Personal Loans: వ్య‌క్తిగ‌త రుణాలపై ఏ బ్యాంకులో ఎంత వడ్డీ?

వ్య‌క్తిగ‌త రుణాన్ని అసుర‌క్షిత రుణంగా బ్యాంకులు ప‌రిగ‌ణిస్తాయి. వీటికి ఎలాంటి ఆస్తుల‌ను తాక‌ట్టు పెట్ట‌వ‌ల‌సిన అవ‌స‌రం లేదు.

Updated : 31 Dec 2021 15:21 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఎలాంటి పూచీకత్తూ లేకుండా వ్యక్తిగత రుణాలను మంజూరు చేస్తుంటాయి బ్యాంకులు. ఈ రుణాలు సంవ‌త్స‌రానికి 8.9% వ‌డ్డీ రేటు నుంచి ప్రారంభమవుతున్నాయి. వివిధ అవ‌స‌రాల నిమిత్తం చిన్న చిన్న అప్పులు, ఖ‌ర్చులు ఎక్కువై ఆర్థిక ఒత్తిడిలో ఉన్న‌ప్పుడు ఈఎమ్ఐల ద్వారా చెల్లించే సౌల‌భ్య‌మున్న వ్య‌క్తిగ‌త రుణాన్ని బ్యాంకుల ద్వారా తీసుకోవ‌డం మంచి అవ‌కాశ‌మ‌నే చెప్పాలి. ఎటువంటి పూచీక‌త్తు లేనప్పుడు పొంద‌గ‌లిగే సుల‌భ‌మైన రుణాల్లో ఇవి ఒకటి. పెళ్లి, ఇంటి పున‌ర్నిర్మాణం, వైద్య అత్య‌వ‌స‌రం, విద్య మొద‌లైన ఏవైనా త‌క్ష‌ణ ఆర్థిక అవసరాల కోసం మీరు వ్య‌క్తిగ‌త రుణాన్ని పొందొచ్చు. వ్య‌క్తిగ‌త రుణం పొంద‌డానికి మీ ప్రొఫైల్ ఆధారంగా ప్రీ-అప్రూవ్డ్ క‌స్ట‌మ‌ర్లయితే గంట‌ల్లో రుణం మంజూరు అవ్వొచ్చు. కొంత మందికి అయితే ఒక వారంలోపు వ్య‌క్తిగ‌త రుణం పంపిణీ అవ్వొచ్చు. మీ క్రెడిట్ స్కోర్ బాగుంటే, మీ ప్రొఫైల్‌ అర్హ‌త ప్ర‌మాణాల‌కు అనుగుణంగా ఉంటే, వ్య‌క్తిగ‌త రుణాన్ని పొంద‌డం ఇబ్బంది లేకుండా ఉంటుంది. వ్య‌క్తిగ‌త రుణాల‌ను పొంద‌డానికి జీతం పొందే వ్య‌క్తులకు ఆర్థిక సంస్థ‌లు అధిక ప్రాధాన్య‌ం ఇస్తాయి. అయితే క్లీన్‌ క్రెడిట్ హిస్ట‌రీ క‌లిగిన ఇత‌రులు కూడాదీన్ని పొందొచ్చు. రుణ దరఖాస్తును పూరించి మీ వ్య‌క్తిగ‌త, వృత్తిప‌ర‌మైన, ఆదాయ వివ‌రాల‌ను ధ్రువీకరించే అన్ని సంబంధిత ప‌త్రాల‌ను స‌మ‌ర్పించాలి. అయితే రుణ చెల్లింపుల‌లో ఆల‌స్యం, డిఫాల్ట్‌లు చేస్తే వారి క్రెడిట్ స్కోర్ త‌గ్గిపోయి భ‌విష్య‌త్తులో ఇబ్బందిగా ఉంటుంది.

వ్య‌క్తిగ‌త రుణం తీసుకునే ముందు కొన్ని ముఖ్య‌మైన‌ విష‌యాలు తెలుసుకోవాలి. ఏ ఇత‌ర రుణం క‌న్నా కూడా ఈ వ్య‌క్తిగ‌త రుణాల‌కు వ‌డ్డీ రేట్లు ఎక్కువగానే ఉంటాయి. వ్య‌క్తిగ‌త రుణాన్ని అసుర‌క్షిత రుణంగా బ్యాంకులు ప‌రిగ‌ణిస్తాయి. వీటికి ఎలాంటి ఆస్తుల‌నూ తాక‌ట్టు పెట్టాల్సిన అవసరం లేదు. అయితే క్రెడిట్ స్కోర్ 750 అంత‌కంటే ఎక్కువ ఉన్న వారికి లోన్ ఇవ్వ‌డంలో ప్రాధాన్య‌ం ఉండ‌ట‌మే కాకుండా వ‌డ్డీ రేట్లు కూడా త‌క్కువ ఉండే అవ‌కాశ‌ముంది. క్రెడిట్ స్కోర్ త‌క్కువున్న వారికి కూడా కొన్ని రుణ సంస్థ‌లు, ఫిన్‌టెక్‌ సంస్థ‌లు రుణాలు ఇచ్చే అవ‌కాశ‌ముందిగానీ అధిక వ‌డ్డీ రేట్ల‌ను వ‌సూలు చేస్తాయి.

రుణ అర్హ‌త: జీతాలు, స్వ‌యం ఉపాధి పొందుతున్న వారికి రుణ అర్హ‌తలు భిన్నంగా ఉంటాయి. వ్య‌క్తిగ‌త రుణం కోరుకునే జీతం పొందిన వ్య‌క్తులు 3 నెల‌ల పే స్లిప్‌లు, ఫార‌మ్ 16, గ‌డిచిన‌ సంవ‌త్స‌ర ఆదాయ‌పు ప‌న్ను రిట‌ర్నులను అందించాల్సి ఉంటుంది. స్వ‌యం ఉపాధి పొందుతున్న వ్య‌క్తుల‌యితే గ‌త 2 సంవ‌త్స‌రాల్లో ఆడిట్ చేసిన ఫైనాన్షియ‌ల్ ఐటీఆర్‌ని స‌మ‌ర్పించాల్సి ఉంటుంది. వారి వ్యాపారం క‌నీసం 2 ఏళ్ల పాటు ర‌న్నింగ్‌లో ఉండి కొన‌సాగుతూ ఉండాలి. వారు వైద్యులు, సీఏలు మొద‌లైన నిపుణులు అయితే ప్రాక్టీస్ చేయ‌డానికి లైసెన్స్‌లు కూడా క‌లిగి ఉండాలి.

5 సంవ‌త్స‌రాల కాల‌వ్య‌వ‌ధితో రూ.2.5 ల‌క్ష‌ల వ్య‌క్తిగ‌త రుణాల‌పై ప్ర‌స్తుతం అతి త‌క్కువ వ‌డ్డీ రేట్ల‌ను అందిస్తున్న 25 బ్యాంకుల ఈఎమ్ఐలు ఇక్కడ ఇస్తున్నాం.

గమనిక: ఈ డేటా 28 డిసెంబ‌ర్ 2021 నాటిది. ప్రాసెసింగ్ ఫీజులు, ఇతర ఛార్జీలు ఈఎమ్ఐలో క‌ల‌ప‌లేదు. టేబుల్‌లో తెలిపిన వడ్డీ.. బ్యాంక్‌ నిబంధనలు, షరతులపై ఆధారపడి మారొచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని