T+1 Settlement: షేర్ల ట్రేడింగ్ లావాదేవీలలో కొత్త విధానం
భారతీయ స్టాక్ మార్కెట్‌లు ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈలు శుక్రవారం నుంచి కొత్త సెటిల్‌మెంట్ విధానాన్ని అమలు చేయనున్నాయి. దీనివల్ల మార్కెట్‌లో పెట్టుబడులు వేగంగా జరుగుతాయని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ముంబయి: భారతీయ స్టాక్ మార్కెట్ (Stock Markets)లు శుక్రవారం నుంచి షేర్ ట్రేడింగ్ లావాదేవీలకు సంబంధించి కొత్త విధానాన్ని అమలు చేయనున్నాయి. దీంతో ట్రేడర్ల లావాదేవీ పూర్తయిన 24 గంటల వ్యవధిలోపు T+1 (Trade Plus One) విధానంలో సెటిల్‌మెంట్ జరుగుతుంది. దీనివల్ల ఇన్వెస్టర్ల మార్కెట్లో పెట్టుబడులు మరింత వేగంగా జరుగుతాయని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గతంలో ట్రేడింగ్ పూర్తయిన రోజు నుంచి మూడు రోజులకు అంటే T+3 విధానంలో సెటిల్ చేసేవారు. తర్వాత 2003లో ఈ వ్యవధిని T+2 అంటే రెండు రోజులకు తగ్గించారు. తాజాగా T+1 విధానం ద్వారా ఒక రోజుకు పరిమితం చేయనున్నారు.
భారతీయ స్టాక్ మార్కెట్‌లు ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈ (NSE, BSE)లు 2021 నవంబరులో T+1 విధానం గురించి ప్రకటించాయి. ఈ మేరకు ఫిబ్రవరి 25, 2022 నుంచి తొలి దశలో భాగంగా మార్కెట్ విలువ తక్కువగా ఉండి, స్టాక్ మార్కెట్‌లో కింద నుంచి 100 స్థానాల్లో ఉన్న కంపెనీల షేర్లకు ఈ విధానాన్ని అమలు చేయనున్నట్లు వెల్లడించాయి. తర్వాత మార్చి 2022 నుంచి ప్రతి నెలా చివరి శుక్రవారం మార్కెట్ విలువ పరంగా కింది నుంచి తర్వాతి 500 స్థానాల్లో ఉన్న షేర్లకు ఈ విధానాన్ని అమలు చేశాయి.
ఈ పద్ధతిలో స్టాక్ ఎక్స్ఛేంజీల్లో నమోదైన అన్ని కంపెనీలకు దశల వారీగా ఈ విధానాన్ని అమలు చేస్తామని తెలిపాయి. ఈ ప్రక్రియ శుక్రవారంతో (జనవరి 27, 2023) పూర్తవుతుండటంతో రేపటి నుంచి స్టాక్ ఎక్స్ఛేంజీల్లోని అన్ని షేర్లకు T+1 విధానం అమలుకానుంది. సెటిల్‌మెంట్‌లో ఈ తరహా విధానం అమలు చేయడం ఇదేం తొలిసారి కాదు. 2002లో సెబీ T+5 నుంచి T+3కి, 2003లో T+2కి తగ్గించింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
ఐపీఎల్ పూర్తి షెడ్యూల్.. హైదరాబాద్‌లో మ్యాచ్‌లు ఎప్పుడంటే..
-
India News
శ్రీరామ నామాలు జమ చేస్తే.. పుణ్యం పంచే ఆధ్యాత్మిక బ్యాంక్!
-
World News
మొబైల్‌పై ఇంత వ్యామోహమా!..సెల్‌ఫోన్ పితామహుడు మార్టిన్ కూపర్ ఆవేదన
-
Crime News
పెళ్లి చేసుకోవాలని వేధింపులు.. యువకుణ్ని హతమార్చిన యువతి
-
Politics News
అఖండ హిందూ రాజ్యమే లక్ష్యం.. శోభాయాత్రలో ఎమ్మెల్యే రాజాసింగ్
-
Ts-top-news News
ఆర్టీసీ ప్రయాణికులపై టోల్ పెంపు వడ్డన?