Layoffs in Meta: మెటాలో మరింత మంది ఉద్యోగుల తొలగింపు?
Layoffs in Meta: టెక్ కంపెనీల్లో ఉద్యోగుల తొలగింపులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే 11 వేల మందిని తొలగించిన మెటా మరికొంత మందిని ఇంటికి పంపే యోచనలో ఉన్నట్లు సమాచారం.
వాషింగ్టన్: ఫేస్‌బుక్ (Facebook) మాతృసంస్థ మెటా (Meta) గత ఏడాది నవంబరులో 11,000 మంది ఉద్యోగుల్ని (Layoffs) తొలగించింది. తాజాగా మరికొంత మందిని తొలగించే (Layoffs) యోచనలో ఉందని పలు అంతర్జాతీయ పత్రికలు కథనాలు ప్రచురించాయి. ఈ నేపథ్యంలోనే వివిధ విభాగాలకు కేటాయించే బడ్జెట్‌లలో జాప్యం చేస్తోందని సమాచారం. తీసివేతలకు సంబంధించి ఇప్పటి వరకూ మెటా (Meta) ఎలాంటి అధికారిక ప్రకటన జారీ చేయలేదు.
బడ్జెట్లు, కొనసాగబోయే ఉద్యోగుల సంఖ్య విషయంలో కంపెనీలో అస్పష్టత నెలకొందని ఇద్దరు ఉద్యోగులు తెలిపినట్లు ప్రముఖ పత్రిక ఫైనాన్షియల్ టైమ్స్ పేర్కొంది. మరోవైపు 2023లో కంపెనీ సామర్థ్యాన్ని అత్యుత్తమ స్థాయికి తీసుకెళ్లాలనుకుంటున్నట్లు సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ (Mark Zuckerberg) ఇటీవల ప్రకటించారు. ఈ క్రమంలో మిడిల్ మేనేజర్లు, డైరెక్టర్లు సైతం పనిలో భాగస్వాములు కావాల్సిందేనని చెప్పారు. లేదంటే కంపెనీని వీడాల్సి ఉంటుందని తేల్చిచెప్పారు. అలాగే కంపెనీలో మేనేజర్లను పర్యవేక్షించడానికి కూడా మేనేజర్లు ఉన్నారని వ్యాఖ్యానించారు. పరోక్షంగా తొలగింపులకు (Layoffs) సంబంధించిన సంకేతాలిచ్చారు. మరోవైపు ఆశించిన స్థాయిలో ఫలితాలులేని ప్రాజెక్టులను మూసివేయనున్నట్లు మెటా (Meta) ఇటీవల ప్రకటించడం గమనార్హం.
టెక్ కంపెనీల్లో 2023లోనూ ఉద్యోగుల తొలగింపులు (Layoffs) కొనసాగుతున్నాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు 340 కంపెనీలు లక్షకు పైగా ఉద్యోగుల్ని ఇంటికి పంపినట్లు అంచనా. ఇటీవలే టిక్‌టాక్ ఇండియా భారత్‌లోని తమ ఉద్యోగులందరినీ తొలగించింది. యాహూ 1,600 మందిని, డెల్ 6,500 మందికి ఉద్వాసన పలికాయి. గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ సంస్థలు కలిపి దాదాపు 50 వేల మందిని తొలగించాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Chandrababu: ఇది నా బాధ.. ఆవేదన.. ఆక్రందన: న్యాయమూర్తితో చంద్రబాబు
-
Chandrababu: చంద్రబాబు జ్యుడిషియల్ రిమాండ్ పొడిగింపు
-
Canada: భారత్-కెనడా వివాదం.. అమెరికా స్వరం మారుతోందా..?
-
IND vs AUS : ఈ సిరీస్ అశ్విన్‌కు ట్రయల్ కాదు.. అవకాశం మాత్రమే: ద్రవిడ్
-
Canada Singer: ‘భారత్ నా దేశం కూడా..!’: టూర్ రద్దుపై కెనడా సింగర్ శుభ్
-
Bedurulanka 2012: సడెన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన ‘బెదురులంక’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే!