Home Loan: రూ.1 కోటి గృహ రుణానికి వడ్డీ రేటు, ఈఎంఐ ఎంత?
మెరుగైన క్రెడిట్ స్కోరు ఉన్న వారికి రూ.1 కోటి గృహ రుణానికి వడ్డీ రేటు, ఈఎంఐ ఇక్కడ చూడండి.
ఇంటర్నెట్ డెస్క్: ప్రస్తుత కాలంలో ఇళ్ల ధరలు పెరగడంతో, వీటి కొనుగోలుకు అధిక మొత్తంలో వెచ్చించాల్సి ఉంటుంది. అధిక ఆదాయం ఉన్న చాలా మంది వ్యక్తులు ఇప్పుడు ఖరీదైన హౌస్ ప్రాపర్టీని ఎంచుకుంటున్నారు. అందుచేత ఎక్కువ మొత్తానికి ఇల్లు కొనుగోలు చేసే సందర్భంలో బ్యాంకు రుణం తీసుకోవడం తప్పనిసరి కావచ్చు. అధిక మొత్తంలో గృహ రుణం తీసుకునేటప్పుడు ఈఎంఐ అధిక మొత్తంలోనే ఉంటుంది. కాబట్టి, బ్యాంకులు మెరుగైన క్రెడిట్ స్కోరును కూడా చూస్తాయి.
రుణగ్రహీతలు వడ్డీ రేటు, ఈఎంఐ మొత్తాన్ని ఇతర బ్యాంకులతో పోల్చి చూసుకోవాలి. గృహ రుణం కోసం దరఖాస్తు చేసేటప్పుడు, బ్యాంకులు విధించే ప్రాసెసింగ్ ఫీజులు, ఇతర ఛార్జీల గురించి తెలుసుకోవాలి. వీటిలో అడ్మినిష్ట్రేటివ్ ఛార్జీలు, లీగల్ ఫీజులు, వాల్యుయేషన్ ఫీజులు, ప్రీపేమెంట్ పెనాల్టీలు మొదలైనవి ఉంటాయి. అయితే, ఫ్లోటింగ్ రేట్ గృహ రుణమయితే ముందస్తు చెల్లింపు కోసం ఎటువంటి అదనపు ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు.
వివిధ బ్యాంకుల్లో రూ.1 కోటి గృహ రుణానికి..వడ్డీ రేటు, ఈఎంఐ ఈ కింది పట్టికలో..
నోట్: ఈ పట్టికలో అత్యల్ప గృహ రుణ వడ్డీ రేట్లను మాత్రమే తెలిపాం. ప్రాసెసింగ్ ఫీజులు, ఇతర ఛార్జీలు ఈఎంఐలో కలపలేదు. మెరుగైన క్రెడిట్ స్కోరు ఉన్న వారికి మాత్రమే ఈ వడ్డీ రేట్లు వర్తిస్తాయి. వృత్తి, వయసు, క్రెడిట్ స్కోరును బట్టి వడ్డీ రేట్లలో మార్పులుండొచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Gangula: తెలంగాణలో రేషన్ డీలర్లకు కమీషన్ పెంపు: మంత్రి గంగుల
-
Manipur: అల్లర్లతో అట్టుడికిన మణిపుర్లో.. ఉగ్ర కలకలం
-
Lokesh: పవన్ సభకు ప్రభుత్వం ఆటంకం కలిగించే అవకాశం: లోకేశ్
-
Asian Games: భారత్కు మరో రెండు పతకాలు.. ఫైనల్కు కిదాంబి శ్రీకాంత్
-
HCA: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
-
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు