IRCTC Alert: ఆ యాప్‌తో జాగ్రత్త.. ఫేక్‌ యాప్‌పై IRCTC అలర్ట్‌

IRCTC alert: ఐర్‌సీటీసీ పేరిట నకిలీ యాప్‌ ఒకటి చలామణీ అవుతోందని భారతీయ రైల్వే హెచ్చరించింది. యాప్‌ను ఎవరూ డౌన్‌లోడ్‌ చేసుకోవద్దని సూచించింది.

Published : 17 Apr 2023 18:33 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారతీయ రైల్వే (Indian Railways) పేరిట చలామణీ అవుతున్న నకిలీ యాప్‌పై ఐర్‌సీటీసీ (IRCTC) అప్రమత్తమైంది. ఐఆర్‌సీటీసీని పోలిన ఓ నకిలీ యాప్‌ వాట్సాప్‌, టెలిగ్రామ్‌ వంటి మెసెంజర్‌ యాప్స్‌లో సర్క్యులేట్‌ అవుతోందని, దాన్ని ఎవరూ డౌన్‌లోడ్‌ చేసుకోవద్దని సూచించింది. ఏపీకే ఫైల్‌ రూపంలో ఉన్న ఆ యాప్‌ను ఒకవేళ ఎవరైనా మొబైల్లో ఇన్‌స్టాల్‌ చేసుకుంటే చిక్కులు తప్పవని హెచ్చరించింది.

‘‘irctcconnect.apk పేరిట ఆండ్రాయిడ్‌ అప్లికేషన్‌ ఒకటి వాట్సాప్‌, టెలిగ్రామ్‌ వేదికగా చలామణీ అవుతున్నట్లు మా దృష్టికి వచ్చింది. కొందరు మోసగాళ్లు ఈ యాప్‌తో కూడిన మోసపూరిత లింక్‌ను భారీ స్థాయిలో సర్క్యులేట్‌ చేస్తూ.. డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచిస్తున్నారు. ఒకవేళ ఈ యాప్‌ను ఎవరైనా డౌన్‌లోడ్‌ చేసుకుంటే నెట్‌ బ్యాంకింగ్‌, యూపీఐ, క్రెడిట్‌/ డెబిట్‌ కార్డు సమాచారాన్ని చోరీ చేసే ప్రమాదముంది. కాబట్టి ఎవరూ ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవద్దని ఐఆర్‌సీటీసీ సూచించింది. టికెట్‌ బుకింగ్‌ కోసం ఐఆర్‌సీటీసీ రైల్‌ కనెక్ట్ యాప్‌ను (IRCTC Rail Connect) గూగుల్‌ ప్లేస్టోర్, యాపిల్‌ స్టోర్‌ నుంచి మాత్రమే డౌన్‌లోడ్‌ చేసుకోవాలని యూజర్లను కోరింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని