Infosys CEO: ఇన్ఫోసిస్‌ సీఈఓగా వరుసగా రెండోసారి సలీల్‌ పరేఖ్‌!

ఐటీ సేవల దిగ్గజం ఇన్ఫోసిస్‌ సీఈఓ, ఎండీగా తిరిగి సలీల్‌ పరేఖ్‌ను నియమిస్తున్నట్లు ఆదివారం తెలిపింది....

Published : 22 May 2022 20:30 IST

ముంబయి: ఐటీ సేవల దిగ్గజం ఇన్ఫోసిస్‌ సీఈఓ, ఎండీగా తిరిగి సలీల్‌ పరేఖ్‌ను నియమిస్తున్నట్లు ఆదివారం స్టాక్‌ ఎక్స్ఛేంజీలకిచ్చిన సమాచారంలో కంపెనీ తెలిపింది. మరో ఐదేళ్లపాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. వ్యవస్థాపక సభ్యులు కాకుండా వరుసగా రెండోసారి కంపెనీ సీఈఓగా ఎంపికైన తొలి వ్యక్తిగా సలీల్‌ గుర్తింపు పొందారు. ఆయన నియామకానికి ఇంకా వాటాదారుల ఆమోదం లభించాల్సి ఉంది.

అనేక ప్రాజెక్టులతో వృద్ధిపథంలో దూసుకెళ్తున్న కంపెనీని సమర్థ నాయకత్వంలో కొనసాగించాలనే ఉద్దేశంతోనే సలీల్‌ను తిరిగి నియమించాలని ‘నామినేషన్‌ అండ్‌ రెమ్యూనరేషన్‌ కమిటీ’ నిర్ణయించినట్లు ఇన్ఫోసిస్‌ బోర్డు ఓ ప్రకటనలో తెలిపింది. అలాగే కంపెనీలో ఆరుగురు ఉన్నతాధికారులకు 1,04,000 షేర్లను.. మరో 88 మంది సీనియర్‌ అధికారులకు 3,75,760 షేర్లు కేటాయించాలని ఎన్‌ఆర్‌సీ నిర్ణయించినట్లు తెలిపింది. వీటిని రాబోయే మూడేళ్ల పాటు వారి పనితీరును బట్టి బదిలీ చేయనున్నట్లు పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని