electric vehicles: ‘ఈవీ’ల కోసం మూడేళ్లలో 10వేల ఛార్జింగ్‌ స్టేషన్లు: ఐవోసీ

దేశంలో ఇప్పుడిప్పుడే విద్యుత్‌ వాహనాల(ఈవీ)కు డిమాండ్‌ పెరుగుతోంది. ఇప్పటికే కర్ణాటక, దిల్లీలో ప్రజారవాణా వ్యవస్థలో విద్యుత్‌ వాహనాలను ప్రవేశపెట్టారు. ప్రజలు కూడా విద్యుత్‌ వాహనాల కొనుగోలుకు ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే, సాధారణ వాహనాలకు పెట్రోల్ బంక్‌ మాదిరిగానే

Published : 03 Nov 2021 19:51 IST

దిల్లీ: దేశంలో ఇప్పుడిప్పుడే విద్యుత్‌ వాహనాల(ఈవీ)కు డిమాండ్‌ పెరుగుతోంది. ఇప్పటికే కర్ణాటక, దిల్లీలో ప్రజారవాణా వ్యవస్థలో విద్యుత్‌ వాహనాలను ప్రవేశపెట్టారు. ప్రజలు కూడా విద్యుత్‌ వాహనాల కొనుగోలుకు ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే, సాధారణ వాహనాలకు పెట్రోల్ బంక్‌ మాదిరిగానే వీటికీ ఛార్జింగ్‌ స్టేషన్లు అవసరమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌(ఐవోసీ) సంస్థ రానున్న మూడేళ్లలో దేశవ్యాప్తంగా 10వేల ఛార్జింగ్‌ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. వచ్చే 12 నెలల్లో 2వేల ఛార్జింగ్‌ స్టేషన్లు.. ఆ తర్వాత రెండేళ్లలో 8వేల స్టేషన్లు ఏర్పాటు చేస్తామని ఐవోసీ ఛైర్మన్‌ ఎస్‌.ఎం. వైద్య వెల్లడించారు. ఇప్పటికే పలు సంస్థలు ఛార్జింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేయడంలో నిమగ్నమయ్యాయి. ఇటీవల టాటా పవర్‌ సంస్థ దేశవ్యాప్తంగా వెయ్యి ఛార్జింగ్‌ స్టేషన్లను ఏర్పాటు చేసింది. ప్రముఖ ఎలక్ట్రిక్‌ స్కూటర్ల తయారీ సంస్థ ‘ఏథర్‌ ఎనర్జీ’ కూడా 2022 నాటికి దాదాపు 6500 ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటే లక్ష్యంగా  పెట్టుకున్నట్లు ఇటీవల వెల్లడించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని