కొత్త కారు రుణాల‌కు వివిధ బ్యాంకుల వ‌డ్డీ రేట్లు

750 లేదా అంత‌కంటే ఎక్కువ క్రెడిట్ స్కోరు ఉన్న వారికి త‌క్కువ వ‌డ్డీ రేట్ల‌కు కారు రుణం పొంద‌డానికి అర్హ‌త ఉంటుంది.

Published : 05 Jul 2022 15:43 IST

ప్ర‌స్తుత కాలంలో మ‌ధ్య‌త‌ర‌గ‌తి వారు కూడా కారును కొనుగోలు చేయ‌డానికి చేతిలో త‌గినంత న‌గ‌దు లేకున్నా..బ్యాంకులు అందించే కారు రుణాలు తీసుకుంటున్నారు. కారు రుణం తీసుకునేట‌పుడు వివిధ బ్యాంకులు అందించే వ‌డ్డీ రేట్లు, వివిధ ఆఫ‌ర్‌లు స‌రిపోల్చుకోవాలి. వ‌డ్డీ రేట్ల‌తో పాటు, బ్యాంకుల నిబంధ‌న‌ల‌ ప్ర‌కారం మారే ప్రాసెసింగ్ ఫీజులు, రుణ ఈఎంఐ చెల్లింపులు, ఇత‌ర ఛార్జీల గురించి కూడా త‌నిఖీ చేసుకోవాలి.

కారు కొన‌డం కొంద‌రికి విలాసం అయితే మ‌రికొంద‌రికి ఇప్పుడు అవ‌స‌రం అయింది. చాలా బ్యాంకులు వినియోగ‌దారుల‌కు మెరుగైన సేవ‌లు అందించాల‌నే ఉద్దేశ్యంతో కారు డీల‌ర్ల‌తో ప్ర‌త్యేక‌మైన భాగ‌స్వామ్య ఒప్పందాలు క‌లిగి ఉంటున్నాయి. కారు డీల‌రు షోరూమ్‌లోనే బ్యాంకు ప్ర‌తినిధిని నియ‌మిస్తున్నాయి. కార్ల షోరూమ్ డీల‌ర్లు కారు రుణ ప్రాసెసింగ్ వేగ‌వంతం చేసి రాయితీ ధ‌ర‌ల‌కే కారును వినియోగ‌దారుల‌కు అందిస్తున్నారు.

ప్ర‌స్తుతం దేశంలో అతి త‌క్కువ కారు రుణ వ‌డ్డీ రేట్ల‌ను అందిస్తున్న ప్ర‌భుత్వ‌, ప్రైవేట్ రంగ బ్యాంకుల జాబితా దిగువ ప‌ట్టిక‌లో ఉంది. ఈ ప‌ట్టిక‌లో 5 సంవ‌త్స‌రాల కాల వ్య‌వ‌ధికి, రూ. 7.50 ల‌క్ష‌ల కారు రుణానికి సంబంధించిన ఈఎమ్ఐలు ఉన్నాయి.

గ‌మ‌నికః బ్యాంకులు తెలిపిన అత్య‌ల్ప వ‌డ్డీ రేట్లు మాత్ర‌మే ఇక్కడ ఇవ్వ‌డం జ‌రిగింది. రూ. 7.50 ల‌క్ష‌ల రుణం ఒక సూచిక మాత్ర‌మే. బ్యాంకు నియ‌మ, నిబంధ‌న‌ల‌ను బ‌ట్టి ఇంకా అధిక మొత్తంలో కూడా రుణం పొందొచ్చు. మీ లోన్ మొత్తం, క్రెడిట్ స్కోరు, చేసే వృత్తిపై బ్యాంకు విధించే ఇత‌ర నిబంధ‌న‌లు, ష‌ర‌తులపై ఆధార‌ప‌డి మీకు వ‌ర్తించే వ‌డ్డీ రేటు పెర‌గ‌వ‌చ్చు. ప్రాసెసింగ్ ఫీజులు, ఇత‌ర ఛార్జీలు ఈ `ఈఎమ్ఐ`లో క‌ల‌ప‌బ‌డ‌లేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని