Indian Railway: ప్రయాణికుల కోసం రైల్వే మరో సదుపాయం.. వాట్సాప్‌లో ఫుడ్ ఆర్డర్
Indian Railway: వాట్సాప్ ద్వారా ఫుడ్ ఆర్డర్ చేసుకోవడానికి రైల్వే శాఖ కొత్త వాట్సాప్ నంబర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఎంపిక చేసిన రైళ్లలోనే తొలుత దీన్ని అందిస్తున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: రైళ్లలో ప్రయాణించే వారికి కోసం రైల్వే శాఖ (Indian Railway) మరో సదుపాయం తీసుకొచ్చింది. ప్రయాణంలో ఫుడ్ ఆర్డర్ (Food order) చేసుకోవడాన్ని మరింత సులభతరం చేసింది. వాట్సాప్ (Whatsapp) ద్వారా ఇకపై ఈ సేవలను పొందే సదుపాయాన్ని తీసుకొచ్చింది. తమ ఈ-కేటరింగ్ సేవలను మరింత సులభతరం చేయడంలో భాగంగా తొలుత ఎంపిక చేసిన రైళ్లలో ఈ సేవలను తీసుకొచ్చినట్లు తెలిపింది.
ఐఆర్‌సీటీసీ ప్రస్తుతం www.ecatering.irctc.co.in, ఫుడ్ ఆన్ ట్రాక్ అనే యాప్ ద్వారా ఈ సదుపాయాన్ని అందిస్తోంది. తాజాగా 87500 01323 అనే వాట్సాప్ నంబర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇకపై ట్రైన్ టికెట్ బుక్ చేసుకోగానే ఈ వాట్సాప్ నంబర్ నుంచి ఈ-కేటరింగ్ సర్వీస్ సేవలకు సంబంధించి www.ecatering.irctc.co.in వెబ్‌సైట్ లింక్ వస్తుంది. అక్కడ కస్టమర్లు అందుబాటులో ఉన్న స్టేషన్లలో తమకు నచ్చిన రెస్టారెంట్ నుంచి ఆహారాన్ని ఆర్డర్ చేసుకోవచ్చు. ఆ తర్వాత నుంచి ఏఐ ఆధారిత చాట్‌బోట్ ఈ కేటరింగ్‌కు సంబంధించిన సేవలను నేరుగా అందిస్తుంది.
ప్రస్తుతం ఐఆర్‌సీటీసీ ఈ-కేటరింగ్ ద్వారా రోజుకు ఐఆర్‌సీటీసీ 50 వేల మీల్స్‌ను ప్రయాణికులకు అందిస్తున్నామని రైల్వే శాఖ తెలిపింది. ప్రస్తుతానికి ఎంపిక చేసిన రైళ్లలో మాత్రమే ఈ సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్నామని, వినియోగదారుల నుంచి వచ్చిన స్పందన ఆధారంగా మిగిలిన రైళ్లకూ విస్తరిస్తామని తెలిపింది. ఇప్పటికే జూప్ అనే థర్డ్‌పార్టీ ఆన్‌లైన్ పుడ్ ప్లాట్‌ఫాం గతేడాదే వాట్సాప్ చాట్‌బోట్ ద్వారా రైళ్లలోకి ఆహారాన్ని అందించే సేవలను ప్రారంభించింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ts-top-news News
JEE Advanced: జేఈఈ అడ్వాన్స్డ్ కొంత కఠినమే..
-
Ap-top-news News
Tirumala: శ్రీవారి ఆలయ సమీపంలో వెళ్లిన విమానం
-
Sports News
Lionel Messi: చిరునవ్వుతో టాటా.. పీఎస్జీని వీడిన మెస్సి
-
India News
పామును కొరికి చంపిన బాలుడు
-
India News
28 వేల మంది జమ్మూకశ్మీర్ ప్రభుత్వోద్యోగులపై ఐటీ శాఖ నిఘా
-
India News
అనాథకు.. తండ్రిని చూపిన అన్నదానం