Personal Loan: వ్యక్తిగత రుణం మరో బ్యాంకుకు బదిలీ చేసుకోవచ్చా?
Personal Loan Transfer: వ్యక్తిగత రుణం తీసుకున్న వారు ఒక బ్యాంకు నుంచి మరొక బ్యాంకుకి రుణాన్ని బదిలీ చేసుకునే అవకాశం ఉంది. దీంతో ప్రయోజనమెంత..?
ఇంటర్నెట్ డెస్క్: ఆర్థిక అత్యవసర సమయాల్లో వ్యక్తిగత రుణం (Personal Loan) ఎంతగానో ఉపయోగపడుతుంది. అవసరం ఏమిటన్నది అడగకుండానే ఆర్థిక సంస్థలు వ్యక్తిగత రుణాన్ని ఇస్తుంటాయి. ఈ రోజుల్లో వ్యక్తిగత రుణం పొందడం పెద్ద కష్టమేమీ కాదు. బ్యాంకులే కాకుండా బ్యాంకిగేతర సంస్థలు, రుణ యాప్‌లు కూడా విరివిగా వ్యక్తిగత రుణాలను మంజూరు చేస్తున్నాయి. తక్కువ పత్రాలతో నామమాత్రపు దరఖాస్తు ఛార్జీలతో రుణాలను ఇస్తున్నాయి. ఇందుకు మీరు చూపించాల్సిందల్లా మంచి క్రెడిట్ స్కోరు మాత్రమే. వ్యక్తిగత రుణం తీసుకున్న వారు ఒక బ్యాంకు నుంచి మరొక బ్యాంకుకు రుణాన్ని బదిలీ చేసుకునే అవకాశం ఉంది. మీరు వ్యక్తిగత రుణం తీసుకున్న ఆర్థిక సంస్థ ఎక్కువ వడ్డీ వసూలు చేస్తుందని అనిపిస్తే.. తక్కువ వడ్డీతో రుణం ఆఫర్ చేసే సంస్థకు మారొచ్చు.
బదిలీ చేయడం ప్రయోజనకరమేనా..?
వడ్డీ తగ్గించుకోవచ్చు: ఇంతకు ముందు చెప్పినట్లు మీరు తక్కువ వడ్డీతో వ్యక్తిగత రుణాన్ని ఆఫర్ చేసే సంస్థను కనుగొంటే.. వ్యక్తిగత రుణాన్ని బదిలీ చేసుకోవచ్చు. వడ్డీరేటు తగ్గితే.. అదే ఈఎంఐతో తక్కువ కాలంలోనే రుణం తీర్చొచ్చు. లేదా ఈఎంఐ తగ్గించుకోవచ్చు. కానీ, వ్యక్తిగత రుణాన్ని ముందుగా రద్దు చేసేందుకు కొన్ని సంస్థలు అనుమతించవు. కొన్ని సంస్థలు నిర్దిష్ట కాలం తర్వాత అనుమతిస్తాయి. అప్పుడు కూడా మందస్తు రద్దు (ఫోర్ క్లోజింగ్) ఛార్జీలు వర్తించే అవకాశం ఉంది. అలాగే కొత్త రుణం కోసం బదిలీ ఛార్జీలు, ప్రాసెసింగ్ రుసములు వంటివి కూడా ఉంటాయి. కాబట్టి వీటిన్నంటినీ పరిగణనలోకి తీసుకున్న తర్వాత కూడా లాభదాయకం అనిపిస్తేనే బదిలీ చేసుకోవడం మంచిది.
టాప్-అప్ రుణాన్ని పొందొచ్చు: వ్యక్తిగత రుణాన్ని తక్కువ వడ్డీ రేటు అందిస్తున్న ఆర్థిక సంస్థకు మార్చుకోవడం మాత్రమే కాకుండా మరింత రుణం పొందే అవకాశం కూడా ఉంది. ఉదాహరణకు మీరు ఇది వరకే రూ.5 లక్షల వ్యక్తిగత రుణం తీసుకున్నారు. అందులో రూ.1 లక్ష చెల్లించారు. ఇప్పుడు వైద్య అత్యవసరాల కోసం రూ. 3 లక్షలు అవసరమయ్యాయి. ఇప్పుడు మీరు చెల్లించాల్సిన మొత్తాన్ని వేరే బ్యాంకుకు బదిలీ చేసుకొని.. మీ రుణ అర్హతను అనుసరించి టాప్-అప్‌లోన్ కూడా పొందొంచ్చు. కొత్త లోన్ తీసుకోకుండా ఇదే లోన్‌పై టాప్-అప్ తీసుకోవచ్చు. అయితే, మీ ఆదాయం, ప్రస్తుతం ఉన్న లోన్, చెల్లింపుల బాధ్యత వంటి వాటి ఆధారంగా మీకు అర్హత ఉంటేనే టాప్-అప్‌లోన్ ఇస్తారు. సాధారణంగా మొత్తం ఆదాయంలో ఈఎంఐ చెల్లింపులు (కొత్త రుణంతో సహా) 40 నుంచి 50% మించకుండా ఉంటేనే బ్యాంకులు రుణం ఇచ్చేందుకు ఇష్టపడతాయి.
కాలవ్యవధిని పెంచుకోవచ్చు: వ్యక్తిగత రుణాన్ని బదిలీ చేస్తే.. కొత్త రుణదాత దాన్ని కొత్త లోన్‌గా పరిగణించి ఎక్కువ కాలవ్యవధిని ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కువ ఈఎంఐ చెల్లించలేకపోతే కాలవ్యవధిని పెంచుకుని ఈఎంఐ తగ్గించుకోవచ్చు. కానీ, ఈఎంఐ తగ్గించుకోవడం కోసం కాలవ్యవధిని పెంచుకుంటే, చెల్లించాల్సిన వడ్డీ పెరుగుతుంది.
మెరుగైన సేవల కోసం: ప్రస్తుతం మీ వ్యక్తిగత రుణం ఉన్న బ్యాంకు అందించే సేవలు సరిగ్గా లేకపోతే.. మెరుగైన సేవలను అందించే బ్యాంకుకు బదిలీ చేసుకోవచ్చు. ఉదాహరణకు ఈఎంఐ చెల్లింపు రిమైండర్లు, సకాలంలో అప్‌డేట్‌లు, పోస్ట్ డేటెడ్ చెక్కులకు బదులుగా స్టాండింగ్ ఇన్‌స్ట్రక్షన్ సౌకర్యాలతో అన్‌లైన్ చెల్లింపులు వంటి సేవలను అందిస్తున్నాయి. ఒకవేళ మీ బ్యాంకు వీటిని అందించకపోతే.. రుణ బదిలీ చేసేటప్పుడు ఇలాంటి సేవలను అందించే బ్యాంకును ఎంచుకోండి. అయితే, ఈ సేవల కోసం మీరు బ్యాంకు మీ మొబైల్ నంబర్ వంటివి అప్‌డేట్‌గా ఉంచారో లేదో ముందుగా తెలుసుకోవాలి.
క్రెడిట్ స్కోరు: వ్యక్తిగత రుణాల్లో క్రెడిట్ స్కోరు ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఎక్కువ క్రెడిట్ స్కోరు నిర్వహిస్తే తక్కువ వడ్డీకే రుణం లభించే అవకాశం ఉంది. బ్యాంకులు రుణం ఇచ్చే ముందు మీ క్రెడిట్ స్కోరును పరిశీలిస్తాయి. ఇది హర్డ్ క్రెడిట్ చెక్ కిందకి వచ్చి మీ క్రెడిట్ స్కోరును కొంత తగ్గించే అవకాశం ఉంది. అయితే, వ్యక్తిగత రుణం తీసుకున్న తర్వాత రుణం చెల్లింపులు సకాలంలో చేయడం ద్వారా తిరిగి మీ క్రెడిట్ స్కోరును పెంచుకోవచ్చు. ఒకవేళ ఈఎంఐ చెల్లింపులు సకాలంలో చెల్లించకపోతే మీ క్రెడిట్ స్కోరు మరింత తగ్గిపోతుంది. దీంతో రుణ బదిలీతో పాటు కొత్త రుణాలకు అవకాశాలు తగ్గిపోతాయి.
చివరిగా..
వ్యక్తిగత రుణం సులభంగా లభించినప్పటికీ, సరైన కారణం లేకుండా తీసుకోవడం మంచిది కాదు. ఇది అసురక్షిత రుణం. కాబట్టి వడ్డీ రేటు ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ తప్పని పరిస్థితుల్లో రుణం తీసుకోవాల్సి వచ్చనా ముందుగానే వివిధ సంస్థలు ఇచ్చే రుణాలు, వడ్డీ రేట్లు, ఇతర నియమనిబంధనలను తెలుసుకునే అన్ని విధాలుగా లాభం చేకూర్చే సంస్థను ఎంచుకోవడం మంచిది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
UP: 42 ఏళ్ల క్రితం 10 హత్యలు.. 90 ఏళ్ల వృద్ధుడికి జీవిత ఖైదు!
-
General News
TSPSC: ప్రశ్నపత్రాల లీకేజీ కేసు.. పోలీసు కస్టడీకి విద్యుత్‌శాఖ డీఈ రమేశ్
-
Sports News
Sehwag: ఆ ఓటమి బాధతో రెండు రోజులు హోటల్ రూమ్ నుంచి బయటికి రాలేదు: వీరేంద్ర సెహ్వాగ్
-
Crime News
Andhra News: పింఛను తీసుకునేందుకు వచ్చి.. ఒడిశా రైలు ప్రమాదంలో సిక్కోలు వాసి మృతి
-
India News
Odisha Train Tragedy: ఒడిశా రైలు దుర్ఘటన.. ఏ క్షణంలో ఏం జరిగింది?
-
Politics News
Chandrababu: అమిత్ షా, జేపీ నడ్డాతో చంద్రబాబు భేటీ