ఈజీ డైనర్‌- ఇండ‌స్ఇండ్ బ్యాంకు నుంచి కో బ్రాండెడ్‌ క్రెడిట్‌ కార్డ్‌

ఈ క్రెడిట్ కార్డ్ పొందిన వ్య‌క్తి కాంప్లిమెంట‌రీ 'EazyDiner' ప్రైమ్ మెంబ‌ర్‌షిప్‌ను పొందుతారు.

Updated : 22 Jul 2022 14:57 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టేబుల్ రిజ‌ర్వేష‌న్ ప్లాట్‌ఫార‌ం EazyDinerతో కలిసి ఇండ‌స్ ఇండ్‌ బ్యాంక్‌ కో-బ్రాండెడ్‌ క్రెడిట్‌ కార్డ్‌ను తీసుకొచ్చింది. ఈ క్రెడిట్ కార్డ్‌తో డైనింగ్‌, షాపింగ్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌పై చేసే ప్ర‌తి రూ.100 ఖర్చుకు 10 రివార్డ్ పాయింట్స్‌ని పొందొచ్చు. ఈ క్రెడిట్ కార్డ్ పొందిన వ్య‌క్తి కాంప్లిమెంట‌రీగా EazyDiner ప్రైమ్ మెంబ‌ర్‌షిప్‌ను పొందుతారు. ఇది ఎంపిక చేసిన రెస్టారెంట్ల‌లో 25% వ‌ర‌కు త‌గ్గింపు పొందొచ్చు. PayEazy ద్వారా EazyDiner యాప్‌లో క‌స్ట‌మ‌ర్ చెల్లించిన ప్ర‌తిసారీ అద‌నంగా 25% త‌గ్గింపు (రూ.1,000 వ‌ర‌కు) పొందొచ్చని బ్యాంక్‌ ఓ ప్రకటనలో తెలిపింది. PayEazy ద్వారా చెల్లించేట‌ప్పుడు క‌స్ట‌మ‌ర్‌లు రివార్డ్ పాయింట్‌ల‌ను త‌క్ష‌ణ‌మే రీడీమ్ చేసుకునే అవ‌కాశం ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని