బీమా చేయించుకోవాలా.. ఇదే సరైన సమయం!

వాహనాలకైనా వర్షాకాలం మొద‌ట్లోనే ఆరోగ్య బీమా, మోటారు బీమా చేయించుకోవడం మంచిది.

Published : 21 Jul 2022 14:23 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వ‌ర్షాకాలం అంటేనే రోగాల సీజ‌న్‌. మ‌నుషుల‌కే కాదు.. మోటార్ వాహ‌నాలకూ ఇది వర్తిస్తుంది. ఈ కాలంలోనే వాహనాలు ఎక్కువ ప్ర‌మాదాల‌కు గుర‌వుతుంటాయి. రిపేర్లు కూడా వస్తుంటాయి. కాబట్టి మనుషులకైనా, వాహనాలకైనా వర్షాకాలం మొద‌ట్లోనే ఆరోగ్య బీమా, మోటారు బీమా చేయించుకోవడం మంచిది.

ఆరోగ్య బీమా పాల‌సీ: సొంతంగా, కుటుంబ స‌భ్యుల‌కు త‌గిన క‌వ‌రేజీతో కూడిన ఆరోగ్య బీమా పాల‌సీ పెరుగుతున్న వైద్య బిల్లుల నుంచి మిమ్మ‌ల్ని కాపాడుతుంది. ఏదైనా అనుకోని సంఘ‌ట‌న‌లో ఆసుప‌త్రిలో చేర‌డం, ఆసుప‌త్రికి సంబంధించి ఔట్ పేషంట్ ఖ‌ర్చుల‌ను తీర్చ‌డానికి ఈ ఆరోగ్య బీమా ఉప‌యోగ‌ప‌డుతుంది. ఆసుప‌త్రిలో చేరిన‌ ఖ‌ర్చుల‌ను క‌వ‌ర్ చేయ‌డ‌మే కాకుండా, మీరు ఒక పాల‌సీ సంవ‌త్స‌రంలో బీమా మొత్తం అయిపోయినా కూడా బీమాను పున‌రుద్ధ‌రించే రైడ‌ర్ ఉన్న పాల‌సీని ఎంచుకోండి.

మోటారు బీమా: వర్షాకాలంలో మోటారు ఇన్సూరెన్స్ పాల‌సీని క‌లిగి ఉండ‌టం మంచిది. మీరు థ‌ర్డ్ పార్టీ, సొంత న‌ష్ట బీమా పాల‌సీని క‌లిగి ఉన్న‌ట్ల‌యితే, ఒక‌రి సొంత వాహ‌నం లేదా ఇత‌ర వాహ‌నానికి ఏదైనా న‌ష్టం జ‌రిగితే క‌వ‌రేజ్ ల‌భిస్తుంది. ముఖ్యంగా ఈ కాలంలో మోటారు వాహ‌నాల‌కు ప్ర‌మాదాలు చాలా ఎక్కువ‌. అందుచేత ఈ వ‌ర్షాకాలం ముందే మీరు స‌రైన మోటారు బీమాను ఎంచుకోవ‌డం చాలా ముఖ్యం. చాలా బీమా కంపెనీలు యాడ్‌-ఆన్ క‌వ‌ర్‌ల‌తో మోటారు బీమా పాల‌సీల‌ను అందిస్తున్నాయి. వ‌ర్షాకాలంలో హైడ్రోస్టాటిక్ లాక్ (ఇంజిన్‌లోకి నీరు ప్ర‌వేశించ‌డం) కార‌ణంగా ఇంజిన్‌కు న‌ష్టం వాటిల్ల‌వ‌చ్చు. అటువంటి ప‌రిస్థితిలో ఇంజిన్ రిపేర్ ఖ‌ర్చును తిరిగి పొందేందుకు మీరు ఇంజిన్ ప్రొటెక్ష‌న్ క‌వ‌ర్‌, యాడ్‌-ఆన్ క‌వ‌రేజీని క‌లిగి ఉండాలి. వ‌ర్షాకాలంలో త‌ర‌చుగా బ‌ల‌మైన గాలులు వీయ‌డం వ‌ల్ల చెట్లు ప‌డిపోయి మీ మోటారు వాహ‌నం మీద ప‌డి దెబ్బ‌తినే అవ‌కాశాలు ఉంటాయి. వాహనం పూర్తిగా నష్టపోతే, ఇన్‌వాయిస్ యాడ్‌-ఆన్ రైడ‌ర్ వాహ‌న మార్కెట్ ధ‌ర‌ను బీమా కంపెనీ పాల‌సీదారునికి చెల్లిస్తుంది. ఏదైనా ప్ర‌మాదాల కార‌ణంగా మీ మోటారు వాహ‌నం పాడైపోయి గ్యారేజీలో మ‌ర‌మ్మ‌త్తులు అవ‌స‌ర‌మైతే, బ్యాంకుకు ఈఎంఐ' చెల్లింపులు స‌కాలంలో అందేలా ఈఎంఐ ర‌క్ష‌ణ క‌వ‌ర్ ఉంటుంది. అంతేకాకుండా మీ వాహ‌నాన్ని గ్యారేజీలో కొన్ని రోజులు మ‌ర‌మ్మ‌త్తులు చేయాల్సి వ‌స్తే ఇంటికి తిరిగి వెళ్ల‌డానికి, స‌మీపంలో హోట‌ల్‌లో వ‌స‌తి పొందేందుకు న‌గ‌దును అందించే డైలీ అల‌వెన్స్ బెనిఫిట్ ఫీచ‌ర్ రైడ‌ర్ కూడా అందుబాటులో ఉంది.

ప్ర‌యాణ బీమా: చాలా మంది ఎండాకాలం వేడికి తాళ‌లేక విహార‌యాత్ర‌ల ప్ర‌యాణాలు పెట్టుకోరు. వ‌ర్షాకాలం వాత‌వ‌ర‌ణం చ‌ల్ల‌బడిన‌ప్పుడు కుటుంబంతో క‌లిసి విహార ప్ర‌యాణాల‌ను ఆస్వాదిస్తున్న‌ట్ల‌యితే మీ వ‌ద్ద ప్ర‌యాణ బీమా పాల‌సీ త‌ప్ప‌క ఉండేలా చూసుకోండి. వాతావ‌ర‌ణ ప‌రిస్థితుల వ‌ల్ల విమానం ఆల‌స్య‌మ‌యినా, రద్దయినా, ల‌గేజీ పోగొట్టుకున్నా, ఇంకా అనేక ప్ర‌త్యేక ప‌రిస్థితుల కార‌ణంగా ప్ర‌మాదాల‌ను ఎదుర్కోవ‌డానికి, ప్ర‌యాణ అవ‌స‌రాల ఆధారంగా అనేక బీమా పాల‌సీలు అందుబాటులో ఉన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని