సెకండ్ హ్యాండ్ కార్ల రుణాల వ‌డ్డీ రేట్లు ఏ బ్యాంక్‌లో ఎంత..?

దాదాపు అన్ని బ్యాంకులు సెకండ్ హాండ్ కారును కొనుగోలు చేయ‌డానికి రుణాల‌ను అందిస్తున్నాయి.

Updated : 12 Mar 2022 14:45 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఒకప్పుడు కార్ల‌ను ఎక్కువ కాలం వాడి ఆ త‌ర్వాత అమ్మేవారు. ఇప్పుడు 1-4 సంవ‌త్స‌రాల్లోనే త‌మ వాడిన కార్ల‌ను అమ్మేస్తున్నారు. కొత్త కారు కొనుగోలు, పాత కారు అమ్మ‌కాలు ఇవి రెండూ స‌మాంత‌రంగా పెరిగాయి. దీంతో సెకండ్ హ్యాండ్‌ కార్ల మార్కెట్ కూడా భారీగా పెరిగింది. ఇప్పుడు మంచి కండీష‌న్‌లో ఉన్న పాత కార్లు కొనేవారు కూడా పెరిగారు.

అర్హ‌త ప్ర‌మాణాల‌కు అనుగుణంగా ఉండి జీతం పొందే వారు, స్వ‌యం ఉపాధి పొందేవారు ఈ ప్రీ-ఓన్డ్ కారు రుణానికి దర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. దాదాపు అన్ని బ్యాంకులూ సెకండ్ హ్యాండ్‌ కారును కొనుగోలు చేయ‌డానికి రుణాల‌ను అందిస్తున్నాయి. బ్యాంకులు మీ రుణ దర‌ఖాస్తును ఆమోదించే ముందు మీ ఆదాయంతో పాటుగా కారు విలువ‌, మీ క్రెడిట్ స్కోర్ ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటాయి.

కారు విలువ‌లో 70% వ‌ర‌కు రుణం ఇస్తాయి. అయితే కొన్ని బ్యాంకులు కార్ల రుణ ఈఎమ్ఐల‌ను 3 ఏళ్లకే అమ‌లు చేస్తున్నారు. అయితే, కారు ప‌త్రాలు స‌రిగ్గా ఉండాలి. కాబట్టి కారు కొనేముందు పత్రాలు సరిగా ఉన్నాయో లేదో చూసుకోవాలి. ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లో రుణాలు దర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. క్రెడిట్ స్కోర్ 750 అంత‌క‌న్నా ఎక్కువ ఉంటే త‌క్కువ వ‌డ్డీ రేటుతో రుణాలు సత్వరమే పొందే వీలుంటుంది. అయితే కొత్త కారు రుణాలతో పోలిస్తే సెకండ్‌ హ్యాండ్‌ కార్లకు అందించే రుణానికి వడ్డీ రేటు కాస్త అధికంగానే ఉంటుంది. మూడేళ్ల కాలానికి రూ.3.50 లక్షల కారు రుణానికి ఆయా బ్యాంకులు అందిస్తున్న వడ్డీ రేట్లు, ఈఎంఐ వివరాలు దిగువన ఉన్నాయి.

నోట్‌: ఈ డేటా 2022 మార్చి 8 నాటిది. ఈఎంఐలో ప్రాసెసింగ్‌ ఫీజు, ఇతర ఫీజులు కలపలేదు. వ్యక్తులను బట్టి వడ్డీ రేటులో మార్పు ఉండొచ్చు.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts