Investments: మీ పిల్లల భవిష్యత్‌కు సాయపడే పెట్టుబడి సాధనాలు
ప్రస్తుత కాలంలో తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్తు కోసం, ముఖ్యంగా విద్యా, వివాహం లాంటి ఖర్చులకు చాలా ముందుగానే సిద్ధం అవుతున్నారు. పిల్లల ఆర్థిక భవిష్యత్తును సురక్షితం చేయడానికి కొన్ని పెట్టుబడి ఎంపికలు ఇక్కడ ఉన్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: ఈ రోజుల్లో విద్యకు, వివాహానికి ఖర్చులు ఎలా ఉన్నయో అందరికీ తెలిసిందే. వీటికి దీర్ఘకాలిక ఆర్థిక ప్రణాళిక చాలా అవసరం. ఈ ఖర్చులకు ముందు నుంచే సిద్ధం కావాలి. పిల్లల కోసం సరైన సమయంలో దీర్ఘకాలిక పెట్టుబడులను ఎంచుకోవాలి. ఈ పెట్టుబడులు వారి వయసు, జీవిత లక్ష్యానికి సరిపోయేలా ఉండాలి. పెట్టుబడులు పెట్టే ముందు పోర్ట్‌ఫోలియోను తప్పకుండా సమీక్షించాలి. ద్రవ్యోల్బణం, పెట్టుబడి లక్ష్యం, రిస్క్ మొదలైన అంశాల సమతౌల్యతను పాటించాలి. పిల్లల భవిష్యత్‌కు ఏయే పెట్టుబడి పథకాలతో ముందుకెళ్లాలో చూద్దాం.
చిన్న పొదుపు పథకాలు
సుకన్య సమృద్ధి యోజన పథకం (SSY), పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF), నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ (NSC) వంటి చిన్న పొదుపు పథకాల్లో పెట్టుబడులు అధిక స్థాయి భద్రతను కలిగి ఉండి దీర్ఘకాలంలో మంచి రాబడిని అందిస్తాయి. మీ పిల్లల వయసు, ఆర్థిక లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ పొదుపు పథకాలను ఎంచుకోవచ్చు. ఉదా: 10 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న మీ అమ్మాయి వివాహం, ఉన్నత విద్య కోసం పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్నట్లయితే.. సుకన్య సమృద్ధి యోజన పథకం (SSY)లో పెట్టుబడి పెట్టొచ్చు. ఇంకా మీ పిల్లల ఉన్నత విద్య కోసం PPF, NSC, పోస్టాఫీసు ఫిక్స్‌డ్ డిపాజిట్లలో పెట్టుబడి పెట్టొచ్చు.
ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లు
మీ పిల్లల పెట్టుబడి పోర్ట్‌ఫోలియోలో రాబడిని పెంచడంలో మ్యూచువల్ ఫండ్లు మీకు సహాయపడతాయి. వీటిలో పెట్టుబడి పెట్టేటప్పుడు దీర్ఘకాలానికి ప్లాన్ చేసుకోవాలి. మ్యూచువల్ ఫండ్లలో స్వల్పకాలానికి ఒడుదొడుకులు ఏర్పడినప్పటికీ.. దీర్ఘకాల పెట్టుబడులు మంచి రాబడిని అందిస్తాయి. దీర్ఘకాలిక లక్ష్యాలను సాధించడానికి ఈక్విటీ ఫండ్లను ఎంచుకోవచ్చు. రిస్క్‌ను తగ్గించడానికి, మంచి రాబడి పొందడానికి క్రమానుగత పెట్టుబడి(SIP) ఒక మంచి ఎంపిక. ఇండెక్స్ ఫండ్స్‌తో మొదలు పెట్టడం మంచిది.
రికరింగ్, ఫిక్స్‌డ్ డిపాజిట్లు
మీ పిల్లల భవిష్యత్ కోసం పెట్టుబడి పెట్టేటప్పుడు, వారికి సంబంధించిన ఆర్థిక అత్యవసర పరిస్థితులను తీర్చడానికి అత్యవసర నిధిని సృష్టించడంపై దృష్టి పెట్టాలి. ఈ నిధిని నిర్వహించడానికి మీరు ఫిక్స్‌డ్ డిపాజిట్లలో పెట్టుబడి పెట్టొచ్చు. మీరు రాబోయే కొద్ది సంవత్సరాల్లో క్రమంగా అత్యవసర నిధిని సృష్టించాలని ప్లాన్ చేస్తుంటే, బ్యాంకు ఆర్‌డీలలో పెట్టుబడి పెట్టొచ్చు. ప్రస్తుతం బ్యాంకు డిపాజిట్ వడ్డీ రేటు పెరుగుతోంది. కాబట్టి తక్కువ మెచ్యూరిటీ కాలవ్యవధికి డిపాజిట్‌ను ఎంచుకోవచ్చు.
సావరిన్ గోల్డ్ బాండ్ (SGB)
అనేక సంవత్సరాల నుంచి బంగారం.. ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొనే ధీటైన పెట్టుబడిగా పేరుగాంచింది. బంగారానికి ప్రతిరూపమైన ఈ బాండ్ల కొనుగోలుకు ప్రతి సంవత్సరం ఆర్‌బీఐ పలు దఫాలుగా ప్రకటిస్తుంది. వీటిని బ్యాంకుల ద్వారా కొనుగోలు చేయొచ్చు. మీరు సావరిన్ గోల్డ్ బాండ్ ద్వారా బంగారంలో పెట్టుబడి పెట్టొచ్చు. ముఖ విలువ, మూలధన విలువపై దాదాపు 2.50% వడ్డీను ఈ బాండ్ల ద్వారా పొందొచ్చు. 8 సంవత్సరాల దీర్ఘకాల వ్యవధికి మదుపు చేయాలనుకుంటే.. భౌతిక బంగారానికి దూరంగా ఉండి డిజిటల్ రూపంలో బంగారంలో పెట్టుబడి పెట్టడానికి సావరిన్ గోల్డ్ బాండ్‌లు సులభమైన మార్గం. డిజిటల్ గోల్డ్ కంటే సులభంగా రిడీమ్ చేసుకునే వీలు ఉండడం వల్ల బంగారంలో పెట్టుబడి పెట్టేందుకు SGB మంచి మార్గమని నిపుణులు చెబుతున్నారు. SIP ఆప్షన్ ద్వారా గోల్డ్ ఈటీఎప్‌లలో కూడా పెట్టుబడి పెట్టొచ్చు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
IPL 2023: ఆర్సీబీ మార్చ్‌లో గేల్ డ్యాన్స్..కోహ్లీ అని అరుస్తూ ప్రేక్షకుల కేరింతలు
-
Movies News
Priyanka Chopra: బాలీవుడ్‌పై ప్రియాంక చోప్రా సంచలన వ్యాఖ్యలు.. అందుకే హాలీవుడ్‌కి వెళ్లానంటూ
-
Movies News
Social Look: ఫొటో ఎంపిక చేసుకోమన్న యషిక.. పెయింటింగ్‌ని తలపించేలా మీనాక్షి స్టిల్!
-
Politics News
DK Shivkumar: ఎన్నికల ప్రచారంలో కరెన్సీ నోట్లు వెదజల్లిన డీకేఎస్.. వీడియో వైరల్
-
World News
North korea: కిమ్మా.. మజాకానా? లాక్డౌన్లోకి ఉత్తర కొరియా నగరం!
-
Movies News
Dasara Memes: నాని ‘దసరా’.. ఈ మీమ్స్.. వైరల్ వీడియోలు చూస్తే నవ్వకుండా ఉండలేరు!