CBDT: సీబీడీటీ నూతన ఛైర్మన్‌గా నితిన్‌ గుప్తా

కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు(సీబీడీటీ) నూతన ఛైర్మన్‌గా ఐఆర్‌ఎస్‌ అధికారి నితిన్‌ గుప్తా నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. 1986 బ్యాచ్‌ ఐఆర్‌ఎస్‌ అధికారి అయిన  గుప్తా

Updated : 27 Jun 2022 15:32 IST

దిల్లీ: కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు(సీబీడీటీ) నూతన ఛైర్మన్‌గా ఐఆర్‌ఎస్‌ అధికారి నితిన్‌ గుప్తా నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. 1986 బ్యాచ్‌ ఐఆర్‌ఎస్‌ అధికారి అయిన  గుప్తా.. ప్రస్తుతం సీబీడీటీ బోర్డు సభ్యులు(ఇన్వెస్టిగేషన్‌)గా ఉన్నారు. వచ్చే ఏడాది సెప్టెంబరులో ఆయన పదవీ విరమణ చేయనున్నారు.

సీబీడీటీ ఛైర్మన్‌గా ఉన్న జేబీ మోహపాత్ర ఈ ఏడాది ఏప్రిల్‌ 30న పదవీ విరమణ పొందారు. దీంతో ఐఆర్‌ఎస్‌ అధికారిణి సంగీతా సింగ్‌కు తాత్కాలికంగా ఛైర్‌పర్సన్‌ బాధ్యతలు అప్పగించారు. తాజాగా నితిన్‌ గుప్తాను ఛైర్మన్‌గా నియమించగా.. ఇందుకు జూన్‌ 25న కేంద్ర కేబినెట్‌ నియామక కమిటీ ఆమోదముద్ర వేసింది. ఆదాయపు పన్ను విభాగం పాలనా వ్యవహారాలను సీబీడీటీ చూస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని