Infinix Hot 30i: ₹9 వేలకే 16జీబీ ర్యామ్‌..50Mp కెమెరాతో ఇన్ఫీనిక్స్‌ ఫోన్‌

Infinix Hot 30i: డ్యుయల్‌ సిమ్‌ ఆప్షన్‌తో వస్తోన్న ఈ ఇన్ఫీనిక్స్‌ హాట్‌ 30ఐ ఫోన్‌ ఆండ్రాయిడ్‌ 12 ఆధారిత ఎక్స్‌ఓస్‌ 12పై పనిచేస్తోంది.

Published : 27 Mar 2023 19:51 IST

Infinix Hot 30i | ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇన్ఫీనిక్స్‌ నుంచి హాట్‌ సిరీస్‌ మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ సోమవారం భారత్‌లో విడుదలైంది. ఇన్ఫీనిక్స్‌ హాట్‌ 30ఐ పేరుతో వస్తున్న ఈ ఫోన్‌లో 6.6 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ+ తెర, 50 ఎంపీ డ్యుయల్‌ కెమెరా ఉన్నాయి. దీంట్లో 5,000 ఎంఏహెచ్‌ బ్యాటరీని అమర్చారు. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే స్టాండ్‌బై మోడ్‌లో 30 రోజుల వరకు పనిచేస్తుందని కంపెనీ తెలిపింది. ఆక్టాకోర్‌ మీడియా టెక్‌ జీ37 ప్రాసెసర్‌తో వస్తోంది.

ఇన్ఫీనిక్స్‌ హాట్‌ 30ఐ ధర..
Infinix Hot 30i Price..

ఇన్ఫీనిక్స్‌ హాట్‌ 30ఐ ఫోన్‌లో 8జీబీ + 128జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ మాత్రమే అందుబాటులో ఉంది. ర్యామ్‌ను వర్చువల్‌గా 16 జీబీ వరకు పెంచుకునే వెసులుబాటు కల్పిస్తున్నారు. దీని ధర రూ.8,999. అయితే, ఇది వెల్‌కమ్‌ ఆఫర్‌ కింద ఇస్తున్న ధర అని కంపెనీ తెలిపింది. ఈ ధరను ఎప్పటి వరకు కొనసాగిస్తారనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. డైమండ్‌ వైట్‌, గ్లేషియర్‌ బ్లూ, మిర్రర్‌ బ్లాక్‌ రంగుల్లో ఈ ఫోన్‌ అందుబాటులో ఉంది. ఏప్రిల్‌ నుంచి విక్రయాలు ప్రారంభం కానున్నాయి. తొలివారం రోజులు కేవలం ఫ్లిప్‌కార్ట్‌లో మాత్రమే ఈ ఫోన్‌ అందుబాటులో ఉండనుంది. ఫ్లిప్‌కార్ట్‌ యాక్సిస్‌ బ్యాంక్‌ కార్డ్‌ ద్వారా కొనుగోలు చేస్తే ఐదు శాతం క్యాష్‌బ్యాక్‌ లభిస్తోంది. రూ.317తో మొదలుకొని ఈఎంఐ ఆప్షన్‌ కూడా ఉంది. ఎక్స్ఛేంజ్‌ ఆఫర్‌ కింద ధర మరింత తగ్గుతుంది.

ఇన్ఫీనిక్స్‌ హాట్‌ 30ఐ స్పెసిఫికేషన్లు..
Infinix Hot 30i specifications..

డ్యుయల్‌ సిమ్‌ ఆప్షన్‌తో వస్తోన్న ఈ ఇన్ఫీనిక్స్‌ హాట్‌ 30ఐ ఫోన్‌ ఆండ్రాయిడ్‌ 12 ఆధారిత ఎక్స్‌ఓస్‌ 12పై పనిచేస్తోంది. 90Hz రీఫ్రెష్‌ రేట్‌ కలిగిన 6.6 అంగుళాల హెచ్‌డీ తెర ఉంది. ఫొటోలు, వీడియోల కోసం వెనుక భాగంలో కృత్రిమ మేధ ఆధారిత 50ఎంపీ డ్యుయల్‌ కెమెరా ఉంది. ముందు భాగంలో సెల్ఫీల కోసం 5 ఎంపీ కెమెరా ఇస్తున్నారు.

128జీబీ స్టోరేజ్‌తో వస్తున్న ఈ ఫోన్‌లో మైక్రో ఎస్‌డీ కార్డ్‌ స్లాట్‌ ద్వారా దాన్ని 1టీబీ వరకు పెంచుకోవచ్చు. కనెక్టివిటీ ఆప్షన్ల విషయానికి వస్తే 4జీ ఎల్‌టీఈ, యూఎస్‌బీ టైప్‌-సి పోర్ట్‌, బ్లూటూత్‌, ఓటీజీ, వైఫై ఫీచర్లు ఉన్నాయి. ఫేస్‌ అన్‌లాకింగ్‌తో పాటు ఫోన్‌ పక్క భాగంలో ఫింగర్‌ప్రింట్‌ సెన్సర్‌ ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని