Smart TVs: స్మార్ట్ టీవీల మార్కెట్లో ‘చైనా’ హవా.. షావోమీదే అగ్రస్థానం
భారత స్మార్ట్‌టీవీల మార్కెట్లో షావోమీ హవా కొనసాగుతోంది. 11 శాతం మార్కెట్ వాటాతో ఆ కంపెనీ అగ్రస్థానంలో నిలిచింది.
దిల్లీ: దేశంలో స్మార్ట్ టీవీల (Smart TVs) మార్కెట్ వేగంగా వృద్ధిచెందుతోంది. గతేడాది జులై- సెప్టెంబర్ (Q3)తో పోలిస్తే ఈ ఏడాది స్మార్ట్‌టీవీల అమ్మకాలు 38 శాతం మేర పెరిగాయి. ముఖ్యంగా వరుస పండగలు, ఆఫర్లు, కొత్త ఉత్పత్తులు మార్కెట్లోకి రావడం, డిస్కౌంట్లు వంటివి విక్రయాలు పెరిగేందుకు దోహదం చేశాయని కౌంటర్ పాయింట్ రీసెర్చ్ (Counterpoint Research) నివేదిక వెల్లడించింది.
దేశంలోని మొత్తం స్మా్ర్ట్టీవీ విక్రయాల్లో అంతర్జాతీయ కంపెనీల వాటా 40 శాతంగా కాగా.. ఒక్క చైనా వాటా 38 శాతంగా ఉంది. అదే సమయంలో దేశీయ కంపెనీల వాటా సైతం రెట్టింపైంది. సమీక్షా త్రైమాసికంలో దేశీయ కంపెనీల వాటా 22 శాతానికి చేరింది. ఇక మొత్తం టీవీ విక్రయాల్లో 93 శాతం స్మార్ట్ టీవీలే ఉంటున్నాయని కౌంటర్ పాయింట్ తెలిపింది. రూ.20 వేల ధరలో మరిన్ని ఉత్పత్తులు వస్తే ఈ విక్రయాలు మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేసింది. మొత్తం స్మార్ట్ టీవీ మార్కెట్లో 32-42 అగుళాల టీవీల విక్రయాలే 50 శాతానికి పైగా ఉంటున్నాయి. ఓఎల్ఈడీ, క్యూఎల్ఈడీ డిస్ప్లేలతో కూడిన టీవీల విక్రయాలు వృద్ధి చెందుతున్నప్పటికీ.. ఎక్కువ మంది ఎల్ఈడీ టీవీలనే ఎంపిక చేసుకుంటున్నారని నివేదిక తెలిపింది. మొత్తం విక్రయాల్లో ఇ-కామర్స్ వాటా 35 శాతంగా నమోదైంది.
ఇక కంపెనీల విషయానికొస్తే.. భారత స్మార్ట్‌టీవీల మార్కెట్లో షావోమీ (Xiaomi) హవా కొనసాగుతోంది. 11 శాతం మార్కెట్ వాటాతో ఆ కంపెనీ అగ్రస్థానంలో నిలిచింది. శాంసంగ్ 10, ఎల్జీ 9 శాతం వాటాతో రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. వన్‌ప్లస్ (Oneplus) స్మార్ట్ టీవీ విక్రయాలు 89 శాతం వృద్ధిని నమోదు చేశాయి. ఇక దేశీయ టీవీ కంపెనీ వీయూ (VU) వాటా రెట్టింపైంది. మరిన్ని దేశీయ టీవీ కంపెనీలు స్మార్ట్‌టీవీ మార్కెట్లోకి ప్రవేశిస్తున్నాయని కౌంటర్ పాయింట్ నివేదిక తెలిపింది. ముఖ్యంగా రూ.20-30వేల ధరలో కొత్త ఉత్పత్తుల తీసుకొచ్చిన కారణంగా ఎల్జీ మూడో స్థానాన్ని నిలుపుకోగలిగిందని తెలిపింది. రియల్మీ, హైయర్ టాప్-10లో చోటు దక్కించకున్నాయని పేర్కొంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
US: అమ్మా.. అని దీనంగా కేకలేసినా..! కనికరించని పోలీసులు
-
Movies News
Rajamouli: ‘ఆర్ఆర్ఆర్’ సరికొత్త రికార్డు.. సంతోషంలో దర్శకధీరుడు
-
Movies News
Paruchuri Gopala Krishna: ‘ధమాకా’.. ఆ సీన్ చీటింగ్ షార్ట్లా అనిపించింది..!
-
General News
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Sports News
Arshdeep Singh: అర్ష్‌దీప్ ఎనర్జీ అంతా అక్కడే వృథా అవుతోంది: భారత మాజీలు
-
Politics News
Viveka murder Case: సీబీఐకి కడప ఎంపీ అవినాష్‌రెడ్డి లేఖ