Isha Ambani: అమ్మ నగను ధరించిన ఈశా అంబానీ

ముకేశ్‌ ఇంట పెళ్లి సందడి అంటే.. అందరి దృష్టి వారి ధరించే నగలు, దుస్తులపైనే ఉంటుంది. ముందస్తు వివాహ వేడుకల వేళ వారి ఇంటినుంచి రోజుకో కొత్త లుక్‌ బయటకువస్తోంది. 

Published : 10 Jul 2024 17:29 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ముకేశ్‌ అంబానీ (Mukesh Ambani) ఇంట పెళ్లి సందడి ఓ రేంజ్‌లో ఉంది. అనంత్‌-రాధిక కోసం ఆ కుటుంబం వరుసగా చేస్తోన్న ముందస్తు వేడుకలకు అంతా అబ్బురపడుతున్నారు. ఇక వారు వేసుకునే దుస్తులు, నగల గురించి అయితే చెప్పనక్కర్లేదు. ముకేశ్‌ సతీమణి నీతా, కుమార్తె ఈశా, పెద్ద కోడలు శ్లోక, కాబోయే కోడలు రాధిక.. ఒక్కో ఈవెంట్‌కు ఒక్కో లుక్‌తో దర్శనమిస్తూ సోషల్‌ మీడియాలో ట్రెండ్ అవుతున్నారు. తాజాగా ఈశా అంబానీ (Isha Ambani) వేసుకున్న కంఠాహారంపై అందరి దృష్టి పడింది. 

జులై 12న అనంత్‌-రాధిక వివాహం ఉండగా.. దీనికి ముందు మరోమారు వేడుకలు జరుగుతున్నాయి. వాటిలో భాగంగా గర్బా (గుజరాత్ నృత్యం) నైట్‌ నిర్వహించారు. దానికి ఈశా పింక్‌, గోల్డ్‌ లెహంగా ధరించారు. అలాగే తనతల్లి నగలను పెట్టుకున్నారు. వజ్రాలు, ఎమరాల్డ్‌లు (మరకతం) కలగలిసిన ఈ నెక్లెస్‌లో భారీతనం ఉట్టిపడింది. జడలోనూ డిజైనర్లు వజ్రాలు, జెమ్‌స్టోన్స్‌ పొదిగారు.

ఇదిలా ఉంటే.. దేశవిదేశాల్లో ఉన్న వివిధ కళలకు, కళాకారులకు పట్టం కట్టే లక్ష్యంతో ముకేశ్‌ కుటుంబం గతేడాది ‘నీతా ముకేశ్‌ అంబానీ సాంస్కృతిక  కేంద్రాన్ని (MNACC)’ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలోనే నీతా ఆ భారీ కంఠాహారాన్ని ధరించారు. ఇప్పుడు దానినే తల్లి నుంచి ఈశా తీసుకున్నారు. అందరిలానే అమ్మా, నేను, శ్లోక, రాధిక నగల్ని షేర్‌ చేసుకుంటామని ఓ సందర్భంలో ఈశా వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని