Updated : 28 Jun 2022 09:48 IST

stock Market: నష్టాలతో మొదలైన స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

ముంబయి: దేశీయ మార్కెట్ల లాభాల జోరుకు అడ్డుకట్ట పడింది. గత మూడు రోజులు పరుగులు తీసిన సూచీలు మంగళవారం చతికిలపడ్డాయి. అంతర్జాతీయ మార్కెట్ల బలహీన సంకేతాలకు తోడు డెరివేటివ్‌ కాంట్రాక్టుల గడువు ముగింపు నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తత పాటిస్తున్నారు. కీలక రంగాల షేర్లలో లాభాల స్వీకరణకు మొగ్గుచూపడంతో ఈ ఉదయం సూచీలు నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్‌ 300 పాయింట్లకు పైగా పతనమవ్వగా.. నిఫ్టీ 15,800 దిగువన ట్రేడ్‌ అవుతోంది.

ఉదయం 9.35 గంటల ప్రాంతంలో సెన్సెక్స్‌ 254 పాయింట్లు దిగజారి 52,907 వద్ద, నిఫ్టీ 82 పాయింట్ల నష్టంతో 15,749 వద్ద కొనసాగుతున్నాయి. ఓఎన్‌జీసీ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా, టాటా స్టీల్‌, భారత్‌ పెట్రోలియం షేర్లు రాణిస్తుండగా.. ఏషియన్స్‌ పెయింట్స్‌, టైటాన్‌ కంపెనీ, టెక్‌ మహీంద్రా, బజాజ్‌ ఫైనాన్స్‌, హిందాల్కో ఇండస్ట్రీస్‌ షేర్లు ఒత్తిడికి గురవుతున్నాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ 20 పైసలు క్షీణించి 78.57 వద్ద ట్రేడ్‌ అవుతోంది.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని