తత్కాల్‌ బుకింగ్‌ టైమ్‌లో IRCTC చుక్కలు.. నెటిజన్ల ఆగ్రహం!

IRCTC Down: తత్కాల్‌ టికెట్ బుకింగ్‌ సమయంలో ఐఆర్‌సీటీసీ యూజర్లకు చుక్కలు చూపించింది. దీనిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తంచేస్తూ పోస్టులు పెట్టారు.

Published : 04 Mar 2023 13:43 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారతీయ రైల్వేకు చెందిన టికెట్‌ బుకింగ్‌ ప్లాట్‌ఫామ్‌ ఐఆర్‌సీటీసీ (IRCTC)లో శనివారం ఉదయం అంతరాయం తలెత్తింది. తత్కాల్‌ టికెట్ల బుకింగ్‌ సమయంలో వెబ్‌సైట్‌, యాప్‌ మొరాయించింది. దీంతో పలువురు యూజర్లు సామాజిక మాధ్యమాల్లో ఫిర్యాదు చేశారు. తమకు కలిగిన అసౌకర్యానికి గానూ మండిపడుతున్నారు. ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌, యాప్‌లో ఉదయం 10 గంటల నుంచి అంతరాయం తలెత్తినట్లు డౌన్‌డిటెక్టర్‌ వెబ్‌సైట్‌ సైతం తెలిపింది.

ఉదయం 10 గంటలకు ఏసీ తరగతులకు (1AC, 2AC, 3 AC, 3E), 11 గంటలకు నాన్‌ ఏసీ తరగతులకు తత్కాల్‌ టికెట్‌ బుకింగ్‌కు ఐఆర్‌సీటీసీ అవకాశం కల్పిస్తోంది. అయితే, ఆయా సమయాల్లో టికెట్‌ బుక్‌ చేద్దామని ప్రయత్నించిన చాలా మంది.. లాగిన్‌ విషయంలో ఇబ్బంది ఎదుర్కొన్నట్లు తెలిపారు. బుకింగ్‌ సమయంలో అమౌంట్‌ మొత్తం డిడక్ట్‌ అయినా టికెట్‌ మాత్రం బుక్‌ అవ్వలేదని కొందరు యూజర్లు పేర్కొన్నారు. మరికొందరు తమకు చూపించిన ఎర్రర్‌ మెసేజ్‌ను ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. దీనిపై ఐఆర్‌సీటీసీ అధికారికంగా స్పందించలేదు. ప్రస్తుతానికి మాత్రం వెబ్‌సైట్‌ యథాతథంగా పనిచేస్తోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు