iPhone 14: యాపిల్‌ ఐఫోన్‌ 14పై భారీ డిస్కౌంట్‌.. లిమిటెడ్‌ పీరియడ్‌ మాత్రమే!

Discount on iPhone 14 models: వాలంటైన్‌ వీక్‌ సందర్భంగా యాపిల్‌కు చెందిన థర్డ్‌ పార్టీ సెల్లర్‌ ఐఫోన్‌ 14 మోడళ్లపై భారీ డిస్కౌంట్‌ ప్రకటించింది. పరిమితకాలం మాత్రమే ఈ ఆఫర్‌ ఉంటుందని పేర్కొంది.

Published : 13 Feb 2023 13:58 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల సంస్థ యాపిల్‌ (Apple) గతేడాది విడుదల చేసిన ఐఫోన్‌ 14 సిరీస్‌ (iPhone 14) ఫోన్లపై భారీ డిస్కౌంట్‌ లభిస్తోంది. వాలంటైన్స్‌ వీక్‌ సందర్భంగా ఐఫోన్‌ 14, ఐఫోన్‌ 14 ప్లస్‌, ఐఫోన్‌ 14 ప్రో, ఐఫోన్‌ 14 ప్రో మ్యాక్స్‌ మోడళ్లపై యాపిల్‌ థర్డ్‌ పార్టీ అధీకృత రిటైల్‌ సెల్లర్‌ ఐవీనస్‌ పరిమితకాలపు ఆఫర్‌ను ప్రకటించింది. ఐఫోన్‌ 14 మోడల్‌పై బ్యాంక్‌ ఆఫర్‌, ఎక్స్ఛేంజ్‌ ఆఫర్‌, ఎక్స్ఛేంజ్‌ బోనస్‌ మొదలైనవన్నీ కలుపుకొంటే గరిష్ఠంగా రూ.42,000 డిస్కౌంట్‌ లభిస్తుందని ఆ సంస్థ పేర్కొంది.

ఐఫోన్‌ 14 ధరను రూ.79,990గా యాపిల్‌ పేర్కొన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ ఫోన్‌ అన్ని ఆఫర్లూ పోనూ రూ.37,900కే లభిస్తుందని ఐవీనస్‌ వెబ్‌సైట్‌ పేర్కొంది. ఇందులో ఐవీనస్‌ స్టోర్‌ రూ.8 వేలు డిస్కౌంట్‌ అందిస్తుండగా.. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ కార్డ్స్‌పై రూ.4వేలు క్యాష్‌బ్యాక్‌ లభిస్తుంది. పాత ఫోన్‌తో పాటు పాత ఫోన్‌ మార్చుకోవడం ద్వారా ఇచ్చే ఎక్స్ఛేంజ్‌ బోనస్‌ కలిపితే రూ.30 వేల వరకు పొందొచ్చని సదరు వెబ్‌సైట్‌ పేర్కొంది. ఇలా అన్ని ఆఫర్లూ కలుపుకొంటే రూ.42వేలు అవుతుందని ఐవీనస్‌ పేర్కొంది.

ఇక రూ.89,990 ధర కలిగిన ఐఫోన్‌ 14 ప్లస్‌ సైతం అన్ని ఆఫర్లతో కలిపి రూ.46,990కే లభిస్తుందని ఐవీనస్‌ తెలిపింది. ఈ ఫోన్‌పై ఐవీఎన్‌ రూ.9వేలు డిస్కౌంట్‌ అందిస్తుండగా.. ఐఫోన్‌ 14 తరహాలోనే మిగిలిన ఆఫర్లు వర్తిస్తాయి. ఐఫోన్‌ 13 సైతం అన్ని ఆఫర్లన్నీ కలిపి రూ.30,900కే అందిస్తామని ఐవీస్‌ పేర్కొంది. ఫ్లిప్‌కార్ట్‌ సైతం ఐఫోన్‌ 14 ప్లస్‌పై బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ తదితర బ్యాంకు కార్డులపై 10 శాతం డిస్కౌంట్‌ అందిస్తోంది. పాత ఫోన్‌ మార్పిడిపైనా ఆఫర్లు ఇస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని