Stock Market: నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్‌ సూచీలు

దేశీయ స్టాక్‌ మార్కెట్ సూచీలు ఈ వారాన్ని నష్టాలతో ప్రారంభించాయి. అంతర్జాతీయ మార్కెట్ల మిశ్రమ సంకేతాలకు తోడు మదుపర్ల అప్రమత్తతో సూచీలు ఒత్తిడికి గురవుతున్నాయి.

Updated : 05 Dec 2022 09:50 IST

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్ సూచీలు ఈ వారాన్ని నష్టాలతో ప్రారంభించాయి. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్‌బీఐ) పరపతి విధాన సమావేశ నిర్ణయాలు, ఈ వారంలో గుజరాత్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తత పాటిస్తున్నారు. అటు అంతర్జాతీయ మార్కెట్ల సంకేతాలు కూడా మిశ్రమంగా ఉండటంతో నేటి ట్రేడింగ్‌ను సూచీలు నష్టాలతో ప్రారంభించాయి. ఉదయం 9.30 గంటలకు సెన్సెక్స్‌ 149 పాయింట్ల నష్టంతో 62,719 వద్ద, నిఫ్టీ 34 పాయింట్ల నష్టంతో 18,662 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ 81.25గా కొనసాగుతోంది. నిఫ్టీలో హిందాల్కో ఇండస్ట్రీస్‌, టాటా స్టీల్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, ఓఎన్‌జీసీ, యూపీఎల్‌ షేర్లు రాణిస్తుండగా.. హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌యూఎల్‌, నెస్లే ఇండియా, ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్స్యూరెన్స్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా షేర్లు ఒత్తిడికి గురవుతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని