SC To SHIRDI- NASHIK: 3 రోజుల్లో శిర్డీ, నాసిక్‌ టూర్‌.. ప్యాకేజీ వివరాలివిగో..!

IRCTC SHIRDI- NASHIK- TRIAMBAKESHWAR tour package: సికింద్రాబాద్‌ నుంచి శిర్డీ, నాసిక్‌ వంటి ఆధ్యాత్మిక ప్రాంతాలను దర్శించుకునేందుకు ఐఆర్‌సీటీసీ కొత్త ప్యాకేజీ తీసుకొచ్చింది. మూడు రోజుల పాటు సాగే ప్యాకేజీ వివరాలు ఇవీ..

Published : 25 May 2023 10:16 IST

IRCTC Tour package | ఇంటర్నెట్‌ డెస్క్‌: వారాంతాల్లో కుటుంబ సభ్యులతో కలిసి ఏదైనా ఆధ్యాత్మిక ప్రదేశానికి వెళ్లాలనుకుంటున్నారా? అయితే, కేవలం మూడు రోజుల్లో శిర్డీ (SHIRDI), నాసిక్‌లను (NASHIK) సందర్శించేందుకు అవకాశం కల్పిస్తోంది ఐఆర్‌సీటీసీ (IRCTC tour package). సాయి శివమ్‌ పేరిట ఈ ప్యాకేజీని అందిస్తోంది. మూడు రాత్రులు, 4 పగళ్లు సాగే ఈ యాత్ర వివరాలు ఇవిగో..

సికింద్రాబాద్‌ నుంచి ప్రారంభమై శిర్డీ, నాసిక్‌, త్రయంబకేశ్వరం సందర్శన అనంతరం మళ్లీ సికింద్రాబాద్‌ చేరుకోవడంతో ఈ యాత్ర పూర్తవుతుంది. తక్కువ సమయంలో ఏదైనా ఆధ్యాత్మిక యాత్ర పూర్తి చేయాలనుకునే వారికి ఈ యాత్ర అనుకూలంగా ఉంటుంది. తదుపరి ట్రిప్‌ జూన్‌ 2న ప్రారంభం కానుంది. జూన్‌ నెలాఖరు వరకు ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంది. ప్రతి శుక్రవారం సికింద్రాబాద్‌లో రైలు ప్రారంభమవుతుంది. నిజామాబాద్‌, కామారెడ్డి స్టేషన్లలోనూ ఈ రైలు ఆగుతుంది. కంఫర్ట్‌, స్టాండర్డ్‌ పేరిట రెండు రకాల ప్యాకేజీలు ఉంటాయి. కంఫర్ట్‌ ఎంచుకున్న వారికి థర్డ్‌ ఏసీలో ప్రయాణం ఉంటుంది. స్టాండర్డ్‌ ఎంచుకున్న వారికి స్లీపర్‌ క్లాస్‌లో బెర్త్‌ కేటాయిస్తారు.

ప్రయాణం సాగేదిలా..

  • సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ నుంచి శుక్రవారం సాయంత్రం 6.50 గంటలకు 17064 రైలు (అజంతా ఎక్స్‌ప్రెస్‌) ప్రారంభం అవుతుంది.
  • రెండో రోజు (శనివారం) ఉదయం 7.10 గంటలకు నాగర్‌సోల్‌ రైల్వేస్టేషన్‌కు చేరుకుంటుంది. అక్కడి నుంచి శిర్డీలోని హోటల్‌కు చేరుకోవాల్సి ఉంటుంది. హోటల్‌ నుంచి నడక మార్గంలో ఆలయానికి చేరుకోవాల్సి ఉంటుంది. టికెట్‌ ధర యాత్రికులే భరించాలి. కావాలంంటే శనిసింగనాపూర్‌కు ప్రయాణికులు వెళ్లి రావొచ్చు. రాత్రంతా శిర్డీలోనే బస ఉంటుంది.
  • మూడో రోజు శిర్డీ నుంచి 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న నాసిక్‌కు ప్రయాణం ఉంటుంది. త్రయంబకేశ్వరంలోని జ్యోతిర్లింగ ఆలయ దర్శనం తర్వాత నాసిక్‌లోని పంచవటి దర్శనం ఉంటుంది. స్థానికంగా ఉన్న దర్శనీయ స్థలాలను ఆటో రిక్షాల్లో చేరుకోవాల్సి ఉంటుంది. సాయంత్రానికి మళ్లీ నాగర్‌సోల్‌ స్టేషన్‌కు ప్రయాణం ఉంటుంది. రాత్రి 9.20 గంటలకు 17063 రైలును అందుకుంటారు. రాత్రంతా ప్రయాణం ఉంటుంది.
  • సోమవారం ఉదయం 8.50 గంటలకు రైలు సికింద్రాబాద్‌ చేరుకోవడంతో యాత్ర పూర్తవుతుంది.

ప్యాకేజీ ధరలు

  • సింగిల్‌ షేరింగ్‌ (కంఫర్ట్‌) - ₹13,420
  • సింగిల్‌ షేరింగ్‌ (స్డాండర్డ్‌) - ₹11,730
  • ట్విన్‌షేరింగ్‌ (కంఫర్ట్‌) -  ₹8,230
  • ట్విన్‌ షేరింగ్‌ (స్డాండర్డ్‌) - ₹6,550
  • ట్రిపుల్‌ షేరింగ్‌ (కంఫర్ట్‌) - ₹6,590
  • ట్రిపుల్‌ షేరింగ్‌ (స్టాండర్డ్‌) - ₹4,910
  • చైల్డ్‌ విత్‌ బెడ్‌ (5-11 ఏళ్లు) (కంఫర్ట్‌) - ₹5,440
  • చైల్డ్‌ విత్‌ బెడ్‌ (5-11 ఏళ్లు) (స్టాండర్డ్‌) - ₹3,760
  • చైల్డ్‌ వితౌట్‌ బెడ్‌ (5-11 ఏళ్లు) (కంఫర్ట్‌)- ₹5,380
  • చైల్డ్‌ వితౌట్‌ బెడ్‌ (5-11 ఏళ్లు) (స్టాండర్డ్‌)- ₹3690

ప్యాకేజీలో ఏమేం ఉంటాయ్‌

  • ప్రయాణికులు ఎంపిక చేసుకున్న తరగతిని బట్టి స్లీపర్‌, థర్డ్‌ ఏసీ ప్రయాణం ఉంటుంది.
  • ఒక చోటు నుంచి ఒక చోటుకు రవాణా సదుపాయం ఉంటుంది.
  • ఉదయం పూట రెండ్రోజుల పాటు బ్రేక్‌ఫాస్ట్‌ సదుపాయం ప్యాకేజీలో భాగంగా ఉంటుంది.
  • ట్రావెల్‌ ఇన్సురెన్స్‌ సదుపాయం ఉంటుంది.

వీటి బాధ్యత ప్రయాణికులదే..

  • ఆలయాల వద్ద దర్శనం టికెట్లు
  • మధ్యాహ్నం భోజనం, ఇతర ఆహార పదార్థాలు
  • రైల్లో భోజన ఖర్చు యాత్రికులే భరించాలి.
  • దర్శనీయ స్థలాల్లో ప్రవేశ రుసుములు ప్రయాణికులే చెల్లించాలి.
  • గైడ్‌, ప్యాకేజీలో పేర్కొనని ఇతరత్రా ఖర్చులు ప్రయాణికులే చూసుకోవాలి.

మరిన్ని వివరాలకు ఐఆర్‌సీటీసీ టూరిజం వెబ్‌సైట్‌ను సందర్శించండి..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని