FD Rates: కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ ఎఫ్‌డీ రేట్లు పెంపు

ఈ బ్యాంకు అన్ని ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వివిధ కాలవ్యవధులకు వడ్డీ రేట్లను సవరించింది.

Updated : 05 Nov 2022 14:26 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ ప్రైవేట్‌ బ్యాంకు కోటక్‌ మహీంద్రా తన ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లను సవరించింది. సాధారణ డిపాజిటర్లకు, సీనియర్‌ సిటిజన్లకు కూడా ఈ సవరించిన వడ్డీ రేట్లు వర్తిస్తాయి. ఈ బ్యాంకు ప్రకటించిన కనిష్ఠ, గరిష్ఠ వడ్డీ రేట్లు 2.75% నుంచి 6.30% వరకు ఉన్నాయి. సీనియర్‌ సిటిజన్లు దాదాపు అన్ని ఎఫ్‌డీలపై 0.50% అదనపు వడ్డీ పొందుతారు. వీరికి గరిష్ఠంగా 6.80% వరకు వడ్డీ లభిస్తుంది. ఈ రేట్లు నవంబర్‌ 1 నుంచి అమల్లోకి వచ్చాయి. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు ఆర్‌బీఐ పాలసీ రేట్లను పెంచడంతో దాదాపు అన్ని బ్యాంకులూ తమ ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లను పెంచుతున్నాయి. ఈ ఏడాది మే నుంచి ఆర్‌బీఐ రెపో రేటును 190 బేసిస్‌ పాయింట్లు పెంచిన సంగతి విదితమే.

సవరించిన వడ్డీ ఇలా..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని