Education Loans: ఉన్న‌త విద్యా రుణాల‌కు ప్ర‌ముఖ బ్యాంకుల వ‌డ్డీ రేట్లు

భార‌త్‌లో ఖ‌రీదైన వ్య‌వ‌హారాల‌లో ఉన్న‌త విద్య ఒక‌టి.

Updated : 17 Aug 2022 12:17 IST

 ఇంటర్నెట్‌ డెస్క్‌: యువ‌తీ, యువ‌కుల‌కు చ‌దువుపై ఆస‌క్తి బాగా పెరిగింద‌ని విద్యారంగ గ‌ణాంకాలు చెబుతున్నాయి. అనేక ప్రొఫెష‌న‌ల్ కోర్సులు, సాంకేతిక కోర్సులు విద్యార్థులకు అందుబాటులోకి వ‌చ్చాయి. విద్య‌లో ప్రైవేట్ రంగ పాత్ర కూడా బాగా పెరిగింది. దీనికి త‌గ్గ‌ట్టుగానే ఫీజుల భారం కూడా పెరిగింది. అయితే, ఫీజుల భారాన్ని మోయ‌డానికి విద్యా రుణాలు తీసుకోవాలంటే బ్యాంకుల‌ను ఆశ్ర‌యించ‌వ‌చ్చు.

మీకు మంచి విద్యార్హ‌త‌లు ఉండి ఉన్న‌త విద్య చ‌ద‌వ‌డానికి అర్హ‌త పొందితే మీరు దేశంలో, విదేశాల్లోని ప్ర‌ముఖ సంస్థ‌ల‌లో చ‌దువుకోవ‌డానికి విద్యా రుణం కోసం బ్యాంకుల‌కు దర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. రుణ మొత్తం ఎక్కువ‌గా ఉన్న‌ట్ల‌యితే కుటుంబం తిరిగి చెల్లించే సామ‌ర్థ్యాన్ని బ్యాంకులు త‌నిఖీ చేస్తాయి. విద్యార్థి ప్ర‌ముఖ విద్యా సంస్థ‌లో స్కాల‌ర్‌షిప్ పొందిన‌ట్ల‌యితే కొన్ని బ్యాంకులు త‌క్కువ వ‌డ్డీ రేట్ల‌కు విద్యా రుణాల‌ను అందిస్తాయి.

రూ. 10 ల‌క్ష‌ల రుణానికి, 7 సంవ‌త్స‌రాల కాల‌వ్య‌వ‌ధికి, కొన్ని ప్ర‌ముఖ బ్యాంకుల ఈఎంఐ ఈ కింది ప‌ట్టిక‌లో ఉంది.

నోట్: ఈ డేటా 2022 ఆగ‌స్టు 2 నాటిది.  రూ.10 ల‌క్ష‌ల వ‌ర‌కు రుణంపై బ్యాంకులు అందించే అత్య‌ల్ప వ‌డ్డీ రేటు ప‌ట్టిక‌లో ఇచ్చాం. బ్యాంకు నియ‌మ‌నిబంధ‌న‌లు, క్రెడిట్ స్కోర్ ఆధారంగా వ‌డ్డీ రేట్ల‌లో మార్పులుండ‌వ‌చ్చు. ఈఎంఐలో ప్రాసెసింగ్ ఫీజులు, ఇత‌ర ఛార్జీలు కలపలేదు.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని