Russian Crude Oil: 35 శాతం చమురు రష్యా నుంచే
Russian Crude Oil: వోర్టెక్సా వివరాల ప్రకారం ఫిబ్రవరిలో ఇరాక్ నుంచి రోజుకు 9,39,921 బ్యారెళ్లు, సౌదీ అరేబియా నుంచి 6,47,813 బ్యారెళ్లు, యూఏఈ నుంచి 4,04,570 బ్యారెళ్లు, అమెరికా నుంచి 2,48,430 బ్యారెళ్లు, రష్యా నుంచి 16 లక్షల బ్యారెళ్ల చమురు భారత్‌కు దిగుమతి అయ్యింది.
దిల్లీ: రష్యా (Russia) నుంచి భారత్‌కు చమురు (Crude Oil) దిగుమతి ఫిబ్రవరిలో మరింత పెరిగింది. మన దేశానికి చమురు (Crude Oil) సరఫరా చేస్తున్న దేశాల జాబితాలో రష్యా (Russia) వరుసగా ఐదోనెలా తొలిస్థానంలో నిలిచింది. 2023 ఫిబ్రవరిలో రికార్డు స్థాయిలో రోజుకు 16 లక్షల పీపాలకు పైగా చమురు (Crude Oil) దిగుమతి అయినట్లు ఇంధన సరఫరా సమాచారాన్ని సేకరించే వోర్టెక్సా వెల్లడించింది. ఇది ఇరాక్, సౌదీ అరేబియా.. రెండూ కలిపి భారత్‌కు సరఫరా చేస్తున్న చమురు కంటే ఎక్కువ కావడం గమనార్హం.
2022 మార్చి 31 నాటికి భారత్ ఏటా దిగుమతి చేసుకుంటున్న చమురు (Crude Oil)లో రష్యా (Russia) వాటా కేవలం 0.2 శాతం మాత్రమే. ఫిబ్రవరి నాటికి అది రోజుకి 16 లక్షల బ్యారెళ్లకు చేరడం గమనార్హం. గత ఏడాది నవంబరులో రోజుకి 9,09,403 బ్యారెళ్లు, అక్టోబరులో 9,35,556 పీపాల చమురు దిగుమతి అయ్యింది. అక్టోబరులో తొలిసారి ఇరాక్, సౌదీ అరేబియాను అధిగమించి భారత్‌కు చమురు సరఫరా చేస్తున్న అతిపెద్ద దేశంగా రష్యా (Russia) నిలిచింది. భారత్ దిగుమతి చేసుకుంటున్న చమురులో ఇప్పుడు 35 శాతం రష్యా నుంచే వస్తోంది.
జలమార్గాన సరఫరా అవుతున్న రష్యా (Russia) చమురు ధరపై ఐరోపా సమాఖ్య పరిమితి విధించిన విషయం తెలిసిందే. దీంతో ఒక్కో పీపా ఇప్పుడు 60 డాలర్ల కంటే తక్కువకే దొరుకుతోంది. ఈ నేపథ్యంలోనే రష్యా నుంచి భారత్ దిగుమతుల్ని మరింత పెంచిందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ప్రపంచంలో అత్యధికంగా చమురు వినియోగించుకునే దేశాల్లో భారత్ మూడోది. మొత్తం చమురు అవసరాల్లో 85 శాతం దిగుమతుల ద్వారానే సమకూర్చుకుంటోంది.
వోర్టెక్సా వివరాల ప్రకారం ఫిబ్రవరిలో ఇరాక్ నుంచి రోజుకు 9,39,921 బ్యారెళ్లు, సౌదీ అరేబియా నుంచి 6,47,813 బ్యారెళ్లు, యూఏఈ నుంచి 4,04,570 బ్యారెళ్లు, అమెరికా నుంచి 2,48,430 బ్యారెళ్ల చమురు భారత్‌కు దిగుమతి అయ్యింది. భారత్‌కు చమురు సరఫరా చేస్తున్న దేశాల జాబితాలో అమెరికాను అధిగమించి యూఏఈ నాలుగో స్థానానికి చేరింది. సౌదీ నుంచి చమురు దిగుమతులు 16 శాతం, అమెరికా నుంచి 38 శాతం కుంగాయి.
ఉక్రెయిన్‌పై యుద్ధానికి దిగిన రష్యాను నిలువరించడం కోసం పశ్చిమ దేశాలు ఆ దేశ చమురుపై ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. దీంతో తమ చమురును రాయితీ ధరకు అందించడానికి రష్యా ముందుకు వచ్చింది. అప్పటి నుంచి భారత్ పెద్ద మొత్తంలో ఆ దేశం నుంచి చమురును దిగుమతి చేసుకుంటోంది. యుద్ధం ప్రారంభానికి ముందు పశ్చిమాసియా దేశాల నుంచే భారత్ 60 శాతం దిగుమతి చేసుకునేది. మరో 14 శాతం ఉత్తర అమెరికా దేశాలు, 12 శాతం పశ్చిమ ఆఫ్రికా దేశాలు, లాటిన్ అమెరికా దేశాల నుంచి 5 శాతం, రష్యా నుంచి కేవలం 2 శాతం చమురు మాత్రమే దిగుమతి అయ్యేది. రష్యా- ఉక్రెయిన్ ఘర్షణ తర్వాత పశ్చిమాఫ్రికా దేశాల చమురు ఖరీదుగా మారింది. రష్యా చమురును కొనడం ఆపేసిన ఐరోపా దేశాలు పశ్చిమాఫ్రికా చమురుపై ఆధారపడడమే అందుకు కారణం. భారత ప్రయోజనాల దృష్ట్యా చౌకగా దొరికిన దగ్గరే చమురును కొనుగోలు చేస్తామని విదేశాంగ మంత్రి 2022 డిసెంబరు 7న రాజ్యసభలో స్పష్టం చేశారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
India News
Mission venus: 2028లో శుక్రగ్రహ మిషన్!: ఇస్రో అధిపతి సోమనాథ్
-
Ap-top-news News
AP High Court: క్రిమినల్ కేసు ఉంటే కోర్టు అనుమతితోనే పాస్పోర్టు పునరుద్ధరణ: హైకోర్టు
-
Sports News
Suryakumar Yadav: హ్యాట్రిక్ డక్.. తొలి బంతికే.. వరుసగా విఫలమవుతున్న సూర్యకుమార్
-
World News
UNO: స్వచ్ఛమైన తాగునీటికి దూరంగా 26 శాతం ప్రపంచ జనాభా
-
Crime News
vizag: విశాఖలో భవనం కూలిన ఘటన.. అన్నాచెల్లెలు మృతి