Apple WWDC 2023: కూల్ ఫీచర్లతో iOS 17.. ఫోన్ల జాబితా ఇదే..
iOS 17 new features: యాపిల్ తదుపరి ఆపరేటింగ్ సిస్టమ్ వెర్షన్ ఐఓఎస్ 17ను ప్రకటించింది. ఇందులో కొన్ని కొత్త ఫీచర్లను జోడించింది. ఇంతకీ ఆ ఫీచర్లేంటి? ఏయే ఫోన్లకు ఐఓఎస్ 17 రాబోతోంది?
Apple Event | ఇంటర్నెట్ డెస్క్: యాపిల్ కంపెనీ ఏటా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే యాపిల్ వరల్డ్‌వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ (Apple WWDC 2023) ఈవెంట్‌లో లేటెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ వెర్షన్‌ను ప్రకటించింది. మ్యాక్‌బుక్ ఎయిర్, మ్యాక్ స్టూడియో వంటి ఉత్పత్తులతో పాటు ఐఓఎస్ 17ను (iOS 17) ఈ ఈవెంట్‌లో తీసుకొచ్చింది. కొత్త ఐఓఎస్ వెర్షన్‌లో కొన్ని కూల్ ఫీచర్లను యాపిల్ ప్రకటంచింది. స్టాండ్‌బై మోడ్, ఆఫ్‌లైన్ మ్యాప్స్, లైవ్ స్టిక్కర్స్ వంటివి అందులో ఉన్నాయి. ఇంతకీ కొత్త ఐఓఎస్ ఎప్పుడు రానుంది? ఏ డివైజులకు రానుంది? వంటి వివరాలు చూద్దాం..
కొత్త ఫీచర్లు ఇవే..
- యాపిల్ తన లేటెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో (iOS 17) కొన్ని కొత్త ఫీచర్లను తీసుకొచ్చింది. అందులో ఒకటి లైవ్ వాయిస్ మెయిల్ ఫీచర్. ఈ ఫీచర్ ద్వారా రికార్డింగుల రియల్‌టైమ్ ట్రాన్స్‌స్క్రిప్షన్‌ను చూడొచ్చు.
- యాపిల్ యూజర్లు ఆడియో, వీడియో కాల్స్ చేసేందుకు ఉపయోగించే ఫేస్‌టైమ్ యాప్‌లోనూ కొత్త ఫీచర్‌ను జోడించారు. కాల్ చేసినప్పుడు అవతలి వ్యక్తి లిఫ్ట్ చేయని సందర్భంలో ఆడియో, వీడియో మెసేజులను యూజర్లు పంపించుకోవచ్చు. రియాక్షన్స్ సైతం జోడించొచ్చు.
- యాపిల్ తన మెసేజింగ్ యాప్‌లోనూ కొత్తగా స్టిక్కర్లను తీసుకొచ్చింది. అలాగే ఐమెసేజ్ ద్వారా లొకేషన్ షేరింగ్ సదుపాయాన్ని తెచ్చింది. ఐమెసేజ్ ద్వారా పంపించే ఆడియో సందేశాలు సైతం ట్రాన్స్‌స్క్రిప్ట్ అవుతాయి.
- యాపిల్ ఐఓఎస్‌లో ఇకపై ఆఫ్‌లైన్‌లోనూ మ్యాప్స్ వినియోగించొచ్చు. వాయిస్ అసిస్టెంట్ కోసం ఇకపై ‘హే సిరి’ అనాల్సిన అవసరం లేదు. ‘సిరి’ అంటే సరిపోతుంది.
- స్టిక్కర్లను యాపిల్ మరింత మెరుగుపరిచింది. ఇకపై ఏ ఫొటోతోనైనా స్టిక్కర్లను తయారు చేసుకోవచ్చు. మోషన్ ఫొటోలతో లైవ్ స్టిక్కర్లను సైతం రూపొందించుకోవచ్చు. థర్డ్ పార్టీ యాప్స్‌లోనూ వీటిని వినియోగించుకోవచ్చు.
