Loan: ఆస్తిపై రుణం.. వడ్డీ రేట్లు!

ఆస్తిని తాకట్టు పెట్టుకుని బ్యాంకులు రుణాలు అందజేస్తున్నాయి. వీటి వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయో చూద్దాం.

Published : 09 Jan 2023 14:18 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బ్యాంకులు అనేక రకాల రుణాలను మంజూరు చేస్తుంటాయి. అందులో ఆస్తిపై రుణం కూడా ఒకటి. మీకు ఇల్లు లేదా ఏదైన స్థిరాస్తికి సంబంధించిన ఆస్తి ఉంటే.. దాన్ని తాకట్టు పెట్టి రుణం తీసుకోవచ్చు. ఇది సురక్షితమైన రుణం కాబట్టి, సరసమైన వడ్డీ రేట్లతో, కనీస డాక్యుమెంటేషన్‌తో రుణాన్ని సులభంగా పొందవచ్చు.

ఆస్తిపై రుణం కోసం దరఖాస్తు చేసే ముందు గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. ఆస్తిపై వివాదం లేకుండా, చట్టబద్ధంగా ఉండాలి. ఆస్తికి అన్ని ఆమోదాలు ఉండాలి. ఆస్తి, రుణం తీసుకునే వ్యక్తి పేరు మీద ఉండాలి. క్రెడిట్‌ స్కోరు బాగున్న వారికి రుణం త్వరగా అందుతుంది. రుణాల విషయంలో గతంలో చేసే చెల్లింపుల విషయంలో ఆలస్యం లేదా డిఫాల్ట్‌ చేయని క్లీన్‌ ఫైనాన్షియల్‌ రికార్డులు ఉన్న వినియోగదారులకు మందస్తు రుణ ఆమోదం కూడా ఉంటుంది. ఈఎంఐ కాలవ్యవధి 7-20 సంవత్సరాల వరకు కూడా ఎంచుకోవచ్చు. 

రూ.15 లక్షల రుణంపై 7 సంవత్సరాల కాలవ్యవధికి ఈఎంఐ, వడ్డీ రేట్లు ఈ కింది పట్టికలో చూడండి..

 

గమనిక: ఈ డేటా 2023 జనవరి 3 నాటిది. బ్యాంకులు, హెచ్‌ఎఫ్‌సీలు అందించే అత్యల్ప వడ్డీ రేట్లను మాత్రమే ఇక్కడ అందించాం. ఆస్తి, వ్యక్తిగత అర్హతలను బట్టి వడ్డీ రేట్లలో మార్పులుంటాయి. ప్రాసెసింగ్‌ ఛార్జీలు ఈఎంఐలో కలపలేదు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని