Services sector: జనవరిలో నెమ్మదించిన సేవా కార్యకలాపాలు

గత ఏడాది డిసెంబరు నెలతో పోలిస్తే జనవరిలో సేవారంగ కార్యకలాపాలు స్వల్పంగా నెమ్మదించాయి. 

Published : 03 Feb 2023 15:34 IST

దిల్లీ: దేశంలో సేవా కార్యకలాపాలు జనవరిలో స్వల్పంగా నెమ్మదించాయి. ఎగుమతులు, కొత్త ఆర్డర్లలో వృద్ధి తగ్గడమే ఇందుకు కారణం. ఎస్‌అండ్‌పీ గ్లోబల్‌ ప్రతినెలా విడుదల చేసే సేవల పీఎంఐ (పర్చేజింగ్‌ మేనేజర్స్‌ ఇండెక్స్‌) సూచీ గత నెల 57.2గా నమోదైంది. డిసెంబరులో ఇది 58.5గా ఉంది. 50 కంటే ఎక్కువ ఉంటే వృద్ధిగా.. తక్కువగా నమోదైతే క్షీణతగా పరిగణిస్తారు.

సేవారంగంలోని కంపెనీలకు కొత్త ఆర్డర్ల సంఖ్య వరుసగా 18వ నెలలోనూ పెరిగాయి. అయితే, వృద్ధి మాత్రం నెమ్మదించింది. కొత్త ఆర్డర్ల పెరుగుదలలో దేశీయ కంపెనీలదే ప్రధాన పాత్ర. విదేశీ ఆర్డర్లు తగ్గాయి. ప్రస్తుత స్థాయిలతో పోలిస్తే భవిష్యత్తు ఉత్పత్తిలో పెద్దగా మార్పు ఉండకపోవచ్చునని చాలా కంపెనీలు తెలిపాయి. ఈ నేపథ్యంలోనే సేవారంగంలో ఉద్యోగ కల్పన జనవరిలో నెమ్మదించింది.

మరోవైపు సేవా, తయారీ రంగాల సంయుక్త వృద్ధిని సూచించే ‘ఎస్‌అండ్‌పీ గ్లోబల్‌ ఇండియా కాంపోజిట్‌ పీఎంఐ ఔట్‌పుట్‌ సూచీ’ జనవరిలో 57.5గా నమోదైంది. డిసెంబరులో ఇది 11 ఏళ్ల గరిష్ఠానికి పెరిగి 59.4గా నమోదైన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని