Term insurance: జీవిత బీమాకు ట‌ర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ సరైనదేనా?

జీవిత బీమా అవ‌స‌రం గ‌తంతో పోలిస్తే కొవిడ్‌ ప‌రిస్థితుల్లో మ‌రింత పెరిగింది. మ‌నిషి బ‌లాలు, బ‌ల‌హీన‌త‌లు కొవిడ్‌ ప‌రిస్థితులు బ‌హిర్గ‌తం చేశాయి.

Updated : 17 Dec 2021 14:53 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: జీవిత బీమా అవ‌స‌రం గ‌తంతో పోలిస్తే కొవిడ్‌ ప‌రిస్థితుల్లో మ‌రింత పెరిగింది. మ‌నిషి బ‌లాలు, బ‌ల‌హీన‌త‌లు కొవిడ్‌ ప‌రిస్థితులు బ‌హిర్గ‌తం చేశాయి. అంతేకాకుండా బిజీగా ఉండే జీవితాల్లో ఏవైనా అనుకోని సంఘ‌ట‌న‌లు జ‌రిగితే త‌ద‌నంత‌రం ఇంటిని, కుటుంబ‌స‌భ్యుల‌ను ఆర్థికంగా ఆదుకునేది జీవిత బీమాయే. ఇది ఎవ‌రూ కాద‌న‌లేని విష‌యం. త‌గిన మొత్తంలో జీవిత బీమా పొంద‌డం అనేది అత్యంత ముఖ్య‌మైన ఆర్థిక దశల్లో ఒక‌టి అని నిపుణులు అంటున్నారు. ఆర్థిక బాధ్య‌త‌లు ఉండే వారికి జీవిత బీమా అత్య‌వ‌స‌రం. బీమా మొత్తం ఎంపిక కూడా వేర్వేరు వ్యక్తులకు భిన్నంగా ఉంటుంది. అందరికీ ఒకే మొత్తం స‌రికాదు. వాళ్ల‌కున్న బాధ్య‌త‌లు, ఆర్థిక స్థిరత్వం, వ‌య‌స్సు, అల‌వాట్లు, చేసే ప‌ని ఆధారంగా జీవిత బీమా ర‌కాన్ని, మొత్తాన్ని ఎంపిక చేసుకోవాలి. జీవిత బీమా ప్రీమియంలు వ‌య‌స్సు పెరిగే కొద్దీ పెరుగుతాయి. అందువ‌ల్ల వీలైనంత త్వ‌రగా సంపాద‌న మొద‌లైన వ‌య‌స్సులోనే బీమా పాల‌సీని తీసుకోవాల‌ని నిపుణులు సూచిస్తున్నారు.

ఎవ‌రైనా వారి ఒక సంవ‌త్స‌ర ఆదాయానికి 10-15 రెట్లు జీవిత బీమా క‌లిగి ఉండాలి. భ‌విష్య‌త్‌లో ఆదాయం ఇంకా పెరుగుతుందనుకుంటే బీమా మొత్తాన్ని పెంచుకుంటే చాలా మంచిది. బీమా హామీ, పెట్టుబడి కలిపి ఉన్న పథకాల్లో హామీ తక్కువ, రాబడి కూడా తక్కువే. ఇలాంటి వాటి నుంచి దూరంగా ఉండడం మంచిది. ట‌ర్మ్ బీమా పాల‌సీలో ప్రీమియం త‌క్కువ ఉండి, ఎక్కువ బీమా ర‌క్ష‌ణకు అవ‌కాశం ఉంటుంది. కాబ‌ట్టి ట‌ర్మ్ జీవిత బీమాకే అధిక ప్రాధాన్య‌ం ఇవ్వ‌డం మంచిది. బీమా పాల‌సీ ఎంపిక చేసుకునే ముందు బీమా కంపెనీ క్లెయిమ్ సెటిల్‌మెంట్ నిష్ప‌త్తి, అవ‌స‌ర‌మైన యాడ్‌-ఆన్‌లు మొద‌లైన కీల‌క‌మైన విష‌యాల‌ను క్షుణ్ణంగా తెలుసుకోవాలి. జీవిత బీమా ప్రీమియంలతో ఆదాయ‌పు ప‌న్ను చ‌ట్టంలోని సెక్ష‌న్ 80సీ కింద ఏడాదికి రూ.1.50 ల‌క్ష‌ల వ‌ర‌కు ప‌న్ను మిన‌హాయింపు ప్ర‌యోజ‌నాల‌కు అర్హ‌త ఉంటుంది.

30 సంవ‌త్స‌రాల కాల‌వ్య‌వ‌ధికి రూ.1 కోటి హామీ మొత్తానికి, 30 ఏళ్ల (ధూమ‌పానం చేయ‌ని జీతం పొందే పురుషునికి) వ్యక్తికి వివిధ సంస్థ‌ల‌ పాల‌సీల‌ వార్షిక ప్రీమియంలు, క్లెయిమ్ నిష్ప‌త్తి చూపే ప‌ట్టిక దిగువ ఉంది.

గ‌మ‌నికః ట‌ర్మ్ ప్లాన్ ప్రీమియంలు ఎప్ప‌టిక‌ప్పుడు మారుతూ ఉంటాయి. సంబంధిత వైబ్‌సైట్‌ల‌ను సంద‌ర్శించి ప్రీమియంను తెలుసుకోవ‌చ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని