fuel tax cut: మరోసారి చమురుపై పన్ను తగ్గించే అవకాశం?
fuel tax cut: ద్రవ్యోల్బణం కట్టడికి పెట్రోల్, డీజిల్‌పై పన్ను తగ్గించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. దీనికి మరికొంతం సమయం పట్టే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
దిల్లీ: ఇప్పటికే ఆకాశాన్ని తాకిన పెట్రోల్ (petrol), డీజిల్ (diesel) ధరల నుంచి వాహనదారులకు మరోసారి ఊరట లభించనుందా? చమురుపై విధిస్తున్న పన్నును (Tax cut) కేంద్ర ప్రభుత్వం తగ్గించనుందా? అంటే అవుననే అంటున్నాయి సంబంధిత వర్గాలు. ద్రవ్యోల్బణం (Inflation) కట్టడికి చమురు సహా కొన్నింటిపై పన్నులు తగ్గించే అవకాశం ఉందని ‘రాయిటర్స్’ పేర్కొంది. విశ్వసనీయ వర్గాల నుంచి వచ్చిన సమాచారాన్ని ఉటంకించింది. అయితే, ఫిబ్రవరి ద్రవ్యోల్బణ గణాంకాలు కూడా వెలువడ్డాక ఈ నిర్ణయం వెలువడే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
దేశంలో ద్రవ్యోల్బణం కట్టడికి కొన్నాళ్లుగా అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు ఆర్‌బీఐ కృషి చేస్తున్నాయి. గతేడాది మే నెలలో పెట్రోల్‌పై 8 రూపాయలు, డీజిల్‌పై 6 రూపాయలు చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. కొన్ని రాష్ట్రాలు సైతం వ్యాట్‌ను తగ్గించాయి. మరోవైపు ఆర్‌బీఐ రెపో రేటును పెంచుతూ వస్తోంది. దీంతో కొన్నాళ్లుగా ద్రవ్యోల్బణం తగ్గుతూ వస్తోంది. అయితే, జనవరి నెలకు తాజాగా వెలువడిన ద్రవ్యోల్బణ గణాంకాలు ఆలోచనలో పడేశాయి. డిసెంబర్ నెలలో 5.72 శాతంగా ఉన్న రిటైల్ ద్రవ్యోల్బణం 6.52 శాతానికి చేరింది. దీంతో ఆర్‌బీఐ మరోసారి పెంపు నిర్ణయం తీసుకోవచ్చని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే ఆర్‌బీఐ సిఫార్సులకు అనుగుణంగా కేంద్రం సైతం కొన్నింటిపై పన్నులు తగ్గించే అవకాశం ఉందని తెలుస్తోంది.
పాలు, కూరగాయలు, మొక్కజొన్నలు, సోయాబీన్ ఆయిల్ వంటి ఆహార పదార్థాల ధరల రెక్కలకు కారణమవుతున్నాయి. ఈ నేపథ్యంలో మొక్కజొన్నపై విధిస్తున్న దిగుమతి సుంకాన్ని తగ్గించాలని యోచిస్తోందని సంబంధిత వర్గాలు తెలిపాయి. దీనిపై ప్రస్తుతం 60 శాతం బేసిక్ డ్యూటీ వర్తిస్తోంది. అలాగే చమురుపైనా మరోసారి ఊరట ఇచ్చే అంశాన్ని కేంద్రం పరిశీలిస్తోందని పేర్కొన్నాయి. దీనిపై అటు ఆర్థికమంత్రిత్వ శాఖ గానీ, ఆర్‌బీఐ గానీ స్పందించలేదు. అయితే, ఆర్‌బీఐ వైపు నుంచి ఎప్పటిలానే సిఫార్సులు అందాయని, మరో నెల (ఫిబ్రవరి) ద్రవ్యోల్బణం లెక్కలు కూడా వచ్చాక దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సమాచారం.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Avanigadda: మెగా డీఎస్సీ ఎక్కడ జగనన్నా?: వారాహి యాత్రలో నిరుద్యోగుల ఆవేదన
-
ODI WC 2023: భారత స్పిన్ బౌలింగ్‌తో ప్రత్యర్థులు జాగ్రత్త: పాక్ మాజీ కెప్టెన్
-
UGC NET 2023: యూజీసీ నెట్ పరీక్ష షెడ్యూల్ విడుదల
-
Elections: అభ్యర్థుల నేర చరిత్రను.. పత్రికా ప్రకటనల్లో వెల్లడించాలి : ఎన్నికల సంఘం
-
World Culture Festival: ఉక్రెయిన్‌లో శాంతిస్థాపన కోసం 180 దేశాల ప్రజల ప్రార్థన
-
GST collections: సెప్టెంబరు జీఎస్టీ వసూళ్లు రూ.1.62 లక్షల కోట్లు.. 10% వృద్ధి