iPhone: ఐఫోన్‌ డెలివరీ ఆలస్యం.. కోపంతో షాపు ఉద్యోగులనే చితకబాదారు

iPhone: ఐఫోన్‌ డెలివరీ ఆలస్యం అని చెప్పటంతో షాపు ఉద్యోగులనే చితకబాదారు ఇద్దరు వ్యక్తులు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారుతోంది.

Updated : 23 Sep 2023 19:53 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: టెక్‌ ప్రియులు ఎంతగానో ఎదురుచూసిన ఐఫోన్‌ 15 సిరీస్‌ ఫోన్ల అమ్మకాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. దీన్ని సొంతం చేసుకోవటం కోసం ఐఫోన్‌ ప్రియులు పోటీ పడుతున్నారు. గంటల తరబడి క్యూలో నిల్చుకుంటారు. అలానే ఐఫోన్‌ 15 కోసం ఎంతగానో ఎదురుచూశారు ఇద్దరు వ్యక్తులు. దాని రాక ఆలస్యమని షాపు ఉద్యోగులు చెప్పటంతో కోపం పట్టలేక వారినే చితకబాదారు.

దిల్లీలోని నాగర్‌ మార్కెట్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇద్దరు వ్యక్తులు ఐఫోన్‌ 15 డెలివరీ కోసం కొన్ని రోజుల నుంచి వేచి చూస్తున్నారు. తీరా ఆ ఫోన్‌ చేతికి అందాల్సి ఉండగా.. దాని డెలివరీ ఆలస్యం అవుతుందని షాపు ఉద్యోగులు తెలిపారు. దీంతో కోపంతో రగిలిపోయిన ఆ ఇద్దరు వ్యక్తులు ఉద్యోగులను లక్ష్యంగా చేసుకొని వారిపై దాడి చేశారు. వారిని ఆపటానికి దుకాణంలోని ఇతర సహోద్యోగులు చాలా శ్రమించాల్సి వచ్చింది.

గ్రేట్‌ ఇండియన్‌ సేల్‌కు అమెజాన్ రెడీ.. వీటిపైనే డీల్స్‌!

ఈ ఘటనకు సంబంధించి వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు మండిపడుతున్నారు. ‘ఐఫోన్‌ను మొదటి రోజే ఎలాగైనా కొనాలని ఎందుకంత పిచ్చిగా ఎదురుచూస్తారు? ఇదేమైనా పోటీనా? గెలిస్తే మెడల్స్‌ ఏమైనా ఇస్తున్నారా?’ అంటూ ఓ నెటిజన్‌ కామెంట్ చేశారు. అయితే ఈ ఘటనపై సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. వారి ఫిర్యాదు మేరకు సిబ్బందిపై దాడికి పాల్పడ్డ ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని