Q-A: ఎన్ని మ్యూచువల్ ఫండ్లలో మదుపు చేయాలి?

నెలసరి జీతంలో ఈఎంఐలు అన్ని కలిపి 30 శాతానికి మించకూడదు.

Updated : 27 Sep 2022 19:02 IST

Q. హాయ్ సిరి. నేను ఈ కింది ఫండ్లలో ప్రతి నెలా రూ. 3,000 సిప్ చేస్తున్నాను. ఈ పోర్ట్ ఫోలియోలో ఏమైనా మార్పులు చేర్పులు అవసరమైతే సూచించగలరు. 1. ICICI Prudential Focused Bluechip Equity Fund - Growth 2. HDFC Mid-Cap Opportunities Fund - Regular Plan - Growth 3. DSP BlackRock Small/Micro Cap Fund - Regular Plan - Growth 4. Franklin India Smaller Companies Fund 5. Axis Long Term Equity Fund - Growth 6. Axis Multicap Fund 7. Aditya Birla Sun Life Frontline Equity Fund -Growth-Regular Plan 8. Aditya Birla Sun Life Tax Relief'96 Fund- Growth-Regular Plan 9. SBI Blue Chip Fund - Regular Plan - Growth 10. Aditya Birla Sun Life Pure Value Fund - Growth-Regular Plan 11. HDFC- Children gift fund

- రవిశేఖర్ ఉప్పల


మీరు అధిక ఫండ్లలో మదుపు చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల వైవిధ్యత ఉండదు. ప్రత్యేకమైన లాభం కూడా ఉండదు. పైగా, వీటిని ట్రాక్ చేయడం కష్టతరం అవుతుంది. మీ సిప్ మొత్తం రెండు ఫండ్లలో మదుపు చేయడం మేలు. ఒక లార్జ్ కాప్ (ఎస్‌బీఐ బ్లూ చిప్ ఫండ్ లేదా ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఫ్రంట్ లైన్ ఈక్విటీ), ఒక మిడ్/ స్మాల్ కాప్ (ఎస్‌బీఐ స్మాల్ కాప్ ఫండ్) ఎంచుకోవచ్చు. మార్కెట్ డౌన్‌లో ఉన్నప్పుడు కూడా కొంత మొత్తాన్ని మదుపు చేస్తూ ఉండండి.


Q నేను ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాను. నా నెలవారీ జీతం రూ. 21,000. నాకు సుమారుగా రూ. 4.50 లక్షల వరకు అప్పులు ఉన్నాయి. ఇందులో స్నేహితుల వద్ద రుణం, వ్యక్తిగత రుణం, క్రెడిట్ కార్డు ఈఎంఐ లాంటివి ఉన్నాయి. ఇవి వీలైనంత త్వరగా తీర్చడానికి సలహా ఇవ్వండి.

- ఛార్మి

నెల జీతంలో ఈఎంఐలు అన్నీ కలిపి 30 శాతానికి మించకూడదు. అధిక రుణాల వల్ల ఇతర ఆర్థిక లక్ష్యాల కోసం పొదుపు చేయడం కష్టతరం అవుతుంది. మీరు తీసుకున్న రుణాల్లో క్రెడిట్ కార్డు పై వడ్డీ అధికంగా ఉంటుంది. ముందుగా ఇది తీర్చడం ముఖ్యం. ఆ తరవాత చేతి రుణాల్లో అధిక వడ్డీ ఉంటే అలాంటి రుణాలని తీర్చాలి. బంగారం లేదా మీ వద్ద ఏదైనా డిపాజిట్లు ఉన్నట్టయితే వాటి నుంచి ఈ రుణాలని తీర్చడం మంచిది. కుదరకపోతే మరి కాస్త వ్యక్తిగత రుణాన్ని తీసుకుని అధిక వడ్డీ ఉన్న రుణాలని తీర్చండి. మిగతా వాటికి ఈఎంఐ మీ జీతం నుంచి చెల్లించవచ్చు. మీ ఖర్చులు పోగా మిగిలిన మొత్తాన్ని మీ లక్ష్యాల కోసం పొదుపు చేస్తూ ఉండండి. అత్యవసరం అయితే తప్ప క్రెడిట్ కార్డు, వ్యక్తి గత రుణాల నుంచి దూరంగా ఉండడం మంచిది.


Q  నా పేరు శివ, వయసు 35. హౌసింగ్ లోన్ రూ. 15 లక్షలు తీసుకుని ప్రతినెల రూ.15000 బ్యాంకుకు చెల్లిస్తున్నాను. తల్లిదండ్రులు, ఇద్దరు పిల్లలు ఉన్నారు. సీజన్ ఆధారంగా మాదిరి సంపాదన. భవిష్యత్‌లో ఇబ్బందులు రాకుండా ఉండేందుకు ఆర్థిక ప్రణాళికను సూచించగలరు.

- శివ

ముందుగా మీరు ఒక టర్మ్ బీమా 1పాలసీని తీసుకోండి. మీ వార్షిక ఆదాయానికి కనీసం 10-15 రెట్లు బీమా హామీ ఉండేలా చూసుకోవాలి. మీకు 60 ఏళ్లు వచ్చే దాక పాలసీని కొనసాగించండి. టర్మ్ పాలసీలో తక్కువ ప్రీమియంతో అధిక బీమా హామీ పొందొచ్చు. మాక్స్ లైఫ్, ఎస్బీఐ, ఐసీఐసీఐ ఆన్‌లైన్‌ టర్మ్ పాలసీలను పరిశీలించండి. కవర్ ఫాక్స్, పాలసీ బజార్ లాంటి వెబ్‌సైట్లలో ప్రీమియం పరిశీలించవచ్చు. ఆరోగ్య బీమా పాలసీ కూడా తీసుకోవడం చాలా మంచిది. ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీ తీసుకుంటే దానికి అదనంగా సూపర్ టాప్ అప్ పాలసీను తీసుకోవడం ద్వారా మరింత ప్రయోజనం పొందేందుకు వీలుంటుంది. మ్యాక్స్ బూపా, అపోలో మునిచ్, స్టార్ హెల్త్ కంపెనీల పాలసీలు పరిశీలించండి. దీర్ఘకాలం పాటు.. అంటే కనీసం 10 ఏళ్ళ పాటు సిప్ విధానంలో ఒక ఇండెక్స్ ఫండ్‌లో మదుపు చేయండి. యూటీఐ నిఫ్టీ ఇండెక్స్ ఫండ్ ఎంచుకోవచ్చు. నేరుగా ఫండ్ సంస్థలు, ఇతర వెబ్సైట్ల (www.mfuindia.com, www.kuvera.in, myCAMS/ పేటీఎం మొబైల్  యాప్ లాంటివి) ద్వారా డైరెక్టు ప్లాన్‌లో మదుపు చేయొచ్చు. ఇందులో మీకు కమీషన్ చెల్లించనవసరం లేదు కాబట్టి వీటిలో రాబడి రెగ్యులర్ ప్లాన్ల కంటే 1 నుంచి 2 శాతం వరకు ఎక్కువ ఉంటుంది. రిస్క్ లేని పథకాల కోసం పీపీఎఫ్ ఎంచుకోవచ్చు. పదవీ విరమణ లాంటి లక్ష్యాల కోసం ఎన్‌పీఎస్‌ ఎంచుకోవచ్చు.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts