Gold Loans: బంగారు రుణాలపై వడ్డీ రేట్లు ఏ బ్యాంకులో ఎంతెంత?
సురక్షితమైన రుణం కాబట్టి బ్యాంకులు బంగారంపై సరసమైన వడ్డీ రేట్లకు వేగంగా రుణాలందిస్తున్నాయి. వివిధ బ్యాంకులు అందించే రుణ మొత్తం, వసూలుచేసే వడ్డీ రేట్లు ఇక్కడ చూద్దాం.
ఇంటర్నెట్ డెస్క్: బంగారం తాకట్టుపై దాదాపు అన్ని బ్యాంకులు రుణాలిస్తున్నాయి. ఇది సురక్షిత రుణం కాబట్టి బ్యాంకులు కూడా రుణ మంజూరుకు వేగంగానే స్పందిస్తున్నాయి. ప్రస్తుత కాలంలో బంగారంపై రుణం పొందడమనేది త్వరిత, సులభమైన ప్రక్రియగా చెప్పుకోవచ్చు. రుణం పొందడానికి తక్కువ డాక్యుమెంటేషన్ మాత్రమే అవసరం పడుతుంది. బ్యాంకు, రుణ మొత్తాన్ని బట్టి ఈ రుణాలపై వడ్డీ రేట్లు మారుతూ ఉంటాయి. రుణం కోసం 18, 22 క్యారెట్ల మధ్య బంగారు ఆభరణాలు లేదా బంగారు నాణేలు తాకట్టు పెట్టొచ్చు.
రుణ పరిమితి..
బంగారు రుణ పరిమితి బ్యాంకు, వినియోగదారుని బట్టి మారుతూ ఉంటుంది. బంగారం స్వచ్ఛత, బరువును బట్టి రుణం అందిస్తారు. అయితే, కనీస రుణం రూ.20 వేలు, గరిష్ఠ రుణ మొత్తం రూ.1.50 కోట్లు. ఈ రుణాన్ని ఒక వినియోగదారుడు/కుటుంబం/గ్రూప్ ద్వారా కూడా పొందవచ్చు. బంగారం విలువపై 65% నుంచి 75% వరకు రుణాన్ని పొందొచ్చు.
గోల్డ్ లోన్ ప్రాసెస్ సమయం
రుణ ప్రాసెస్ సమయం, ఫీజులు బ్యాంకును బట్టి మారుతుంటాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు రుణ మొత్తంలో 1% ప్రాసెసింగ్ ఛార్జీగా వసూలు చేస్తాయి. బ్యాంకు ఆఫ్ బరోడా రూ. 3 లక్షల రుణం వరకు ప్రాసెసింగ్ ఫీజును వసూలు చేయడం లేదు. కోటక్ మహీంద్రా బ్యాంకు తన వినియోగదారులకు 90-120 నిమిషాల్లో రుణాన్ని మంజూరు చేస్తుంది. అయితే, లోన్ మొత్తం రూ.25 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ ఉంటే, రుణగ్రహీత ‘ఐటీఆర్’ సమర్పించాల్సి ఉంటుంది. వార్షికాదాయం రూ.5 లక్షలు దాటితే పాన్ తప్పనిసరిగా ఉండాలని గుర్తుంచుకోండి.
ఏ వస్తువులు అంగీకారం కాదు
కోటక్ మహీంద్రా బ్యాంకు వెబ్‌సైట్ ప్రకారం.. హెయిర్ పిన్స్, కఫ్‌లింక్‌లు, గోల్డ్ వాచ్, గోల్డ్ స్ట్రాప్, బంగారం విగ్రహాలు, బంగారు పాత్రలు, 50% కంటే ఎక్కువ తగ్గింపు ఉన్న బంగారు ఆభరణాలు, మంగళసూత్రం, వైట్ గోల్డ్, డైమండ్ జ్యువెలరీ వంటి వస్తువులు/ఆర్టికల్‌లు, రోల్డ్ గోల్డ్ నగలు, గిన్నెలు, బంగారు కడ్డీలు రుణానికి అంగీకారం కావు.
బంగారు రుణాలపై వివిధ బ్యాంకులు వసూలు చేసే వడ్డీ రేట్లు, రుణ మొత్తం వివరాలు జాబితా కింది ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Tesla Bot: యోగా చేస్తోన్న టెస్లా రోబో.. ఇంకా ఏమేం చేస్తోందంటే..?
-
Bandi Sanjay: గ్రూప్ -1 పరీక్ష నిర్వహించే సత్తాలేని సర్కారు ఇది: బండి సంజయ్
-
Cricket News : గిల్‌కు విశ్రాంతి.. సూర్య ఫినిషర్‌గా రావాలన్న గంభీర్!
-
Nara Bhuvaneswarii: అన్నవరం సత్యదేవుని దర్శించుకున్న నారా భువనేశ్వరి
-
Mynampally: ఈ నెల 27లోపు కాంగ్రెస్‌లో చేరతా: మైనంపల్లి
-
TSPSC Group1: గ్రూప్ - 1 ప్రిలిమ్స్ రద్దు.. అప్పీల్‌కు వెళ్లిన టీఎస్పీఎస్సీ