- యాపిల్ డివైజుల్లో ఉండే ఎయిర్‌డ్రాప్‌ను ఉపయోగించి దగ్గర్లో ఉన్న యాపిల్ యూజర్‌కు ఒక్క స్వాప్‌తో ఫోన్ నంబర్లు, ఇ-మెయిల్ అడ్రస్‌లు పంపించుకోవచ్చు. పెద్ద పెద్ద ఫైల్స్‌ను సైతం షేర్ చేసుకోవచ్చు.
- యాపిల్ ఐఓఎస్ 17లో (iOS 17) కొత్తగా జర్నల్ అనే యాప్ రాబోతోంది. రోజు ప్రారంభం మొదలు రాత్రి వరకు జరిగే ముఖ్యమైన మూమెంట్స్‌ను అందులో సేవ్ చేసుకోవచ్చు. ఫొటోలను సైతం యాడ్ చేసుకోవచ్చు. దీనికి ఎండ్-టు- ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఉంటుంది.
- ఇకపై యాపిల్ ఐఫోన్‌ను క్లాక్‌లా వాడుకోవచ్చు. ఇందుకోసం స్టాండ్‌బై మోడ్‌ను తీసుకొస్తున్నారు. ఐఫోన్‌ను ఒకవైపు తిప్పి పెట్టగానే స్టాండ్‌బై ఫీచర్ ఆటోమేటిక్‌గా పనిచేస్తుంది. ఫుల్ డిస్‌ప్లేలో వాచ్‌ను ఈ ఫీచర్ పోలి ఉంటుంది. ముఖ్యంగా ఛార్జింగ్ పెట్టే సందర్భంలో వాచ్‌లా వాడుకోవచ్చు.
ఐఫోన్ 17 వచ్చే ఫోన్లు ఇవే..
యాపిల్ నిర్వహించిన ఈవెంట్‌లో ఐఓఎస్ 17ను ప్రకటించినప్పటికీ.. ఎప్పుడు విడుదల చేస్తారనేది మాత్రం యాపిల్ వెల్లడించలేదు. బహుశా సెప్టెంబర్‌లో విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. గతేడాది సైతం సెప్టెంబర్‌లోనే ఐఓఎస్ 16ను విడుదల చేసింది. కొత్తగా రానున్న ఐఫోన్ 15 మాత్రం ఐఎఎస్ 17తో వచ్చే అవకాశం ఉంది. ఇక ఐఓఎస్ 17 వచ్చే జాబితాలో iPhone XS, iPhone XS Max, iPhone XR, iPhone 11, iPhone 11 Pro సిరీస్, iPhone 12 సిరీస్, iPhone 12 Pro సిరీస్, iPhone 13 సిరీస్, iPhone 13 Pro సిరీస్, iPhone 14 సిరీస్, iPhone 14 Pro సిరీస్ వంటి ఫోన్లు ఉండనున్నాయి. హార్డ్‌వేర్‌ను దృష్టిలో పెట్టుకుని పాత ఫోన్లకు లేటేస్ట్ ఐఓఎస్ అప్‌డేట్ నిలిపివేయనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Raveena Tandon: అతడి పెదవులు తాకగానే వాంతి అయింది: రవీనా టాండన్
-
Vijay Deverakonda-Rashmika: విజయ్ దేవరకొండ.. నువ్వు ఎప్పటికీ ది బెస్ట్: రష్మిక
-
Yuvagalam: నారా లోకేశ్ యువగళం పాదయాత్ర వాయిదా
-
MS Swaminathan: దేశ ‘వ్యవసాయం తలరాత’నే మార్చి.. 84 డాక్టరేట్లు పొంది!
-
AIADMK: మళ్లీ ఎన్డీయేలో చేరం.. అన్నామలైని తొలగించాలని మేం కోరం: అన్నాడీఎంకే
-
USA: అమెరికా పిల్లలకి ‘లెక్కలు’ రావడం లేదట..!