Watch: ఆటోమేటిక్‌ వాషింగ్‌ ప్లాంట్స్‌తో 20 నిమిషాల్లోనే రైలు క్లీన్‌!

Indian Railways: రైళ్లను శుభ్రపరచటం కోసం ఇండియన్‌ రైల్వే ఆటోమేటిక్ కోచ్ వాషింగ్ ప్లాంట్లను తీసుకొచ్చింది. దానికి సంబంధించిన వీడియోను ‘ఎక్స్‌’ ఖాతాలో పంచుకుంది.

Updated : 27 Sep 2023 20:38 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: నిత్యం ప్రయాణికులకు సేవలందించే రైళ్లను శుభ్రపరచడం అంత తేలికైన పని కాదు. సాధారణంగా అయితే ఎంతో మంది శ్రామికులు కొన్ని గంటల పాటు శ్రమిస్తే గానీ ఒక రైలును శుభ్రపరచలేరు. పైగా ఇందు కోసం ఎక్కువ నీటిని వినియోగించాల్సి ఉంటుంది. ఇటువంటి ఇబ్బందులకు పుల్‌స్టాప్‌ పెడుతూ ఇండియన్‌ రైల్వే ఆటోమేటిక్‌ వాషింగ్ ప్లాంట్స్‌ను ఏర్పాటు చేసింది. వీటి సాయంతో కేవలం 15 నుంచి 20 నిమిషాల్లోనే సులువుగా రైలును శుభ్రపరచొచ్చు. తాజాగా దీనికి సంబంధించిన వీడియోను రైల్వే శాఖ పంచుకుంది.

యూపీఐ ఎఫెక్ట్‌.. రూపే కార్డులకు భలే డిమాండ్‌..!

‘‘ఆటోమేటిక్ కోచ్ వాషింగ్ ప్లాంట్‌లను రైళ్లను శుభ్రపరచడం కోసం ఇండియన్‌ రైల్వే తీసుకొచ్చింది. ఇందులో అధునాతన ఫీచర్లు కలిగిన హై ప్రెజర్‌ వాటర్‌ జెట్లు, సమాంతరంగా, నిలువుగా ఉండే రొటేటింగ్‌ బ్రష్‌లు ఉన్నాయి. వీటి సాయంతో సులువుగా రైళ్లను శుభ్రపరచవచ్చు. దీనికోసం ఎక్కువ నీరు కూడా అవసరం ఉండదు. తక్కువ విద్యుత్‌, పరిమిత మానవ వనరులతో తక్కువ సమయంలో రైళ్లను శుభ్రపరుచుకోవచ్చు’’ అని రైల్వే మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఒక్కో ప్లాంట్‌కు సుమారు రూ.1.9 కోట్లు వరకు ఖర్చవుతుంది. ఈ ఏడాది ఆగస్టు నాటికి దేశవ్యాప్తంగా ఈ తరహా 67 ప్లాంట్లు ప్రారంభించామని తెలిపింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని