IRCTC: రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. టికెట్ల బుకింగ్‌ పరిమితి పెంపు

ఫ్యామిలీ మొత్తం కలిసి ఎక్కడైనా రైల్లో ప్రయాణం చేద్దామంటే ఆన్‌లైన్‌లో టికెట్ల బుకింగ్ కోసం రెండు లేదా మూడు యూజర్‌ ఐడీలు ఉపయోగించాల్సి వస్తోంది....

Updated : 06 Jun 2022 17:04 IST

దిల్లీ: ఫ్యామిలీ మొత్తం కలిసి ఎక్కడైనా రైల్లో ప్రయాణం చేద్దామంటే ఆన్‌లైన్‌లో టికెట్ల బుకింగ్ కోసం ఇప్పుడు రెండు లేదా మూడు యూజర్‌ ఐడీలు ఉపయోగించాల్సి వస్తోంది. ఒకవేళ ఆధార్ అనుసంధానం చేసినా 12 టికెట్ల వరకు మాత్రమే బుక్‌ చేసుకోగలం. ఇది నిజంగా చాలా మందికి నిరాశ కలిగించే విషయం. అలా నిరుత్సాహపడుతున్న వారి కోసం ‘ఇండియన్‌ రైల్వే కేటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ (IRCTC)’ సోమవారం ఓ శుభవార్త చెప్పింది. ఒక నెలలో ఆన్‌లైన్‌ లేదా యాప్‌ ద్వారా బుక్‌ చేసుకునే టికెట్ల సంఖ్య పరిమితిని పెంచుతున్నట్లు  ప్రకటించింది.

ఆధార్‌ అనుసంధానం చేయని ఒక యూజర్‌ ఐడీ ద్వారా ఒక నెలలో 12 టికెట్ల వరకు బుక్‌ చేసుకోవచ్చని ఐఆర్‌సీటీసీ తెలిపింది. ప్రస్తుతం ఇది ఆరు టికెట్లకే పరిమితమైంది. మరోవైపు ఆధార్‌ అనుసంధానం చేసిన యూజర్‌ ఐడీ ద్వారా ప్రస్తుతం 12 టికెట్ల వరకు బుక్‌ చేసుకునేందుకు అనుమతి ఉంటే ఆ పరిమితిని ఇప్పుడు 24 వరకు పెంచింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని