IRCTC: రైలు ప్రయాణికుల కోసం HDFC బ్యాంక్‌ కొత్త క్రెడిట్‌ కార్డ్‌.. ఫీచర్లు ఇవే..

IRCTC HDFC Bank Credit Card: రైల్వే టికెట్‌ బుకింగ్‌పై రివార్డు పాయింట్లు, ఇతర ప్రయోజనాలు అందించేందుకు ఐఆర్‌సీటీసీతో కలిసి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఓ కొత్త క్రెడిట్‌ కార్డును జారీ చేసింది.

Updated : 01 Mar 2023 19:29 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తరచూ రైల్వే ప్రయాణాలు చేసే వారికి మరో కొత్త క్రెడిట్‌ కార్డు (Credit card) అందుబాటులోకి వచ్చింది. ఇండియన్‌ రైల్వే కేటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (IRCTC), ప్రైవేటు రంగానికి చెందిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ (HDFC Bank) కలిసి కొత్త కో బ్రాండ్‌ క్రెడిట్‌ కార్డును తీసుకొచ్చాయి. రూపే నెట్‌వర్క్‌పై ఈ క్రెడిట్‌ కార్డు పనిచేయనుంది. ఈ క్రెడిట్‌ కార్డుతో రైల్వే టికెట్‌ బుకింగ్‌లపై ఆదా చేసుకోవడంతో పాటు, ఇతర ప్రయోజనాలు లభిస్తాయని ఇరు సంస్థలు సంయుక్త ప్రకటనలో పేర్కొన్నాయి. ఈ క్రెడిట్‌ కార్డును హెచ్‌డీఎఫ్‌సీ, ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ల ద్వారా అప్లయ్‌ చేసుకోవచ్చు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ బ్రాంచ్‌లకు వెళ్లి కూడా ఈ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

ఫీచర్లు ఇవే..

  • ఈ కార్డుతో వెల్‌కమ్‌ బెన్‌ఫిట్‌ కింద రూ.500 విలువ చేసే అమెజాన్‌ వోచర్‌ లభిస్తుంది.
  • ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌, ఐఆర్‌సీటీసీ యాప్‌లో టికెట్‌ బుకింగ్‌కు ప్రతి 100 రూపాయల కొనుగోలుపై 5 రివార్డు పాయింట్లు లభిస్తాయి.
  • హెచ్‌డీఎఫ్‌సీ స్మార్ట్‌బైలో కొనుగోళ్లపై 5 శాతం క్యాష్‌బ్యాక్‌ లభిస్తుంది.
  • ప్రతి 100 రూపాయల కొనుగోళ్లపై ఒక రివార్డు పాయింట్‌ లభిస్తుంది. ఈఎంఐ, ఫ్యూయల్‌, వాలెట్‌ రీ లోడ్‌ లావాదేవీలు, అద్దె చెల్లింపులు, ప్రభుత్వానికి సంబంధించిన లావాదేవీలపై రివార్డు పాయింట్లు రావు.
  • ఏడాదిలో 8 ఐఆర్‌సీటీసీ రైల్వే లాంజ్‌ యాక్సెస్‌ ఉంటుంది.
  • ఏసీ టికెట్‌ బుకింగ్‌పై అదనంగా రివార్డు పాయింట్లు లభిస్తాయి.
  • కార్డు జారీ చేసిన 30 రోజుల్లో యాక్టివేట్‌ చేసుకుంటే రూ.500 వెల్‌కమ్‌ గిఫ్ట్‌ లభిస్తుంది. అలాగే కార్డు జారీ చేసిన 90 రోజుల్లో రూ.30వేలు కొనుగోలు చేస్తే మరో రూ.500 గిఫ్ట్‌ వోచర్‌ రూపంలో లభిస్తుంది.
  • ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌, యాప్‌లో లావాదేవీ ఛార్జీలపై 1 శాతం రాయితీ లభిస్తుంది.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని