Indian Economy: కరోనా నుంచి భారత్‌ బలంగా పుంజుకుంది: అమెరికా

కరోనా మహమ్మారి మూడు దశల్లో విజృంభించినప్పటికీ.. భారత ఆర్థిక వ్యవస్థ బలంగా పుంజుకుందని అమెరికా ఆర్థికశాఖ అక్కడి చట్టసభలకు సమర్పించిన నివేదికలో పేర్కొంది....

Updated : 11 Jun 2022 17:16 IST

వాషింగ్టన్‌: కరోనా మహమ్మారి మూడు దశల్లో విజృంభించినప్పటికీ.. భారత ఆర్థిక వ్యవస్థ బలంగా పుంజుకుందని అమెరికా ఆర్థికశాఖ అక్కడి చట్టసభలకు సమర్పించిన నివేదికలో పేర్కొంది. 2021 మధ్యలో విజృంభించిన రెండో దశ కరోనా భారత ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపినట్లు వివరించింది. అయినప్పటికీ.. ద్వితీయార్ధంలో తిరిగి బలంగా పుంజుకున్నట్లు పేర్కొంది. వ్యాక్సినేషన్‌ ప్రక్రియ వేగంగా కొనసాగడమే అందుకు దోహదం చేసినట్లు తెలిపింది.

2021 ఆఖరుకు భారత జనాభాలో 44 శాతం మందికి వ్యాక్సిన్ అందినట్లు నివేదిక పేర్కొంది. దీంతో 2020లో ఏడు శాతం క్షీణించిన దేశ ఆర్థిక వృద్ధి రేటు 2021 రెండో త్రైమాసికం నాటికి కొవిడ్‌ మునుపటి స్థాయికి చేరుకున్నట్లు వివరించింది. 2021 మొత్తం ఏడాదిలో వద్ధిరేటు ఎనిమిది శాతంగా నమోదైనట్లు గుర్తుచేసింది. 2022 ఆరంభం నుంచి ఒమిక్రాన్‌ వేరియంట్‌ వల్ల మూడో దశ కరోనా విజృంభించినట్లు తెలిపింది. కానీ, మరణాలు, ఆర్థిక వ్యవస్థపై ప్రభావం మాత్రం పరిమితంగానే ఉన్నట్లు వివరించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని