌ను డౌన్ చేసుకోవచ్చు. యాప్ తెరిచాక.. ఫోన్ నంబర్, పేరు, పాస్‌వర్డ్, పుట్టిన తేదీ తదితరాలు నమోదు చేశాక.. ఓటీపీ ఆధారంగా ఖాతా నమోదు ప్రక్రియ పూర్తవుతుంది. ఆ తర్వాత ఫోన్ నంబర్, పాస్‌వర్డ్‌తో లాగిన్ అయితే సాధారణ బుకింగ్, క్విక్ బుకింగ్, ప్లాట్‌ఫాం, సీజన్ టికెట్, క్యూఆర్ బుకింగ్, క్యాన్సిల్ టికెట్ తదితర ఐచ్ఛికాలు కనిపిస్తాయి. ఆండ్రాయిడ్, ఐఓఎస్ స్మార్ట్‌ఫోన్‌ల్లో యూటీఎస్ యాప్‌ను ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఆర్-వ్యాలెట్, పేటీఎం, మొబిక్విక్ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఇలా అన్నింటి ద్వారా నగదు చెల్లించవచ్చు.
సాధారణ బుకింగ్: ఈ తరహా బుకింగ్ కోసం యూటీఎస్ యాప్‌లో బుక్‌టికెట్స్ మెనూలోని ‘నార్మల్ బుకింగ్’ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. మీరు ఎక్కడ నుంచి ప్రయాణించాలనుకుంటున్నారో ఆ స్టేషన్ పేరు/కోడ్ అలాగే చేరుకోవాల్సిన స్టేషన్ పేరు/కోడ్ వివరాలు నమోదు చేయాలి. తరవాత ప్యాసింజర్ల సంఖ్య, ట్రైన్ టైప్ (ప్యాసింజర్, ఎక్స్‌ప్రెస్) మీకు ఏ టికెట్ కావాలో ఎంచుకోవాలి.
ప్లాట్‌ఫామ్ టికెట్: డ్యాష్‌బోర్డులో ఉండే ‘ప్లాట్‌ఫామ్ బుకింగ్’ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. స్టేషన్ నంబర్, టికెట్ల సంఖ్య నమోదు చేసుకోవాలి.
క్యూఆర్ కోడ్ టికెట్ బుకింగ్: ఈ తరహా బుకింగ్ క్యూఆర్ కోడ్ బోర్డ్ ఏర్పాటు చేసిన రైల్వే స్టేషన్‌ల్లో మాత్రమే సాధ్యమవుతుంది. రైల్వే స్టేషన్‌కు వెళ్లి యూటీఎస్ యాప్‌లో టికెటింగ్‌లో ‘బుక్ టికెట్’ ఎంచుకోవాలి. అందులో ఉన్న ‘క్యూఆర్ బుకింగ్’ ఆప్షన్‌ను సెలెక్ట్ చేసుకొని, స్టేషన్‌లోని క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయాలి. మీరు చేరుకోవాల్సిన ప్రాంతాన్ని ఎంచుకొని పేరు/కోడ్ ఎంటర్ చేయాలి.
ఇవి గుర్తుంచుకోండి..
- మీకు పేపర్, పేపర్‌లెస్ ఇలా ఏ టికెట్ కావాలో ఎంచుకొనే వెసులు బాటు ఉంది.
- మీరు ఇ-వాలెట్ లేదా ఎటువంటి ఆన్‌లైన్ పేమెంట్ పద్దతుల ద్వారా అయినా డబ్బు చెల్లించవచ్చు.
- డబ్బు కట్టిన తర్వాత టికెట్ బుక్ అయినట్టు మీకు మెసేజ్ అందుతుందనే విషయాన్ని గుర్తుంచుకోండి.
- టికెట్ చూడాలనుకుంటే యూటీఎస్ యాప్‌లో డ్యాష్‌బోర్డ్‌లో ‘షో టికెట్’ ఆప్షన్‌ను ఎంచుకోండి. అక్కడ మీ టికెట్ చూడవచ్చు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Viral: ప్రొజెక్టర్ స్క్రీన్‌గా బెడ్‌షీట్.. ఇది కదా వాడకమంటే..!
-
Movies News
94 ఏళ్ల వయసులో మళ్లీ కెమెరా ముందుకు
-
World News
Taliban: బంధుప్రీతిపై తాలిబన్ల కన్నెర్ర..!
-
India News
Shocking: షాకింగ్.. డ్యాన్స్ చేస్తూ కుప్పకూలి ప్రభుత్వ ఉద్యోగి మృతి!
-
World News
Japan: చైనాకు చెక్ పెట్టేలా.. రూ.6 లక్షల కోట్లతో భారీ ప్రణాళిక!
-
Sports News
Virender Sehwag: టీమ్ఇండియా కోచింగ్ ఆఫర్.. నాకు ఆ అవకాశం రాలేదు!:సెహ్వాగ్