Stock Market: మార్కెట్లలో ఊగిసలాట.. స్వల్ప లాభాలతో ముగిసిన సూచీలు

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు గురువారం తీవ్ర ఊగిసలాటను ఎదుర్కొన్నాయి. ఇన్ఫోసిస్‌, టీసీఎస్‌ వంటి దిగ్గజ షేర్లు రాణించినప్పటికీ.. కొన్ని షేర్లలో వెల్లువెత్తిన అమ్మకాలు

Updated : 13 Jan 2022 16:06 IST

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు గురువారం తీవ్ర ఊగిసలాటను ఎదుర్కొన్నాయి. ఇన్ఫోసిస్‌, టీసీఎస్‌ వంటి దిగ్గజ షేర్లు రాణించినప్పటికీ.. కొన్ని షేర్లలో వెల్లువెత్తిన అమ్మకాలు సూచీలను కుదిపేశాయి. దీనికి తోడు మాక్రోఎకానమీ గణాంకాలు నిరాశజనకంగా ఉండటం కూడా మదుపర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. దీంతో నేటి ట్రేడింగ్‌లో ఆద్యంతం ఒడుదొడుకుల్లో సాగిన సూచీలు స్వల్ప లాభాలను మాత్రమే దక్కించుకున్నాయి.

సూచీల పయనం సాగిందిలా..

ఈ ఉదయం 61,259 వద్ద మొదలైన సెన్సెక్స్‌ కాసేపటికే నష్టాల్లోకి జారుకుంది. ఒక దశలో 61వేల మార్క్‌ను కోల్పోయి 60,949.81 వద్ద కనిష్ఠానికి పడిపోయింది. ఆ తర్వాత కాస్త కోలుకున్నట్లే కన్పించినా.. అమ్మకాల ఒత్తిడిని తట్టుకోలేకపోయింది. దీంతో మళ్లీ నష్టాల్లోకి వెళ్లిన సూచీ చివరకు కాస్త కోలుకుని 85.26 పాయింట్ల లాభంతో 61,235.30 వద్ద స్థిరపడింది. అటు నిఫ్టీ కూడా 18,163 - 18272 పాయింట్ల మధ్య కదలాడి.. 45.45 పాయింట్ల స్వల్ప లాభంతో 18,257.80 వద్ద ముగిసింది. 

రంగాల వారీగా లోహ, ఫార్మా, విద్యుత్‌, చమురు షేర్లు రాణించాయి. ఈ సూచీలు 1-3 శాతం మేర పెరిగాయి. బ్యాంక్‌, రియల్టీ సూచీలు కుంగాయి. ఎన్‌ఎస్‌ఈలో టాటా స్టీల్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, సన్‌ఫార్మా, కోల్‌ ఇండియా, యూపీఎల్‌ లిమిటెడ్‌ షేర్లు లాభపడగా.. విప్రో, ఏషియన్‌ పెయింట్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ, కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్ షేర్లు నష్టపోయాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని