ఎన్‌ఆర్‌ఈ ఖాతాల ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లు ఎంతెంత?

భారత దేశంలో ఎన్‌ఆర్‌ఈ(నాన్‌-రెసిడెంట్‌ ఎక్స్‌టర్నల్‌) ఖాతాల ఎఫ్‌డీలపై ఇక్కడ బ్యాంకులు అధిక వడ్డీ రేటును ఆఫర్‌ చేస్తున్నాయి.

Published : 30 Dec 2022 18:54 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఎన్‌ఆర్‌ఐల అంతర్జాతీయ ఆదాయాన్ని నాన్‌-రెసిడెంట్‌ ఎక్స్‌టర్నల్‌ (ఎన్‌ఆర్‌ఈ) ఖాతా విదేశీ కరెన్సీలో డిపాజిట్ చేయడానికి ఇక్కడ ప్రభుత్వం అనుమతిస్తుంది. భారతీయ రూపాయల్లో విత్‌డ్రా చేసుకోవచ్చు. చాలా బ్యాంకులు ఎన్‌ఆర్‌ఈ ఖాతాదారులకు ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి. వీటిపై లభించే వడ్డీ రేట్లు బ్యాంకును బట్టి భిన్నంగా ఉంటాయి. ప్రముఖ బ్యాంకులైన ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు, కెనరా బ్యాంకు, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు ఎన్‌ఆర్‌ఈ ఎఫ్‌డీలపై ఇచ్చే వడ్డీ రేట్లు ఈ కింద ఉన్నాయి.

ఎస్‌బీఐ ఎన్‌ఆర్‌ఈ ఎఫ్‌డీ: రూ.2 కోట్ల లోపు డిపాజిట్లపై ఈ బ్యాంకు ఒక సంవత్సరం నుంచి ఐదేళ్ల కాలానికి 6.25% నుంచి 6.75% వరకు వడ్డీ రేటును అందిస్తోంది. ఎన్‌ఆర్‌ఈ ఎఫ్‌డీ నుంచి ఒక సంవత్సరం లోపు డిపాజిట్‌ బ్రేక్ చేస్తే బ్యాంకు వడ్డీ చెల్లించదు. అలాగే, ఎస్‌బీఐ వెబ్‌సైట్‌ ప్రకారం దీనిపై ముందస్తు ఉపసంహరణ ఛార్జీలు ఉంటాయి. వర్తించే రేటుకంటే వడ్డీ 0.50% లేదా 1% తక్కువగా ఉంటుంది.

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఎన్‌ఆర్‌ఈ ఎఫ్‌డీ: రూ.2 కోట్ల లోపు డిపాజిట్లపై ఒక సంవత్సరం నుంచి ఐదేళ్ల కాలానికి 6.50% నుంచి 7% వరకు వడ్డీ రేటును ఈ బ్యాంకు అందిస్తోంది. సీనియర్‌ సిటిజన్లకు అదనంగా 0.50% వడ్డీ లభిస్తుంది. ఈ బ్యాంకులో ఎన్‌ఆర్‌ఈ డిపాజిట్లు కనీసం ఒక సంవత్సరం పాటు ఉంచాలి. 

ఐసీఐసీఐ బ్యాంకు ఎన్‌ఆర్‌ఈ ఎఫ్‌డీ: రూ.2 కోట్ల లోపు డిపాజిట్లపై ఒక సంవత్సరం నుంచి ఐదేళ్ల కాలానికి 6.60% నుంచి 7% వరకు వడ్డీ రేటును ఈ బ్యాంకు అందిస్తోంది. ఒక సంవత్సరం లోపు డిపాజిట్‌ బ్రేక్ చేస్తే బ్యాంకు వడ్డీ చెల్లించదు.

కెనరా బ్యాంకు ఎన్‌ఆర్‌ఈ ఎఫ్‌డీ: రూ.2 కోట్ల లోపు డిపాజిట్లపై ఒక సంవత్సరం నుంచి ఐదేళ్ల కాలానికి 6.50% నుంచి 6.80% వరకు వడ్డీ రేటును ఈ బ్యాంకు అందిస్తోంది. 666 రోజుల ప్రత్యేక డిపాజిట్‌ కాలానికి 7% వరకు వడ్డీ పొందొచ్చు.

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు ఎన్‌ఆర్‌ఈ ఎఫ్‌డీ: రూ.2 కోట్ల లోపు డిపాజిట్లపై ఒక సంవత్సరం నుంచి ఐదేళ్ల కాలానికి 6.10% నుంచి 6.30% వరకు వడ్డీ రేటు పొందొచ్చు. 600 రోజుల ప్రత్యేక డిపాజిట్‌ కాలానికి 7% వరకు వడ్డీ పొందొచ్చు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు