వ‌ర‌ద‌ల్లో కారు కొట్టుకుపోతే ప‌రిహారం ల‌భిస్తుందా?

వ‌ర‌ద నీటి ప్ర‌వాహంలో కారు కొట్టుకొనిపోతే బీమా ప‌రిహారం ల‌భిస్తుందో లేదో తెలుసుకుందాం.

Published : 19 Dec 2020 17:25 IST

గత సంవత్సరం ముంబ‌యిలో భారీ వ‌ర్షాలు కుర‌వ‌డంతో జ‌నజీవ‌నం అస్త‌వ్య‌స్త‌మైంది. 2016 లో హైద‌రాబాద్‌లో భారీ వ‌ర్షాలు కొన్ని కాల‌నీల‌ను నీట‌ముంచాయి. అంతకు ముందు సంవ‌త్స‌రం చెన్నై న‌గ‌రం భీక‌ర‌మైన వ‌ర్షానికి అత‌లాకుత‌ల‌మైంది.

సాధార‌ణంగా కారు పార్కింగ్ సౌక‌ర్యం లేనివారు త‌మ వాహ‌నాన్ని బ‌య‌టే ఉంచుతారు. అయితే వ‌రద నీటి ప్ర‌వాహంలో కారు కొట్టుకొని పోతే బీమా వ‌ర్తిస్తుందో లేదో చాలా మందికి సందేహం. ఒక వేళ వ‌ర్తించిన‌ట్ట‌యితే క్లెయిం చేసే విధానాన్ని తెలుసుకుందాం…

వ‌ర‌ద ప్ర‌వాహంలో…

చాలా మంది ఎంతో ఇష్టంతో ఖ‌రీదైన కార్ల‌ను కొంటుంటారు. ముంబ‌యి, హైద‌రాబాద్‌ లాంటి మ‌హాన‌గ‌రాలలో కారు పార్కింగ్ సౌక‌ర్యం లేక ఇంటి బ‌య‌టే కార్ల‌ను ఉంచుతున్నారు. వాటికి భ‌ద్రంగా తాళం కూడా వేస్తున్నారు. అయితే దుర‌దృష్ట‌వ‌శాత్తు కారు వ‌ర‌ద ప్ర‌వాహంలో కొట్టుకుపోతే వెంట‌నే స్థానిక పోలీస్ స్టేష‌న్‌లో ఎఫ్ఐఆర్ న‌మోదు చేయించ‌డం మంచిది.

ఎఫ్‌.ఐ.ఆర్ న‌మోదు

దొంగ‌త‌నానికి గురైన వాహ‌నానికి, జాడ తెలియ‌కుండా పోయిన వాహ‌నాల‌కు స‌మ‌గ్ర మోటారు బీమా పాల‌సీ వ‌ర్తిస్తుంది. ఇలాంటి సంద‌ర్భాలు ఏర్ప‌డిన్ప‌పుడు త‌ప్ప‌కుండా స్థానిక పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేయ‌డం ముఖ్యం.

రెండు తాళాలు

ఇలా వ‌ర‌ద ప‌రిస్థితులు ఏర్ప‌డిన‌ప్పుడు కారు ప్ర‌వాహానికి కొట్టుకుపోయిన‌ట్ల‌యితే… కారుకు సంబంధించిన రెండు తాళాల‌ను బీమా కంపెనీకి అందివ్వాల్సి ఉంటుంది. దీనికీ ఓ కార‌ణం ఉంది. మీ నిర్ల‌క్ష్యం వ‌ల్ల కారు దొంగ‌తనానికి గురి కాలేదు అని బీమా కంపెనీకి రుజువు చేసేందుకే రెండు తాళాలు ఇవ్వాల్సిన అవ‌స‌రం ఉంది.

బీమా ప్ర‌క‌టిత విలువ‌

కారు వ‌ర‌ద‌ల్లో కొట్టుకొని పోయి… పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు ఇచ్చాక … దాని జాడ‌ను పోలీసులు క‌నుగొన‌లేక‌పోతే అప్పుడు బీమా సంస్థ‌లు త‌గిన ప‌రిహారం అంద‌జేస్తాయి. ఇలాంటి సంద‌ర్భాల్లో బీమా ప్ర‌క‌టిత విలువ‌ను బ‌ట్టి ప‌రిహారం చెల్లిస్తారు. బీమా ప్ర‌క‌టిత విలువ ప్ర‌తి సంవ‌త్స‌రం మారుతుంటుంది. కాలం గ‌డిచే కొద్దీ వాహ‌న విలువ క్షీణిస్తూ ఉంటుంది. దీనినే డిప్రిషియేష‌న్ అంటారు. బీమా ప్ర‌క‌టిత విలువ లెక్కించేట‌ప్పుడు డిప్రిషియేష‌న్‌ను ప‌రిగ‌ణ‌లోనికి తీసుకుంటారు.

పూర్తి సొమ్ము కావాలంటే

వాహ‌న బీమాతో పాటు ‘‘రిట‌ర్న్ టు ఇన్‌వాయిస్’’ అనే యాడ్ ఆన్ క‌వ‌ర్ గ‌నుక కొన్న‌ట్ల‌యితే … బీమా ప్ర‌క‌టిత విలువ‌తో సంబంధం లేకుండా వాహ‌న కొనుగోలు ధ‌ర‌కు స‌మాన‌మైన ప‌రిహారం ల‌భిస్తుంది. ఈ యాడ్ ఆన్ క‌వ‌ర్ కోసం కాస్త ప్రీమియం ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది.

త‌మ వాహ‌నానికి అద‌న‌పు ర‌క్ష కోరుకునేవారు ‘‘రిట‌ర్న్ టు ఇన్‌వాయిస్’’ అనే యాడ్ ఆన్ క‌వ‌ర్ కొంటే మంచిది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు