పొదుపు చేస్తే స‌రిపోతుందా? మరి పెట్టుబ‌డి మాటేమిటి?

క్రమశిక్షణ‌గా పొదుపు చేయ‌డం మాత్ర‌మే కాదు, మీ దీర్ఘ‌కాలిక ల‌క్ష్యాల సాధ‌న‌కు స‌రైన విధంగా మ‌దుపు చేయ‌డం కూడా ముఖ్య‌మే....

Published : 19 Dec 2020 14:14 IST

క్రమశిక్షణ‌గా పొదుపు చేయ‌డం మాత్ర‌మే కాదు, మీ దీర్ఘ‌కాలిక ల‌క్ష్యాల సాధ‌న‌కు స‌రైన విధంగా మ‌దుపు చేయ‌డం కూడా ముఖ్య‌మే​​​​​​​.

జ‌యంత్ ఒక ఐటీ ఉద్యోగి. అత‌ను త‌న అవ‌స‌రాల‌కు త‌గిన‌ట్లుగా పొదుపు చేస్తున్నాడు. అత‌ను వివిధ ఆస్తులు, ఈక్వీటీలు, రియ‌ల్ ఎస్టేట్‌, బంగారం వంటి వాటిలో పెట్టుబ‌డులు పెడుతున్నాడు. అత‌ను ఎంచుకున్న సాధ‌నాలు, మ‌దుపు చేస్తున్న మొత్తం, పోర్ట్‌ఫోలియో ప‌రిమాణం ఆధారంగా స‌రిప‌డ‌నంత పొదుపు చేస్తున్నాడ‌ని కొన్ని నెల‌ల క్రితం వ‌ర‌కు అత‌ను భావించేవాడు.

అయితే అత‌ను త‌న ఆర్థిక సలహాదారు, సెబీ రిజిస్ట‌ర్డ్ పెట్టుబ‌డి స‌లహాదారు అయిన స్వ‌ప్నిల్ కెండెను క‌లిసిన త‌రువాతే, పొదుపు చేయ‌డానికి, స‌రైన ప‌ద్ధ‌తిలో మ‌దుపు చేయ‌డానికి, మ‌ధ్య చాలా తేడా ఉంద‌ని గ్ర‌హించాడు.

జ‌యంత్ అత‌నికి వీలైనంత వ‌ర‌కు పొదుపు చేస్తున్నాడు. కానీ అత‌ని ల‌క్ష్యాల‌ను చేరుకునేందుకు స‌రిపోయే పెట్ట‌బడి మార్గాల‌ను ఎంచుకోవ‌డంలో విఫలమ‌య్యాడు. అత‌ని పోర్టిఫోలియోలో రియ‌ల్ ఎస్టేట్‌, డెట్ పెట్టుబ‌డులు అధికంగా ఉండ‌డం వ‌ల్ల ఇబ్బందుల‌లో ప‌డే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయ‌ని గ్ర‌హించాడు. పెట్టుబ‌డి స‌ల‌హాదారుల స‌ల‌హాతో జయంతో త‌న పెట్టుబ‌డి ప్ర‌ణాళికు రూపొందించుకున్నాడు.

పొదుపు శాతాన్ని అదేవిధంగా వుంచి, అత‌ను ఎంచుకున్న పెట్టుబ‌డి విధానాల‌లో మార్పుచేశారు. ప్ర‌స్తుతం అతని పోర్ట్‌ఫోలియోలో ఎక్కువ శాతం ఈక్విటీలు ఉన్నాయి. అందువ‌ల్ల మ్యూచువ‌ల్ ఫండ్ల ద్వారా ఈక్వీటీ లో ఎక్కువ భాగం పెట్టుబ‌డులు చేస్తూ క్ర‌మంగా ఈక్వీటీ పెట్టుబ‌డుల‌ను పెంచుకొనే విధంగా ప్ర‌ణాళిక రూపొందించుకున్నాడు.

ప్రారంభంలో పెట్టుబ‌డులు:

జ‌యంత్‌కి పొదుపు చేయండం స‌మ‌స్య‌కాదు. అత్య‌వ‌స‌ర స‌మ‌యాల్లో ఇబ్బంది ప‌డ‌కుండా ఉండేదుకు గాను పొదుపు చేసే అల‌వాటును, నియ‌మాలను త‌న త‌ల్లిదండ్రుల నుంచే నేర్చుకున్నాడు. ముందుగా ఏమి చేయాలి అనే దానికి ఒక‌ ఆర్థిక ప్రణాళిక రూపొందించుకున్నాడు. అత‌ని పోర్ట్‌ఫోలియోలో వివిధ ర‌కాలైన ఈక్విటీ ఫండ్లు 22 ఉన్నాయి. అత‌ను వాటిని 7కు కుదించాడు. జయంత్ తన ఈక్విటీ రాబ‌డిపై సంతోషంగా ఉన్నాడు. స్థిరాస్తులలో అధిక పెట్టుబ‌డులు పెట్ట‌లేదు.

మార్కెట్ల గురించి స‌రైన అవ‌గాహ‌న లేకుండానే పెట్టుబ‌డులు ప్రారంభించాడు. 2008 సంక్షోభంలో మార్కెట్లు క్షీణించి, తిరిగి గణనీయమైన లాభాలను ఆర్జించినప్పుడు కూడా పెట్టుబ‌డులను నిర్వ‌హించాడు. ఈ కాలంలో రియ‌ల్ ఎస్టేట్లో కూడా పెట్టుబ‌డులు పెట్టాడు. అత‌ని భార్య ప్రియాంక కుటుంబ ఆర్థిక వ్య‌వ‌హారాల‌లో చురుకుగా పాల్గోనే వారు కాదు.

ప్ర‌స్తుత పెట్టుబ‌డులు:
జ‌యంత్‌, ప్రియాంక‌లకు ఒక‌ కుమార్తె ఉంది. వారి కుమార్తెకు వీలైనంత మంచి భ‌విష్య‌త్తు ఏర్పాటు చేయ‌ల‌నేది వారి కోరిక‌. ప్ర‌స్తుతం వారికున్న ప్ర‌ధాన దీర్ఘ‌కాలిక ల‌క్ష్యాలు వారి 8 సంవ‌త్స‌రాల పాప‌ విద్య, వివాహం. అందుకోసం డెట్ పెట్టుబ‌డుల‌ను ఈక్వీటీ మ్యూచువ‌ల్ ఫండ్‌లోకి త‌ర‌లించారు. జ‌యంత్‌ ఈక్వీటీ ఫండ్లు లార్జ్ క్యాప్ ఫండ్ల‌తో పోలిస్తే ఎక్కువ రిస్క్ ఉన్న మిడ్ క్యాప్ ఫండ్ల‌లో ఉన్నాయి. వారి కుమార్తె గురించిన ల‌క్ష్యాల‌ను చేరుకునేందుకు వీలుగా లార్జ్ క్యాప్ ఫండ్ల‌లో మ‌దుపు చేశారు. ప్ర‌స్తుతం వారి అన్ని మ్యూచువ‌ల్ ఫండ్ల పెట్టుబ‌డులు డైరెక్ట్ ప్లాన్‌ల‌లో ఉన్నాయి. ఈ విధంగా చేయ‌డం వ‌ల్ల క‌మీష‌న్ రూపంలో న‌ష్ట‌పోయే మొత్తాన్ని పొదుపు చేయ‌వ‌చ్చు.

జ‌యంత్ మ‌రొక దీర్ఘ‌కాలిక ల‌క్ష్యం ప‌ద‌వీ విర‌మ‌ణ నిధి. ఇందుకోసం అత‌ను ఇంత‌కు ముందే మిడ్ క్యాప్‌, లార్జ్ క్యాప్ ఫండ్ల కల‌యిక‌తో పీపీఎఫ్‌లో మ‌దుపు చేశాడు. 2019 లో విదేశీ విహార‌యాత్ర‌కు వెళ్ళ‌డం, కారు కొనుగోలు చేయ‌డం వంటి స్వ‌ల్ప కాలిక ల‌క్ష్యాల‌కు అల్ట్రా షార్టర్మ్ లిక్విడ్ ఫండ్లు, లిక్విడ్ ఫండ్ల‌లో మ‌దుపు చేశాడు.

జ‌యంత్‌కు ఒక ట‌ర్మ్ బీమా ఉంది కానీ అది స‌రిపోద‌ని అని ఆర్ధిక స‌ల‌హాదారుడు చెప్ప‌డంతో అత‌ని స‌ల‌హా మేర‌కు ట‌ర్మ్ పాల‌సీ హామీ మొత్తాన్ని పెంచుకుని, అత‌నికి ఉన్న సంప్రాదాయ ఎండోమెంట్‌, మ‌నీబ్యాక్ పాల‌సీల‌ను స‌రెండ‌ర్ చేశాడు. అంతేకాకుండా అధిక హామీ వ‌చ్చే విధంగా సాధార‌ణ ఫ్యామిలీ ఫ్లోట‌ర్ పాల‌సీని టాప్ ప్లాన్‌తో కొనుగోలు చేశాడు.

జ‌యంత్ పొదుపు అల‌వాటును త‌న త‌ల్లిదండ్రుల వ‌ద్ద నుంచి, పెట్టుబ‌డుల నిర్వ‌హ‌ణ ఆర్థిక ప్ర‌ణాళికాదారుని వ‌ద్ద‌ నుంచి నేర్చుకుని, అత‌ను పొదుపు చేసిన మొత్తాన్ని స‌రైన రీతిలో పెట్టుబ‌డి పెట్ట‌డం ద్వారా త‌న ఆర్ధిక జీవితాన్ని నియంత్ర‌ణ‌లో ఉంచుకున్నాడు. అందువ‌ల్ల పొదుపు అల‌వాటు చేసుకోవ‌డం మాత్ర‌మే కాదు. మ‌న ఆర్థిక ల‌క్ష్యాల‌కు అనుగుణంగా స‌రైన పెట్టుబ‌డి విధానాల‌ను ఎంచుకోవ‌డం కూడా ముఖ్య‌మే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని