Stock market: ఫ్లాట్‌గా కొనసాగుతున్న స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

మదుపర్ల అప్రమత్తతతో దేశీయ స్టాక్‌ మార్కెట్లు సోమవారం ఫ్లాట్‌గా ట్రేడ్‌ అవుతున్నాయి. 

Published : 28 Nov 2022 09:40 IST

ముంబయి: దేశీయ మార్కెట్‌ సూచీలు ఈ వారాన్ని ఫ్లాట్‌గా ప్రారంభించాయి. అంతర్జాతీయ మార్కెట్ల పనితీరుతో పాటు ఈ వారం వెలువడే జీడీపీ గణాంకాలపై దృష్టిసారించిన మదుపర్లు అప్రమత్తత పాటిస్తున్నారు. దీంతో సోమవారం నాటి సెషన్‌ను స్వల్ప నష్టాలతో ప్రారంభించిన సూచీలు ఆ తర్వాత కాస్త కోలుకుని స్వల్ప లాభాలతో ట్రేడ్‌ అవుతున్నాయి. ఉదయం 9.30 గంటల సమయంలో సెన్సెక్స్‌ 46.21 పాయింట్ల లాభంతో 62,339.85 వద్ద, నిఫ్టీ 6 పాయింట్ల స్వల్ప లాభంతో 18,518.85 వద్ద కొనసాగుతున్నాయి. హీరో మోటార్స్‌, భారత్‌ పెట్రోలియం, బజాజ్‌ ఆటో, మారుతీ సుజుకీ షేర్లు లాభాల్లో ఉండగా.. హెచ్‌డీఎఫ్‌సీ, హిందాల్కో ఇండస్ట్రీస్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, అపోలో హాస్పిటల్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేర్లు నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని