Q3 results: IRCTC లాభం 22% అప్‌.. హిందాల్కో లాభం 63% డౌన్‌

IRCTC and hindalco Q3 Results: త్రైమాసిక ఫలితాల్లో ఐఆర్‌సీటీసీ లాభం 22 శాతం మేర పెరిగింది. మరో ప్రముఖ కంపెనీ హిందాల్కో లాభం భారీగా క్షీణించింది.

Published : 09 Feb 2023 15:38 IST

దిల్లీ: భారతీయ రైల్వేకు చెందిన ఇండియన్‌ రైల్వే కేటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ (IRCTC) త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. అక్టోబర్‌-డిసెంబర్‌ త్రైమాసికంలో (Q3 Results) రూ.255 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.208 కోట్ల నికర లాభాన్ని ఆర్జించిన ఆ సంస్థ.. 22 శాతం వృద్ధిని నమోదు చేసింది.

ఐఆర్‌సీటీసీ మొత్తం ఆదాయం సైతం రూ.540.2 కోట్ల నుంచి రూ.918.1 కోట్లకు పెరిగింది. ఏకంగా 70 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఈ సందర్భంగా ఒక్కో షేరుపై రూ.3.50 చొప్పున డివిడెండ్‌ ఇవ్వాలని బోర్డు నిర్ణయించింది.

హిందాల్కో లాభం భారీ క్షీణత

ఆదిత్యా బిర్లా గ్రూప్‌నకు చెందిన హిందాల్కో ఇండస్ట్రీస్‌ నికర లాభం భారీగా క్షీణించింది. గతేడాది ఇదే సమయంలో రూ.3675 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ఆర్జించిన ఆ సంస్థ.. ఈ ఏడాది కేవలం రూ.1362 కోట్లు మాత్రమే లాభాన్ని నమోదు చేసింది. నికర లాభం ఏకంగా 63 శాతం క్షీణించింది. కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం మాత్రం రూ.50,272 కోట్ల నుంచి 6 శాతం మేర పెరిగి రూ.53,151 కోట్లకు చేరింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని