PNR status: వాట్సాప్‌లోనే PNR, లైవ్‌ ట్రైన్‌ స్టేటస్‌ తెలుసుకోండిలా..

PNR and live train status on WhatsApp: వాట్సాప్‌ ద్వారానే సులువుగా PNR స్టేటస్‌ తెలుసుకునే సదుపాయాన్ని రైలోఫై అనే స్టార్టప్‌ అందిస్తోంది.

Published : 28 Sep 2022 15:40 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దూర ప్రయాణాల కోసం ట్రైన్‌ టికెట్‌ బుక్‌ చేస్తాం. అది వెయింటింగ్‌ లిస్ట్‌లో ఉంటుంది. దాని స్టేటస్‌ తెలుసుకోవాలంటే ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌నో.. థర్డ్‌ పార్టీకి చెందిన యాప్‌/ వెబ్‌సైట్‌నో ఆశ్రయించాల్సిందే. స్టేటస్‌ తెలుసుకోవాల్సిన ప్రతిసారీ అందులో PNR నంబర్‌ను ఎంటర్‌ చేయాల్సి ఉంటుంది. ఇకపై ఆ ఇబ్బంది లేకుండా వాట్సాప్‌ ద్వారానే సులువుగా PNR స్టేటస్‌ తెలుసుకోవచ్చు. ముంబయికి చెందిన స్టార్టప్‌ రైలోఫై (Railofy) ఐఆర్‌సీటీసీతో కలిసి ఈ సేవలను అందిస్తోంది. 

వాట్సాప్‌ చాట్‌బాట్‌ ద్వారా ఈ సేవలు లభిస్తాయి. ఇందుకోసం ఆ సంస్థ ఫోన్‌ నంబర్‌ను (+91 98811 93322) మీ కాంటాక్ట్స్‌లో సేవ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత వాట్సాప్‌లో చాట్‌ విండోలోకి వెళ్లి పీఎన్‌ఆర్‌ నంబర్‌ను ఎంటర్‌ చేసి దాని స్టేటస్‌ తెలుసుకోవచ్చు. అలాగే మునుపటి స్టేషన్‌, రాబోయే స్టేషన్‌ వివరాలు సైతం పొందొచ్చు. ట్రైన్లోకి ఫుడ్‌ కూడా ఆర్డర్‌ చేసుకోవచ్చని రైలోఫై తన వెబ్‌సైట్‌లో పేర్కొంది. 139కి కాల్‌చేయడం ద్వారా కూడా ఈ సేవలను పొందొచ్చు. ఫుడ్‌ డెలివరీకి సంబంధించి జూప్‌ అనే మరో సంస్థ కూడా ఈ తరహా సేవలనే అందిస్తోంది. ఇందుకోసం +91 7042062070 నంబర్‌కు వాట్సాప్‌లో మెసేజ్‌ చేస్తే మీకు నచ్చిన ఆహారాన్ని మీ బెర్త్‌ దగ్గరకే అందిస్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని