Polifyx: బీమా పాలసీల సమస్యల పరిష్కారానికి పాలిఫిక్స్ యాప్
Polifyx: బీమా పాలసీల (Insurance Policies)కు సంబంధించిన అన్ని సమస్యలను పరిష్కరించే విధంగా పాలిఫిక్స్ యాప్‌ను తీసుకొచ్చినట్లు ఇన్సూరెన్స్ సమాధాన్ తెలిపింది.
ఇంటర్నెట్ డెస్క్: బీమా సంబంధిత సమస్యలకు పరిష్కారాలను చూపే టెక్ సంస్థ ‘ఇన్సూరెన్స్ సమాధాన్’ కొత్తగా యాప్‌ను ప్రారంభించింది. ‘పాలిఫిక్స్ (Polifyx)’ పేరిట తీసుకొచ్చిన ఈ యాప్‌ను బీమా పాలసీల (Insurance Policies)కు సంబంధించిన అన్ని సమస్యలను పరిష్కరించే వేదికగా తీర్చిదిద్దినట్లు కంపెనీ తెలిపింది. పోర్ట్‌ఫోలియో అనాలసిస్, నో యువర్ పాలసీ, క్లెయిం దరఖాస్తు, ఫిర్యాదు పరిష్కారం, డిజిటల్ వాల్ట్, బీమా క్లెయిం ఫిర్యాదులు, పోర్ట్‌ఫోలియో సర్వీసుల వంటి ఫీచర్లు ఈ యాప్‌లో ఉన్నట్లు పేర్కొంది.
పొదుపులు, బీమా పాలసీలు (Insurance Policies).. ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా ఉన్నాయో లేదో కూడా పాలిఫిక్స్ ద్వారా తెలుసుకోవచ్చని ఇన్సూరెన్స్ సమాధాన్ వెల్లడించింది. పాలసీకి సంబంధించిన పత్రాలను అప్‌లోడ్ చేసి ఏమైనా తప్పులున్నా కూడా తెలుసుకోవచ్చని పేర్కొంది. కొత్తగా క్లెయింకు దరఖాస్తు కూడా చేసుకోవచ్చని తెలిపింది. అలాగే క్లెయింలో ఏమైనా సమస్యలు తలెత్తినా యాప్ ద్వారా ఫిర్యాదు చేయొచ్చని వివరించింది. ఇక డిజిటల్ వాల్ట్‌తో కుటుంబ సభ్యుల ఇన్సూరెన్స్ పాలసీలన్నింటినీ ఒకే దగ్గర భద్రంగా ఉంచుకోవచ్చని తెలిపింది.
పాలసీ పత్రాలనుఅధ్యయనం చేసి క్లెయిం సమయంలో ఏమైనా సమస్యలు వచ్చే అవకాశం ఉంటే ముందే గుర్తించేలా పాలిఫిక్స్ (Polifyx) కృత్రిమ మేధ ఆధారిత పరిష్కారాలను అందిస్తుందని ఇన్సూరెన్స్ సమాధాన్ తెలిపింది. అలాగే క్లెయిం తిరస్కరణకు గురికాకుండా దరఖాస్తును ఎలా నింపాలో కూడా యాప్‌లోనే సూచనలు, సలహాలు లభిస్తాయని పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Savings: పొదుపు తగ్గి అప్పు పెరుగుతోందా? ఈ వ్యూహాలను అనుసరిద్దాం!
-
Asian Games: క్రికెట్లో మేం గోల్డ్ సాధించాం.. ఇక మీ వంతు: జెమీమా రోడ్రిగ్స్
-
Aadhaar: ‘ఆధార్’పై మూడీస్ సంచలన ఆరోపణలు.. గట్టిగా బదులిచ్చిన కేంద్రం
-
Justin Trudeau: ఆ ఘటన కెనడియన్లను ఇబ్బందికి గురిచేసేదే..: జస్టిన్ ట్రూడో
-
USA: భారత్‌పై ఒత్తిడి పెంచుతున్న అమెరికా.. విచారణకు సహకరించాలని కోరిన విదేశాంగ శాఖ
-
Manipur Violence: అదృశ్యమైన ఆ విద్యార్థుల దారుణ హత్య.. మణిపుర్లో వెలుగులోకి మరో ఘోరం..!