Updated : 19 Jul 2022 17:32 IST

IRCTC service charge: ప్రీమియం రైళ్లలో టీ, కాఫీపై సర్వీసు ఛార్జీ రద్దు

ఇంటర్నెట్‌ డెస్క్‌: కప్పు టీకి రూ.70 వసూలు చేసి విమర్శలపాలైన ఐఆర్‌సీటీసీ తాజాగా దిద్దుబాటు చర్యలు చేపట్టింది. రాజధాని, శతాబ్ది, దురంతో, వందే భారత్‌ వంటి ప్రీమియం రైళ్లలో టీ, కాఫీలపై సర్వీసు ఛార్జీని రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో టికెట్‌తో పాటు బుక్‌ చేసుకోకపోయినా.. ఇకపై టీ, కాఫీకి ఎటువంటి సర్వీసు ఛార్జీ, కన్వీనియెన్స్‌ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే, చిరుతిళ్లు, భోజనంపై మాత్రం రూ.50 సర్వీసు ఛార్జీని యథావిధిగా కొనసాగించారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఐఆర్‌సీటీసీకి ఆదేశాలు జారీ చేసింది.

రెండువారాల క్రితం ఓ రైలు ప్రయాణికుడు తాను కప్పు టీ కోసం ఏకంగా రూ.70 వెచ్చించినట్లు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. ఇందులో కప్‌ టీ ధర రూ.20 మాత్రమే. దీనికి సర్వీస్‌ ఛార్జీ రూ.50 చెల్లించాల్సి వచ్చింది. అతడు చేసిన ట్వీట్‌ వైరల్‌గా మారడంతో నెటిజన్లు ఐఆర్‌సీటీసీ తీరుపై అసహనం వ్యక్తం చేశారు. దీనిపై వివరణ ఇచ్చిన అధికారులు ఎలాంటి అదనపు సొమ్ము వసూలు చేయలేదన్నారు. దీనికి 2018లో జారీ చేసిన ఉత్తర్వులను ఆధారంగా చూపారు. 

రాజధాని లేదా శతాబ్ది వంటి రైళ్లలో ముందుగా ఆహారం బుక్‌ చేయకుండా.. ప్రయాణ సమయంలో బుక్‌ చేస్తే రూ.50 సర్వీస్‌ ఛార్జీ చెల్లించాల్సి ఉంటుందన్నది ఆ ఉత్తర్వుల సారాంశం. అది టీ అయినా, కాఫీ అయినా.. అని అందులో పేర్కొన్నారు. అయితే, తొలుత ఈ రైళ్లలో ఫుడ్‌ డెలివరీకి సంబంధించి సర్వీసు ఛార్జీ అనేది టికెట్‌ ఛార్జీతో పాటే ఉండేది. తర్వాత దీన్ని ప్రయాణికుల ఐచ్ఛికానికి వదిలేశారు. కానీ, రూ.50 సర్వీసు ఛార్జీపై తీవ్ర విమర్శలు రావడంతో తాజాగా ఐఆర్‌సీటీసీ ప్రభుత్వ ఆదేశాల మేరకు దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది.

వైరల్‌ అయిన ట్వీట్‌ ఇదే..


Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని