వ్య‌క్తిగ‌త రుణాలకు వ‌డ్డీ రేట్లు ఏ బ్యాంక్‌లో ఎంతెంత ?

క్రెడిట్ స్కోర్ 750 ఇంత‌కంటే దాటి ఉన్న‌వారికి వ్య‌క్తిగ‌త రుణాలు పొందే అవ‌కాశాలు చాలా ఎక్కువ ఉంటాయి.

Published : 24 Feb 2022 15:17 IST

వ్య‌క్తిగ‌త రుణాల గురించి ఎదురు చూసేవారికి బ్యాంకులు  8.50% వ‌డ్డీ రేటు నుండి రుణాల‌ను అందిస్తున్నాయి. వ్య‌క్తిగ‌త రుణాలను మీరు ఎటువంటి హామీ లేకుండా బ్యాంకుల నుండి పొందొచ్చు. ఎటువంటి త‌న‌ఖా లేకుండా ల‌భించే ఈ రుణాల‌కు వ‌డ్డీ రేట్లు కొద్దిగా ఎక్కువ ఉంటాయ‌నే చెప్పాలి. ఏదైనా న‌గ‌దు అవ‌స‌రాలు అత్య‌వ‌స‌రం అయితే, ఈ రుణాలు బాగా ఉప‌యోగ‌ప‌డ‌తాయి.

డాక్యుమెంట్స్ ఖ‌చ్చితంగా అంద‌చేస్తే కొన్ని రోజులు లేదా గంట‌ల‌లో కూడా వ్య‌క్తిగ‌త రుణాన్ని పొందొచ్చు. ఇది అవ‌స‌ర‌మైన సమయం లో త‌క్ష‌ణ ఆర్ధిక ఉప‌శ‌మ‌నం ఇస్తుంది. ఏమైనా వ‌స్తువులు కొనుగోలు చేయ‌డం, వైద్య లేదా ప్ర‌యాణ బిల్లులు చెల్లించ‌డం, మీ పిల్ల‌ల చ‌దువుల‌కు ఆర్ధిక వ‌న‌రుగా ఉండ‌టం కోసం వ్య‌క్తిగ‌త రుణాల‌ను తీసుకోవ‌చ్చు. దాదాపు అన్ని బ్యాంకులు ఆక‌ర్ష‌ణీయ‌మైన వ‌డ్డీ రేట్ల‌తో వ్య‌క్తిగ‌త రుణాల‌ను అందిస్తున్నాయి.

చాలా బ్యాంకుల‌కు వ్య‌క్తిగ‌త రుణాల కోసం సాధార‌ణ డాక్యుమెంటేష‌న్ ప్ర‌క్రియ మాత్ర‌మే అవ‌స‌రం. ఇది వినియోగ‌దారుల‌కు వ్య‌క్తిగ‌త రుణాల‌ను పొంద‌డం సుల‌భ‌త‌రం చేస్తుంది. చాలా సంద‌ర్భాల‌లో, వ్య‌క్తిగ‌త రుణాలు పొంద‌డానికి బ్యాంకుల‌కు గుర్తింపు చిరునామా, ఆదాయానికి సంబంధించిన డాక్యుమెంట్‌ను త‌ప్ప‌నిస‌రిగా ఇవ్వాలి.

వ్య‌క్తిగ‌త రుణ ధ‌ర‌ఖాస్తులు చాలా త్వ‌ర‌గానే ప్రాసెస్ చేయ‌బ‌డ‌తాయి. రుణం పొంద‌డానికి కూడా ఎక్కువ స‌మ‌యం ప‌ట్ట‌దు. సాధార‌ణంగా బ్యాంకులు మంచి ఆర్ధిక రికార్డులు ఉన్న వినియోగ‌దారుల‌కు ముంద‌స్తుగా ఆమోదించ‌బ‌డిన వ్య‌క్తిగ‌త రుణాల‌ను అందిస్తున్నాయి. క్రెడిట్ స్కోర్ 750 ఇంత‌కంటే దాటి ఉన్న‌వారికి వ్య‌క్తిగ‌త రుణాలు పొందే అవ‌కాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. ఆర్ధిక సంస్థ‌ల వ‌ద్ద ఎలాంటి రుణం తీసుకున్నా గాని డిఫాల్ట్ లేకుండా `ఈఎంఐ`లు చెల్లించాలి.  ఈఎంఐ చెల్లింపుల‌లో జాప్యం లేదా డిఫాల్ట్, క్రెడిట్ స్కోర్‌ని తగ్గేలా చేస్తుంది.

5 ఏళ్ల కాల‌వ్య‌వ‌ధికి రూ. 2.50 ల‌క్ష‌ల వ్య‌క్తిగ‌త రుణాల‌పై ప్ర‌స్తుతం అత్య‌ల్ప వ‌డ్డీ రేట్ల‌ను అంద‌చేస్తున్న 25 బ్యాంకుల జాబితా, ఈఎంఐలు ఈ క్రింద ఉన్నాయి.

ఈ డేటా 15 ఫిబ్ర‌వ‌రి, 2022 నాటిది.

గ‌మ‌నిక:

మీ లోన్ మొత్తం, కాల ప‌రిమితి, క్రెడిట్ స్కోర్ మొద‌లైన వాటిపై ఆధార‌ప‌డి వ్య‌క్తిగ‌త రుణాల వ‌డ్డీ రేట్లు మార‌వ‌చ్చ‌ని గ‌మ‌నించ‌గ‌ల‌రు. ప్రాసెసింగ్ ఫీజులు, ఇత‌ర ఛార్జీలు `ఈఎంఐ`ల‌లో క‌ల‌ప‌బ‌డ‌లేదు. బ్యాంకు నియ‌మ‌ నిబంధ‌న‌ల‌ను బ‌ట్టి వ‌డ్డీ రేట్లు మార‌వ‌చ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని